గ్రంధ విమర్శ , పుస్తక పరిచయం లేదా బుక్ రివ్యు

తెలుగు పుస్తకాలు, పరిచయాలగురించి ఆలోచించినప్పుడల్లా దాని మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పడినవి. సాధారణంగా ఈ పుస్తక పరిచయాలు, వాటి మీద విమర్శలు పత్రికలవరకే పరిమితం. ఆ పత్రికల యాజమాన్యాలకున్న అభిప్రాయాలనుబట్టి, ఆ వ్యవహారాలను చూసే విమర్శకురాలిని బట్టి ఇవి వుండేవి. అంతే కాకుండా ఆయా పత్రికల్లొ పుస్తక పరిచయనికి గాని విమర్శకుగాని కేటాఇంచిన స్థలాన్ని (అంటే స్పేస్) బట్టి కూదా విమర్శలుండేవి.

కాని అంతర్జాలము, బ్లాగులొచ్చిన తరువాత ఇక యాజమాన్యంకాని, స్థలాభావంకాని ఈ విమర్శని పరిమితంచెయ్యలేవు. బ్లాగరి ఇష్టానుసారమే ఈ విమర్శ కాని పరిచయం గాని వుంటుంది. కాబట్టి పుస్తక పరిచయం రాశిలోను, వాసిలోను గణనీయమైన మార్పుకిలోనవుతుంది. ఇది ఒక సరికొత్త పరిణామం.

పుస్తకప్రియులందరు తాము చదివిన మంచి పుస్తకాలను మిగతావారికి విరివిగా పరిచయంచేసే అవకాశం ఏర్పడింది. ఇది ఒక శుభ పరిణామం.

ఈనేపధ్యంలో, మంచి పుస్తకాలు వాటి పరిచయాలు ఇంకా పెరగాలని కోరుకుంటూ, పాత టపా ఒకటి ఇక్కడ ఉటంకించడమైనది.

పుస్తకాలు చదివేవారు తగ్గిపొయ్యారు. కొని, చదివేవారు ఇంకా తక్కువ. వ్రాసి అచ్హొత్తించినవారికి, తన పుస్తకం ఇంకెవరన్నా కొనుక్కుని చదువుకుంటే చాలా సంతొషం. అందుకని పుస్తకాలని పరిచయం చేసేవారు ఈ విషయాలను గుర్తుంచుకుంటారని, ఈ క్రింద ఉదహరించించిన వివారాలు పాఠకులకి అందుబాట్లో ఉంచుతారని, ఉంచాలని విజ్ణప్తి.

విశాలంధ్ర పబ్లిషింగ్ హౌజ్ హెడ్ ఆఫీసు, బాంకు స్ట్రీట్, అబిద్స్, హైదరాబాదులో వుంది. దాని బ్రాంచెస్ ని, విశాలంధ్ర బుక్ హౌజ్ గా వ్యవహరిస్తారు. అవి దాదాపుగా అంధ్రదేశం అంతటా వున్నవి.

పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించిన పుస్తకాలన్ని వారి బ్రాంచెస్ లో వుంటాయి. పబ్లిషింగ్ హౌజ్ డిస్ట్రిబుషన్ కి తీసుకున్న పుస్తకాలుకూడా ఈ బ్రాంచెస్ లో వుంటాయి.

కాని కొంత మంది ప్రచురణకర్తలు తమ పుస్తకాలని బ్రాంచెస్ ఐన, విశాలాంధ్ర బుక్ హౌజ్ కే డైరెక్తుగా ఇస్తుంటారు. ఆ పుస్తకం ఆ బ్రాంచ్ కే పరిమితం అవుతుంది. కాబట్టి పుస్తకం బ్రాంచెస్ అన్నిట్లొ లభ్యమా అన్నది తెలియజెయ్యలి.

ఫొను నెంబర్లు , పని వేళలు కూడా తెలియజేస్తే బాగుంటుంది.

