సినిమా బాగుందా ?

నువ్వు చూసే సినిమా మీ కులపోడిదా ?
అవునా.
ఎన్ని సార్లు చూసావు?
అస్సలు చూడలేదా.
ఎందుకని చూడలేదు బే.
మన కులపోడు సినిమా మనం చూడకపోతే మిగతా నాయాల్ళు చూస్తారా?
నీ యవ్వ..ఫ్హొ..తొందరగా చూడు, నీ ఎంకమ్మ!
* * *
రావి శాస్త్రి బాపనోడి పేరేగా?
పీడీత తాడిత వర్గానికి చెందిన వాళ్ళకోసం చెత్తో పెన్ను పట్టుకున్నాడుగా?
వర్గ రహిత, కులరహిత సమాజం కోసం, వాళ్ళ భాషలో ఓ తెగ రాసి పారేసాడుగా?
ఏం మరి, పేరులో ఆ "శాస్త్రి" అని పిలక అలాగే ఉంచుకున్నాడేం?

* * *

రమణా రెడ్డా'?
ఆ రెడ్డి కూడా "కమ్మిస్ట్" భావ జాలం నుంచి వచ్చినాడే గందా?
మరేం "రెడ్డి"పీకేయ్యలేదేమి?

* * *

శ్రి శ్రి పేద్ద తాగుబొతుగా?
ఇద్దరు పెళ్ళలంటగా?
మరి ఆయన కపిత్వం సానా గోప్పగా ఉంటదటగా?
మరి ఆయన నీతులు జేబుతాడు, మేము వినాల్నా?

ఒహొ..అది వారి పర్సనల్ విషయమా.
మరి ఆ సినిమా వొడు ఏ కులప్పోడైతే నీ కెందయ్యా?
సినిమా బాగుంటే సూడు.
బాగొమాక పొతే, యెళ్ళమాకు.

నాకో నాయమున్ను..నీకో నాయమా.
బుద్ధుండే మాట్లాడుతున్నావేంది?

ఔను రా నా అలి, నా కులపుదే.
యేం? నీ నమ్మకంకోసం నేను ఇంకొ కులపుదాన్ని సెసుకోవాలా?
ఎందుకు సేసుకోవాలో సెప్పు.
* * *
స్త్రీ కపిత్వం అన్నావు.
దళిత సాహిత్యం అన్నావు.
తెలెంగాణా కత అన్నావు.
స్త్రీ వాదం అన్నావు.
బైబులు తెలుగు అన్నావు.
రాయలసీమ తెలుగు అన్నావు.
* * *
నీ యయ్యా ..ఇంకా ఏమని నరుకుతారురా మనుషుల్ని?
సదువుకున్నరుకదరా మీరందరు..ఈ నరుకుడేందిరా..ఈ సంపుదేండిరా?
రేపు నీ పిల్లా, జేల్లా ఇలా నరుకుంక్కుంటా పోతా వుంతే..ఇక మిగిలేదేందిరా?

వాడు ఏ కులపోడైతే నీ కేందిరా?
దానిది ఏ కులమైతే నీ కెందే?
నీను సాక మని అదిగిందా..పెట్టమని అడిగిందా?

బతకండి బే!
మనిషి లాగా బతకండి బే!
త్ఫు..త్ఫు......

* ఇక్కడి వాఖ్యలు చదివిన తరువాత..మనసు చెదిరిన తరువాతా, రాగ ద్వేషాలాకతీతంగా ఆలోచించ లేక..

5 వ్యాఖ్యలు:

Anonymous on July 20, 2007 at 8:09 AM   said...

అంతగా బేజారు పడకు బ్రదర్. దాన్ని మింగించుకోవటానికి కొంచెం సమయం పడుతుంది.

అంతెందుకు అమెరికాలో కూడా "మన కులం వాడు సినిమా వేస్తేనే వెళ్దాం లేక పోతే వెళ్ళద్దు" అనే ప్రబుద్దులు కూడా వున్నారు.

-- విహారి

Bhãskar Rãmarãju on July 20, 2007 at 10:52 AM   said...

అన్న గారు
నేనొక విషయం చెప్తే మీరు ఆశ్చర్య పోయి బత్తాయి కాయలు తింటారు. ఇక్కడ మా అపార్టుమెంటులో ఆడోళ్ళూ ఇలా పరిచయం చేసుకుంటారు. ఒకావిడని ఇంకొకావిడ వాళ్ళా దోస్తానా తో ఇలా అంటే "అక్కా!! ఈఅక్క xyz" అంటే వాళ్ళ కులమే అని హింటు, "అక్కా!! ఈమె xyz" అంటే వేరే వాళ్ళు అని. ఒకరోజు మా మితృడొకడి ఇంటికి వెళ్ళాం భొజనాలకి. చాలామందే వచ్చారు. వీడంటాడు, భాస్కరు ఆ మూలన కూర్చున్నోడు శాఖాహారే అని. నాకు అర్ధంకాలా. బ్రదరూ నేను మాంసాహారినే (ఇంట్లో కాకపొయినా బయట) కదా అన్నా. మళ్ళి, అదేలే అతను కూడా శాఖాహారే అంటాడు. అర్ధంకాక బుర్ర గొక్కుంటుంటే చివరాఖరికి చెప్పాడు, మీవోళ్ళే బాపనోళ్ళు అని. అమేరిచాలో ఉంటూ కుల పిచ్చిని ఇంకా పెంచుకుంటున్నారు మన వాళ్ళు.

Anonymous on July 24, 2007 at 2:44 AM   said...

మరీ ఇలాంటి వాల్లు ఉన్నారని విన్నా ఇప్పుడు అనుభవిస్తున్నా బాబు మరి ఇంత పిచ్హి వుంటుందని కలలొకుడా వుహించివుండను.

దిలీప్.

Post a Comment