అమెరికన్ తెలుగూ'స్

ఫొను రింగుతోంది.
కాలెర్ ఐడి లో ఎవరిదో తెలియని నంబరు.
ఈ మధ్య కంటాక్త్ లిస్ట్‌లో లేని నంబర్లని అన్సర్ చెయ్యడం లేదు. వెధవ తలనొప్పి. అడ్డమైన వాళ్ళు ఫోను చేసి విసిగెత్తిస్తున్నారు.

మధ్యాహ్నాం రెండింటికి.

"హల్లొ"
"మీరు ...రేనా".
"అవును మీరేవరు?"
"నేను అమెరికా నుండి వచ్చాను. మిమ్మల్ని కలవాలి."
ఎక్కడ నుంచి వస్తే నా కేమిటంట.
పోనిలే ఎందుకో కలవాలనుకుంటున్నాడు.
దూరాభారంనుంచి వచ్చినట్టున్నాడుగా.
ఒత్త డిగానే ఉంది.
"సరె, రండి. ఈ వూరు పరిచయం ఉందా?"
"ఉన్నదండి. అఫీసు కొ చ్చెయ్యనా?"
"మీకు నా అఫీసు తెలుసా?"
"ఎందుకు తెలియదు. .....దగ్గిరేగా."
"అబ్బే. అది కాదు."
"......తెలుసా?'
"తెలుసు."
"అందులొ మొదటి అంతస్తులొ.." (అమెరికన్ తెలుగూ'స్ కి తెల్గు అంటే వల్లమాలిన ప్రేమ అన్న ఆలో చన, ఫర్స్ట్ ఫ్లోర్ అనకుండా ఆపింది. )
"ఆ సరే..అవును..ఈ అడ్రెస్ ఇస్తున్నారెమిటి?..మీరు ...లో కదా పనిచేస్తున్నది?"
"లేదు. (నేను ఫ్రీ లాన్సర్‌ని, అని అనబొయ్యి..పాపం ఎదో కలవాలంటున్నడు కదా) అవి మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఎంత సేపట్లో వస్తారు?"
"ఒక గంటాగంటన్నరలో వస్తాను."
"సరే. రండి."
ఇది జరిగి దాదాపు వారం రోజులవుతున్నది.
అతను ఇంకా రాలేదు.
అతని పని ఐపొయిందని తరువాత నాకు తెలిసింది.
అమెరికానుండి దిగివచ్చాడంతే! అమ్రికావాడు ఫాలో అయ్యే కొన్ని మినిమం కర్టెసిస్ కూడా ఫాలో అవ్వలేకపొయ్యడే.

ఇక్కడ అఫిసుల్లో కూర్చున్నవాళ్ళందరు వెధవాయిలా?
వాళ్ళ టైము, టైం కదా?
'సారీ', రాలేకపొతున్నాను అని చెప్పేంత ఇంగిత జ్ఞానము కూడా లేదా?
ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?

0 వ్యాఖ్యలు:

Post a Comment