ఓ మార్గదర్శి నువ్వెక్కడ?

నవలల పేర్లలతో ఒక చిన్న కధ అల్లడం అన్నది ఒక ప్రయోగం. బహుశ రాయడం అలవాటున్నవారందరు ఎదో ఒక సందర్భంలో కొన్ని పేర్లతో ఇటువంటి ప్రయోగం చేసేవుంటారు. ఆ విషయంపక్కన పెడదాం.అదే బ్లాగులో ఐతే పది మంది పాల్గొనవచ్చుకదా. మరి వారికి ఉత్సహాన్నిచ్చేది కూడా చూడాలి కదా. అందుకని ఒక ప్రముఖ రచయిత (మరో కారణం ఏమి లేదు, ఈ నవలా రచయితకు అభిమానులెక్కువమంది, అంతే) రాసిన నవలలపేర్లతొ ఎలా వుంటుందన్న ఆలొచనా పర్యసానమే ఈ ప్రయోగం. అది మొదటి విషయం ఐతే రెండవది ముఖ్యమైనది ఏమిటంటే తెలుగులొ బ్లాగింగ్ ని పెంచడం.

అందులో మరొక ప్రయత్నమే "ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి". ఆ బ్లాగ్ చదవండి . "విహారీ" గారి బ్లాగు దానికి స్పూర్థినిచ్చింది. (వారెవరో తెలియదు, వారితొ పరిచయంకూడా లేదు). అది పధ్నాలుగు మందితో నిలబడింది.అది కదులుతుంది అన్న ఆశ ఉంది. ఎప్పుడన్నదే తెలియదు. ఇదంత ఫ్లాష్ బాకు.

ఇక ప్రస్తుతానికి వస్తే.
సో కాల్డ్ కధకులెవరు ఇంకా ముందుకి రాలేదు..పేజ్ హిట్స్ ఐతే బాగనే వున్నాట్టు లెఖ్హ.

కాకతాళియంగా మళ్ళీ"విహారి" గారి 'టపా' నే ఈ బ్లాగుకి కూడా కారణమయ్యింది.

వారి మాటల్లొనే "...ఏంటిది..ఏంటింది అని? బ్లాగు అవుడియాలు ఇలా అందరికీ ఒకలాగే వచ్చేస్తాయా?...(ఇంకా వుంది. పూర్తి పాఠం బ్లాగులొనే చదువుకోమని విన్నపం).

ప్లేగియారిజం, ఐ పీ ఆర్, కాపిరైట్
మనసుతొలిచెస్తున్న ఒక చిన్న విషయం.
నవలా రచయిత్రులు మూడు నవలలు ఆరు సినిమాలుగా వర్ధిల్లుతున్న రోజులవి.
'వొ రె షియస్ రీడర్" గా మిత్రులకి పరిచయం చేసినప్పుడు హాస్చ్హర్యపోవడమయ్యేది.

ప్రపంచికంలో అక్షరాలున్నది చదవడానికేగా. అందుకని తెలిసిన అక్షరాలన్ని చదవడంపరిపాటి. అందులొ ఆంగ్లం కూడా. ఆ రోజుల్లో "గర్లి" (ఆడపిల్లకు మాత్రమే) కామిక్స్ వచ్హెవి.లవ్వు, రొమాన్సు దండిగా, పుష్కలంగా వుండేవి. ముద్దులు, ముచ్హట్లుకూడా. సచిత్రాగానండొయ్!
ఇందాకటిది ఫ్లాష్ బాకు.
ఇప్పటిదేమో బాక్ గ్రవుండు.

ఒకానొక ప్రముఖ రచయిత్రిని కలవడం జరిగింది. అవిడ రచనలను అంతకు ముందే చదవడంకూడా ఐపోయింది.అప్పుడు ఆ రచియిత్రిగారిని మీ ఫలన నవల చదివాను. అలాటి కధే మరొక ఇంగ్ల్ ష్ గర్లీ కామిక్ లో చదివాను. రెండు ఒక కధ లాగే వున్నయి ఎమిటండి అని అడిగాను.

"దానిదేముంది ఈ విశాల ప్రపంచంలో ఒకరికి వచ్చిన "అవిడియ" ("విహారి" గారికి క్షమాపణలతో) మరొక్కరికి రాకుడదని లేదుగా. ముందు నాకు వచ్హేసింది, రాసేసాను", అని ఆ సదరు ప్రముఖ రచయిత్రిగారు శెలవిచ్చారు. ఇంగ్లిష్ కామిక్ వెలువడిన రెండేళ్ళకి అవిడ నవల ప్రచురింపబడ్డది. అది సత్యం. సదరు రచయిత్రిగారి గాలి పదిమందిలో తీసెయ్యలేకపొయ్యాను.
ఇప్పటికి అది బాధిస్తునే వుంది.

ఈ రోజున ఈ బ్లాగు ద్వారా దానికి కొంచెం ఉపశమనం కలిగింది.

తోటి బ్లాగరి మరొకరు, తెలుగుని వదిలేసి మరో భాషా ప్రాచుర్యానికి ఆర్ధిక సహయం చేస్తానని అన్న ఒక మాజి యం పీ అన్న మాటలని తలుచుకుంటు, "నయినా యార్లగడ్డా తెలుగు భాషాభివృద్ధి సంగతేమిటి? " , అంటూ తన అవేదనను పంచుకున్నప్పుడు కూడా దానికి ప్రతిస్పందించడం జరిగింది. కామెంటు అక్కడే చదువుకోవచ్చు.

అప్పుడు కూడా అంతే బాధ కలిగినది. పబ్లిక్ డొమైన్లొ వున్నదని ఒక తెలుగు పుస్తకాన్ని మరో భాషలోకి అనువదించాడు ఆ మహానుభావుడు. రాసినవారు జీవించివుండకపొవచ్హు కాని కనీసం వారి కుటుంబసభ్యులకన్న తెలియజేసివుంటే ఎంత మర్యాదగా వుండేది.

ఈనాడు ఇక్కడ వారిని గురించి బ్లాగుకోవలసిన అవసరం వుండేదా?

రోలె మాడల్స్ అంటారు, మార్గదర్శులంటారు.

ఎక్కడున్నారంటారు?

* విహారి గారు, మీ కామెంటు వాడుకున్నాను. మీమీద కాని, మీ ఉ ద్దే శాలమీదకాని కించ్చిత్తు అనుమానం లేదు. మీ టపా /కామెంట్ / వాఖ్య సహౄదయంతోనే (సరసమైనది) స్వీకరించబడింది.

1 వ్యాఖ్య:

Anonymous on June 25, 2007 at 7:53 AM   said...

మీరు భలేటోరే! మీరు ఇలా నా వ్యాఖ్యలు ముందు పెట్టి నన్ను కాస్త ముందుకు జరిపారు. నేనేదో అలా గాలి వాటుగా రాసేస్తానంతే అంతోటి దానికి క్షమాపణలు గట్రా..గట్రా లెందుకండి. పైపెచ్చు ప్రతి దానికి "గారు" గారిని తగిలిచేశారు. గారు గార్ని ఎడిటింగ్ గారు చేసి పడేయండి :-)

మీరు అన్నీ సవ్యంగా రాశారు. నో ప్రాబ్లెమో. అసలు నేనే మీకు బోల్డన్ని థాంకులు చెప్పాలి :-)

-- విహారి
htpp://vihaari.blogspot.com

Post a Comment