ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి

గూగుల్ తెలుగు బ్లాగుల గుంపులొ, ఆన్లైన్లో తెలుగుని ఎలా వ్యాప్తిచెయ్యాలి అన్న దానికి - కొన్ని దశాబ్దాలక్రితం గొలుసు నవలలొచ్హిన రీతిగా గొలుసు-బ్లాగ్-నవలా రూపంలో వుంటే ఎలావుంటుందన్న ఆలొచనా పర్యవసానం ఇది. ఈ నేపధ్యంలొ "విహారి సినిమా నటుల బ్లాగులు" చదవడం తటస్థించింది.

అప్పుడు వొచ్చిన ఆలొచన ఇది: తెలుగులో గొలుసు-బ్లాగ్ నవల.
"విహారి సినిమా నటుల బ్లాగులు" లొ, విహారిగారే ఆ నటులను అనుకరిస్తే ఎలా వుంటుందో రాసి చూపించారు..పదిమంది వ్యాఖానించారు దానిమీద. తెల్గులోరాయడం మొదలుపెడితె తెలుగు ఒచ్హెస్తుంది. కొందరు గూగుల్ తెలుగుబ్లాగు గుంపు బ్లాగర్లు (తెలుగుబ్లాగ్ సభ్యులు), మీరు మొదలుపెట్టండి మీ వెనుక మేము వున్నామన్నారు.
ఇక్కడకి చేరాం.
  • రాయలనుకునే ప్రతి బ్లాగర్ రాయవచ్చు. తెలుగులొ మాత్రమె సుమా!
  • తెలుగుని ఇంగ్లిష్లో రాస్తారో, లెఖినితో రాస్తారో, ఇన్స్క్రిప్ట్ని కాంఫిగర్ చేసుకుంటారో, క్విల్ పాడ్ ని వాడుతారో, బరహ ఇన్స్టాల్ చేసుకుంటారో అది బ్లాగర్ ఇష్టం.
తనురాసినదానికి ప్రతిస్పందన ఎలాగున్నదని అమె రోజు బ్లాగు చూసుకొవడమే కాదు, తన వాళ్ళకు కూడా చెప్పుకుంటుంది.
వారిలో కొందరైనా ఆన్లైను వస్తారు.
కుతూహలం.
ఎమిటీ తెలుగు గొలుసు-బ్లాగ్ నవల?
ఎమిటీ గోల?
తెలుగులో చదువుకుంటారు.
వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. తెలుగులో.
కొత్త అభిప్రాయాలు.తెలుగులో.
కొత్త ఆలొచనలు. తెలుగులో.
కొత్త పదాలు. తెలుగులో.
భావ వ్యక్తీకరణ. తెలుగులో.
పదాలు వాటితొ ఆటలు.తెలుగులో.
వాటి అర్ధాలు.తెలుగులో.
తెలుసుకొవడం. తెలుగులో.
నెర్చుకొవడం.తెలుగులో.
యాస.తెలుగులో.
మాండలికం.తెలుగులో.
సామెతలు. తెలుగులో.
ఆచారం. తెలుగులో.
తన ముందు బ్లాగరు ఎం రాసారన్నది (తెలుగులొ)చదవాలి. తరువాతది ఎలావుందో (తెలుగులొ) అన్న ఉత్కంట వుంటుంది.
మూలనున్న శబ్దరత్నాకరం దుమ్ము దులపాలి.
సూర్యరాయంధ్ర నిఘంటువులో ఫలనా సంపుటం లేదే ఎలా?
పెద్దాబాలశిక్షలొ వుందెమో?
వేమన శతకంలోనా ఆ పద్యం. లెదా?
భాస్కర శతకంలోదా?
ఇదెదో చందమామలొ చదివినట్టు వుందె?
కాదు బొమ్మరిల్లులొ.
అబ్బె.
అవి రెండు కాదు.
బాలమిత్రలొ.
మీరందరు పప్పులో కాలేసారు.
అది ఆంధ్రజ్యొతివాళ్ళ బాలజ్యొతిలొది.
నాన్నా, బాలజ్యొతి ఎవరు?
***
అందుకే తెలుగు భాషాభిమానులందరకు ఇదే స్వాగతం.
రండి.
తెలుగులొ బ్లాగండి.
నేర్పండి తెలుగు.
రాయండి తెలుగులొ.
దిద్దండి తెలుగు.

కం వన్. కం ఆల్.
జాయిన్ "ది గ్రేట్ తెలుగు గొలుసు-బ్లాగ్ నవల సీరియల్".

కొన్ని సూచనలు:

  • రోజుకి ఒక బ్లాగర్ చొప్పున ఈ కధని ముందుకి తీసుకెళ్ళవచ్హు.
  • కధను పొడిగించడానికి ఉత్సాహమున్న ప్రతి బ్లాగరు ముందే తన పేరుని నమొదు చేసుకుంటే (కధలోని భాగం కాదు) ఆమెకి అవకాశం (ఫస్ట్ కం ఫస్త్ సర్వ్డ్ లాగా)వస్తుంది.
  • పొడిగించిన కధను ప్రచురించిన తరువాతే, ఆన్లైనులోచదువుకున్న బ్లాగరు తన కధను నిర్నీతసమయంలొపు పంపవలసివుంటుంది.
  • మిగతా నియమావళిని మీరందరు కలిసి నిర్ణయించండి.
మీరు మొదలుపెట్టండి మీ వెనుక మేము వున్నామన్నారు.
ఒకే..హియరె ఇజ్ ది బిగినింగ్. ఇదిగో మొదలు..
ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి


"అనగనగా రాజుండేవాడు. ......"


