నిగంటువు - నిఘంటువు

ఒక బ్లాగర్ సందేహం:
"డిక్స్నరీ గట్టిగా ఉన్నది.
అదే సమయంలో నిఘంటువు లో ఘ అనేది గట్టిగా తగుల్తుంది.
నిగంటువు అని పిలిస్తే ఎలా ఉంటుంది?
కనీసం ఒక తెలుగు పదాన్నయినా బతికించిన వారము అవుతాము".

దానికి మరొక బ్లాగర్ జవాబు:
"అదే సమయంలో ఒక తెలుగు అక్షరాన్ని చంపినవాళ్ళమౌతాం. ఇంగ్లీషు సరిగా
పలకలేకపోతే అది poor education. తెలుగు పలకలేకపోతే మాత్రం అది సంఘసంస్కరణ. దాని సరైన ఉచ్చారణ నిఘంటువే. ఎందుకు మార్చుకోవాలో నాకర్థం కావట్లేదు. మీరు నిగంటువు అనే రాయండి. అలాగే పలకండి. ఎవరు కాదన్నారు ? అక్షరాలు తగ్గించుకున్న తమిళంలో అన్యదేశ్యాలు రాయడం అసాధ్యమై కూర్చుంది."

ఈ డిస్కషన్లొ "తమిళుల భాషాభిమానం రూపాంతరం దాల్చిన కులాభిమానం." అన్నది మరొక అభిప్రాయం.
* * *

pariah = అంటే మాలవాడు అని 1936 ప్రతి, నాటి వెంకట్రమా అండ్ కొ వారి ప్రచురణ శంకరనారాయణగారి ఇంగ్లిష్ తెలుగు నిఘంటువు లో ఉంది.
(మీ దగ్గిరవున్న తెలుగువాడి నిఘంటువులో చూడండి.
అలాగే ఇంట్లొనో, ఆఫిసులోనో ఉన్న ఇంగ్లిష్ డిక్ష్‌నరిలో కూడ ఒక సారి చూసుకొండి. ఆ పదం ఉన్నదా అని, ఉంటే దానికి అర్ధం ఏమిచ్చారు అని).
అదే డిక్షనరి మనకి ఇంకా గతి. మన దౌర్భాగ్యం కాకబొతే ఎమిటి?
ఆక్స్‌ఫర్డ్ యునివర్సిటి ప్రెస్ వారి ఇండియన్ ఎడిషన్స్‌లొ ఆ పదం లేదు. ఆ పుణ్యం కట్టుకున్న మహానుభావుడు సుబ్రమణ్య స్వామి అని మనలో ఎంత మందికి తెలుసో ?

అదే ఆన్‌లైన్లొ Oxford Universityదానికి అర్ధం = pariah అంటే 'hereditary drummers' అని ఇచ్హింది. (ఇంకా ఆ పదం వివరాలకి ఇక్కడ Oxford University లొ చూడండి.)

మాట్లాడితే చాలు మన బ్లాగ్వీరులేకాదు మనలో చాలామంది బౌణ్యం అంటారు. (అంటే సాహితి.ఓ అర్ జి (sahiti.org) ఆన్లైన్‌లో "బ్రౌణ్యం" ఇంగ్లిష్ - తెలుగు "ఫ్రీ" కాబట్టా? ) బ్రౌన్ దొరగారు మన భాషకి బహు దొడ్డ సేవ చేసారు. దానిని ఎవరు కాదనరు. ఆ నాటికి అది సరిపొయినది. అంతే. నేటి పరిస్థికి అది పనికి రాదు.

ఎక్కడో చదివాను.
కొత్తపాళీ గారు తమ వాఖ్య లో అన్నారు.."అంకుల్స్" గొంతు చించుకుంటున్నారు అంటే సరిపోదు. తెలుగుని బతికించుకోవాలని.

"ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా తాగెస్తారు", అని కొంతమంది సునాయాసంగా మిగతావారిని ఉద్దేశిస్తు అంటుంటారు.
ఫ్రీ గా వస్తే కాదు.
ఇంకొక గతి, దారి లేక.
తెలిసినవారు చెప్పరు.
చెబితే వీరి వింటారా అంటే వినరు.
పోని స్వయంకృషితో నేర్చుకుంటారా అంటే "ఇక్కడ సంపాదనకే టైం లేదు", ఇంక ఇవన్నీ ఎక్కడ చదువుతామంటారు.
* * *
ఎం.ఎన్.రావుగారని వెనకటికి ఒక ప్రచురణకర్త వుండేవారు. రెండు రూపాయలకి తెలుగువాడి జేబులోకి పుస్తకాన్ని చేర్చినవారు.వారి ప్రచురణ సంస్థ పేరు EMESCO.తెలుగువాడి జేబులో కీ "ఇంగ్లిష్ - తెలుగు", "తెలుగు - ఇంగ్లిష్" నిఘంటువుని చేర్చిన ఘనత వారిదే.

(EMESCO కి ప్రస్తుత అధినేతలైన గౌరవనీయులు దూపాటి విజయ కుమార్‌గారికిన్ను ,"కీర్తి" శేషుడైన ఈ రావుగారికి ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుత అధినేతల వద్ద ధనము గలదు.Period.)

దురదృష్టవశాత్తు ఈనాడు మనలో చాలా మంది, LIFCO అన్న పేరుతొ, చెన్నైలోని తమిళ ప్రచురణకర్త ప్రచురిస్తున్న ఇంగ్లిష్ తెలుగు నిఘంటువు వాడుతున్నారు. LIFCO వాడు తమిళుడు. "మనవాడు దా".

పోని ప్రస్తుతం వాడుకలో వున్నవి చూద్దామా అంటే అది కూడా కాపిరైటు లేనివి కాబట్టి అదే శంకరనారాయణ, అదే సి. పి బ్రౌన్ నిఘంటువును మనం కొనుక్కుని చదువుకోవలసివస్తుంది. (మరి వీటిని ప్రచురించిన AES వాడు "ఢిల్లీ భాయి").ఇవి ప్రచురణాకాలం నుంచి నేటిదాకా కూడా, కాదు, రేపు మన మునిమనవళ్ళదాకా వుంటాయి. మన ముత్తాతలకాలంలో ఉన్న ఇంగ్లిష్ భాషకి అవి అర్ధాన్ని ఇవ్వగలుగుతవి తప్ప నేటి 'dude' కి నేటి fellowకి అవి అర్ధాన్నివ్వలేవు.

కాబట్టి నేటి ఈనాడు మంచిగా చదవండి, నేటి అంధ్రజ్యొతిని మంచిగా చదవండి, నేటి వార్త మంచిగా చదవండి. మీ పిల్లలను చదవమని ప్రొత్స"హింసిం"చండి.

పెళ్ళాంని, పెల్లంగా పిలవండి.
పళ్ళేన్ని పల్లెంగా పిలవండి.
పళ్ళన్ని పల్లుగా పలకండి.
తంతి తపాల శాఖ అఖర్లేదు.
తంతే తపేల సాక సరిపోతాది.
అప్పుడు నిఘంటువులు అక్ఖర్లేదు.
వితంతువైన నిగంటువు అందరికి సరిపోద్ది!
దాన్నేసుకుని అందరం కులుకుదాం.

వాడెవడో అంటున్నాడుగా, "ఛీ దీనమ్మ, ఇది కాదే నా తల్లి. నేను దీనికి పుట్టలె" అని.

మొత్తానికి తెలుగుని చంపేసి, పాతి పెట్టండి.

అప్పుడు పాడుకుందాం, " మా తెలుగు తల్లికి శోకనీరాజనాలు .." ఒక నిమిషం మౌనం పాటించిన తరువాత.

అది ఏ రొజే ముహుర్తం నిర్ణయించండి.

Labels:

6 వ్యాఖ్యలు:

oremuna on July 18, 2007 at 11:23 PM   said...

బాగా తిట్టారండీ

అయినా కొందరు మారరు

వీరికోసం నిగంటువులు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు. వారి పెల్లాం పిల్లలు సక్కగానే ఉంటారు. వారి పిల్లలు తెల్గూలోనో టెల్గూలోనో మాటాడుతూనే ఉంటారు.