అశోక్ బుక్ సెంటర్ ((విజయవాడ), నవయుగ (హైదరాబాదు), నవొదయ (విజయవాడ),నవొదయ
(హైదరాబాదు),ప్రజాశక్తి కి కూడా బ్రాంచెస్ వున్నవి.

* వారి బ్రాంచెస్ అన్నిటిలొను లభ్యం అని అంటే సరిపోతుంది.

రచయిత ఈమైల్ అడ్రెస్స్ ఇస్తే ఇంకా బెస్టు.

అస్సలు రెవ్యు చేయ్యడమే గొప్ప. ఇంకా ఈ వివారాలన్నికూడానా అని పెదవి విరవకండి.
ఒక మంచి పుస్తకాన్ని ప్రొత్సాహించాలనెగా ఈ తాపత్రయమంతా?

ఆ పుస్తకం చదివి రెవ్యు రాయడానికి వున్న ఓపిక, ఈమాత్రం చిన్న విషయాన్ని కనుక్కోవడానికి వుండదా! మీఓక పుస్తకం ప్రచురించి చూడండి. మీకే అర్ధమవుతుంది!

ఇక లైబ్రేరినుంచి తెచ్హుకుని చదివే పుస్తకాలను పరిచయంచెయ్యాల్సి వచ్హినప్పుడు బ్లాగర్ - సౌమ్య ఏం చెయ్యాలని అడిగారు. తోటి బ్లాగర్ కొత్తపాళీ చెప్పినట్టు పుస్తకంలొని రెండో పేజిలొ వున్న వివరాలైనా ఇవ్వాలి. మాములుగా అక్కడ

  • పుస్తకం పేరు,
  • రచయిత పేరు,
  • ప్రచురణకర్త పేరు,
  • వారి చిరునామా,
  • పుస్తకం ధర,
  • ప్రచురణ కాలం,
  • ముద్రణా సంస్థ పేరు,
  • ఐ అస్ బి ఎన్ సంఖ్య,
  • కాపీ రైటు హక్కులు
  • పుటల సంఖ్య (పేజ్ నంబర్లు అంటె ఎన్ని పేజీలున్నవి అని)
మొదలైన వివరాలు వుంటాయి. కనీసం ఆ వివరాలు ఐనా ఇస్తే మీ పాఠకుడు ఆ వివరా లతోనైనా పుస్తకం గురించి వెతుక్కోవడానికి అవకాశం వుంటుంది.

పుస్తక పరిచయానికి ఇంత కష్టపడాలా అని అడిగితే నేను అవును అనే అంటాను.
మరి మీరేమంటారు?


* తెలుగుబ్లాగు సభ్యులు - బ్లాగర్లు కొత్తపాళీ, సౌమ్య , స్వర్ణ గార్లకు కృతఙ్ఘలతో..
* పుస్తక సమీక్ష మీద సి . బి రావుగారి వ్యాసం (పొద్దు లోది) ఇక్కడ చదవొచ్హు.


4 వ్యాఖ్యలు:

S on June 14, 2007 at 2:56 AM   said...

అయితే, ఈ సారి నుంచి నేను కూడా నా పుస్తక సంబంధ వ్యాసాల చివర వాటి గురించి కాస్త info ఇస్తా.

Anonymous on June 15, 2007 at 11:59 AM   said...

every thing is fine but let us read it ,,and please make the letters clear!!!!!!!!!!!

Purnima on September 24, 2008 at 7:58 AM   said...

చాలా బాగా వివరించారు! నెనర్లు!

నెటిజన్ on September 24, 2008 at 9:45 PM   said...

@Purnima: మీరు ఇక ముందు వ్రాయబోయే పుస్తక పరిచయాలకి, విమర్శల‌కి, సమీక్షలకి ఈ టపాలోని సూచనలని పాటిస్తారని అనుకోవచ్చా? ఆలోచించుకుని జవాబివ్వండి!. గతంలో ఒకరిద్దరు అలా అన్నవారే చెయ్యగలిగిన అవకాశం ఉండీ, చెయ్యడంలేదు.

Post a Comment