కంటిన్యూ ఇట్...

16 వ్యాఖ్యలు:

oremuna on June 13, 2007 at 1:04 AM   said...

రాజు చుట్టూ ఏడు రాజ్యాలు

నవీన్ గార్ల on June 13, 2007 at 5:51 AM   said...

ఇంతలో మా అబ్బిగాడు అడ్డుతగులుతూ "నాకు తెలుసు ఈ కథ ఏందో.....ఈ రాకుమారిని ఎవరో డెమన్ తీస్కెల్లిపోతాడు, రక్షించినవారికి హాఫ్ కింగ్డమ్ అనంగానే హీరో ప్రిన్స్ వచ్చి రెస్క్యూ చేస్తాడు అంతే కదా" అన్నాడు.

ఒక్క నిముషం స్థాణువైపోయాను నేను....."ఎంతైనా ఈ తరం పిల్లలు...." అనుకున్నాను నేను మనస్సులో.

మా వాడిని సముదాయించినట్లుగా "అది కాదు నాన్న..ఈ కథ వేరు...చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది" అన్నాను.

swathi on June 13, 2007 at 9:31 PM   said...

ఆ అమ్మాయి ఒక తెలుగు బ్లాగ్ రాయటం మొదలెట్టింది.(ఈ పాయింట్ కధని మలుపు తిప్పాలన్నమాట :)

ఎవరూ నా తర్వాత??

విహారి on June 14, 2007 at 7:56 AM   said...

ఆ రాజు గారి అమ్మాయికి రజ్య ఏలాలనిపించక రాజకుమారిడీ లాగా దేశాటనకు బయలు దేరింది.
అలా రాజ్యాలు దాటుకుంటూ హిమాలయా పర్వత శ్రెణువులకు చేరుకుంది. అక్కడ తలకిందులుగా వేలాడుతూ వున్న ఓ పెద్ద పులిని చూసి...

ప్రసాద్ on June 14, 2007 at 12:17 PM   said...

"ఓ పులిరాజా నీవిలా వేలాడుతూ వుండటానికి కారణ మేమిటి>" అని అడిగింది.
దానికి పులిరాజు తన కథను ఇలా చెప్పటం మొదలెట్టాడు....

ప్రవీణ్ గార్లపాటి on June 14, 2007 at 1:06 PM   said...

నా బ్లాగు చదివావా అంది...
పులి బిత్తర చూపులు చూస్తుంది, అంతలో...

రానారె on June 14, 2007 at 10:56 PM   said...

"ఓ అమ్మాయీ, నీ వర్ఛస్సు చూస్తే యువరాణిలా ఉన్నావు. నీ మీద నాకెందుకో నమ్మకం కుదిరింది. ఒక తప్సివి శాపవశాన ఇలా తలకిందులుగా వేలాడవలసి వచ్చింది. శాపవిమోచనం కలిగించగలవా? జన్మజన్మలకూ నీకు రుణపడి ఉంటాను" అంది పెద్దపులి. యువరాణి ఆశ్చర్యపడి, "ఓ వ్యాఘ్రరాజా, నీ నమ్మకానికి నాకెంతో ఆనందం కలిగింది. నాశక్తిమేర ప్రయత్నిస్తాను. ఇంతకూ నీకు శాపమిచ్చినదెవరు? కారణమేమిటి?" అని ప్రశ్నించింది. అప్పుడా పెద్దపులి గాఢంగా నిట్టూర్చి, ఇలా చెప్పసాగింది - ....

సిరిసిరిమువ్వ on June 15, 2007 at 2:45 AM   said...

ఏం చెప్పమంటావు తల్లీ! నేను మంచి వయస్సులో ఉండగా ఒక రోజు.........

మన్యవ on June 17, 2007 at 12:10 PM   said...

భూమి మీద అంతర్జాల విప్లవం ఆరంభమై, తెలుగులో బ్లాగటం మొదలుపెట్టిన యువరాణి వచ్చేవరకూ ఇలాగే ఉండు. ఆ తరువాత ఆమెను నీ శాప విమోచనం కోసం ప్రార్థించు. నీకు శాప విమోచనం కలగాలంటే ముందు ఆమె పదివేల సార్లు బ్లాగి ఆ తరువాత...

oremuna on June 19, 2007 at 2:17 AM   said...

ఇలా ఏదో చెప్పబోయేంతలో పక్కన పేద్దా ధ్వని వచ్చింది చుట్టూ ఏడు రాజ్యాల రాకుమారులు ఎదురు చూస్తున్నారు పులి ఏమి చెపుతుందా అని, వారంతా ఎలా వచ్చినారో మన రాకుమారికి అర్థం కాలేదు

Anonymous on June 21, 2007 at 4:12 AM   said...

ఈ కధని ముందుకు నడిపే కధకులందరూ, ఈ కూడలి వద్దనో, ఆ తెలుగు బ్లాగ్గర్ల గుంపులోనొ ఉండివుంటారన్న నమ్మకముతో, ఈ పొద్దో ఆ పొద్దో అనుకుంటు, ఆ తేనెగూడు వైపు పయనం మొదల...

sushma on August 10, 2007 at 12:07 AM   said...

మీ బ్లోగ్ చాలా బావుంది. మీరు తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu ఏo వాడతార?

Post a Comment