Anonymous on July 19, 2007 at 9:24 AM   said...

ఫ్రీ అని కాదండి అది అందుబాటులో వుంది కాబట్టి వాడుతున్నారు.

Anonymous on October 26, 2008 at 6:13 AM   said...

చాలా బాగా, పట్టించుకునేవారికి గట్టిగా తగిలేలా రాసేరండీ. మీలాటివారు ఇలా వారానికోమారు రాస్తుంటే మనవాళ్లలో సగంమందికైనా తడుతుందేమో మీ బాధ. (నాబాధ కూడా అదేలెండి.)మనవాడు దా".:). బ్రౌణ్యం ఇప్పుడు పనికిరాదు అన్నమాటలో చాలా నిజం వుంది. కంచుకం అంటే shirt అని ఒక అర్థం ఇచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రౌనుకాలంలో కూడా మనవాళ్లలో కొందరు ఇంగ్లీషువాడే మనకి తెలుగు చెప్పాలని వాదించినవారున్నారు. తెలుగువారి సాంస్కృతిక పటిష్ఠత (ఇంగ్లీషు టైటిలుకి నా అనువాదం) మీద ఓపుస్తకం ఇప్పుడే చదవడం పూర్తి చేశాను. ఇవాళో రేపో నాబ్లాగులో పెడతాను సమీక్ష.
మాలతి

సుజాత వేల్పూరి on October 26, 2008 at 10:48 AM   said...

అబ్బ, ఎంత మాటనేశారండి.."వితంతువైన నిగంటువు.."!

"ళ" ని "ల" గా పలికే వాళ్ళని ఏం చెయ్యాలో అర్థం కాదు నాకు!

"మంచిగా" కూడా అర్థం కాదు!

netizen నెటిజన్ on October 30, 2008 at 9:52 PM   said...

@tethulika: మాలతి గారికి, శ్రీ రామ బుక్ డిపో అని, శివకాశిలోనో, మధురై లోనో ఒక ప్రచురణ కర్త ఉన్నాడు. వాడి తెలుగు అక్షరాలతో ఒక్క పాఠ్యపుస్తకం ప్రచురించాడు. అందులోని బూతులు మీకు తెలిస్తే, తుపాకి పట్టుకుని అమెరికా నుండి అమాంతంగా ఈ గడ్డ మీద వాలి, వాడిని మీరు షూట్ చేస్తారన్న గాఢ విశ్వాసంతో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వటంలేదు.

@సుజాత: "షురు" చిరంజీవి ప్రజా అంకిత యాత్ర (?) అయ్యిందట. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో శీర్షిక అది. మాండలికాలు, జాతీయాలు, నుడికారాలు, ప్రాంతీయ యాస భాషని సుసంపన్నం చేస్తాయి.

అందుకే ఈనాడు, ప్రాంతీయ వార్తల కోసంప్రత్యేకంగా (టబ్లాయిడ్‌ని) మొదలుబెట్టింది. ఈ రోజున విజయవాడలో గాంధీనగర్‌కి ఒక పేజి, నెల్లురులో నాయుడు పేటకి ఒక పేజి, సిరిసిల్లలో వారికి ఒక పేజి, శ్రీకాకుళం వారికి ఒక పేజి ఉన్నవి - ప్రాంతియ వార్తలకోసం. ఈ "షురు" అన్నది ఆ ప్రాంతం వార్తలకూ పరిమితం చెయ్యవచ్చుకదా? సాంకేతిక కారణాలేమున్నవి దీనికి? తెలంగాణ వాడు, ఆంధ్రలో లేడా, వీరిద్దరు రాయలసీమలో లేరా? మరి స్థానిక అచార వ్యవహారాలు తెలియకుండానే జీవనం సాగిస్తున్నారా?

బలమైన వెన్నుమూకన్న సంపాదకురాలు లేని ఈ పత్రికా వ్యవస్థను చూసే కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తున్నది. వీరూ, వీరి ప్రాంతియ దురహంకారము, కులగజ్జి, కాసుకు కక్కుర్తి, బుడ్డీలకు దాసోహం, నైతిక బలహీనతలూ, చీ, చీ!!!

Post a Comment