అతనికి ఆకలి వేస్తోందట.

Posted by netizen నెటిజన్ on Thursday, August 16, 2007
దొరస్వామి రోడ్డు మూల మీద ఒక ఉడిపి హోటలుండేది.
ఇప్పుడున్నదో లేదో తెలియదు.
దాని ప్రక్కనే ఒక బోరు పంపు ఉండేది.

* * *

రాత్రి పూట రూమ్‌కి వెళ్ళేటప్పుడు, మా దగ్గిర ఒక సిగరేట్టు తీసుకునేవాడు.
గూడ్‌నైట్ చెప్పేవాడు.
నేను వెనక్కి తిరిగి వెళ్ళీ పొయేవాడిని.
ఒక రోజెందుకో అనుమానం వచ్చింది.
అతనికి తెలియ‌కుండా, ఆ మూల చీకటిలో నక్కాను.
నేను వెళ్ళిపొయాననుకున్నడు కాబోలు,ఆ పంప్‌ని దభా దభా బాది,
నీళ్ళతో కడుపునింపుకున్నాడు.
రోజు అంతేనంట.
డబ్బులు లేవు.
అడగలేడు.
ఆకలి అని చెప్పలేడు.
ఒకటా రెండా.
నెలలు గడిపాడు.
సంవత్సరాలు నెట్టాడు.
ఆ అకలితోనే, డాక్టరేట్ సంపాదించుకున్నాడు.

4 వ్యాఖ్యలు:

Anonymous on August 19, 2007 at 11:46 PM   said...

uhhh ... chiranjivi or sreehari
confusing ...
shilpa setty aite kadu ...

Anonymous on August 19, 2007 at 11:48 PM   said...

uhooo...
chiranjeevi or sreehari ...
confusing
shilpa setty aite kaadu ...

netizen on August 20, 2007 at 5:22 AM   said...

@కొత్తపాళీ: అతను శాఖాహారి.
అతనికి ఒక అన్న.
సవతి తల్లి.
అమె ద్వారా ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు.
తండ్రికి ఇతనంటే ఇష్టంలేదు.
ఆన్నలు ఆర్ధికమైన భారం తమ మీద పడకుండా ఇతనిని దూరంగా ఉంచారు.
బ్రతికిన పద్ధతి, జీవితంలో తిన్న దెబ్బలు అతనికి కొన్ని పాఠాలు నేర్పినవి.
అందులో ఒకటి, చెయ్యి జాచి అడగకపోవడం.
తన స్నేహానికి తగనివారిదగ్గిరనుండి ఏమి అశించకపోవడం.
స్కాలర్‌షిప్ ఒక నేల వస్తే మరొ మూడు మాసాలు అందేది కాదు.
ఒకపూట భోంచేంస్తే ఆరు పూటలు ఆకలి.
తల దాచుకోవడానికి రూంఇచ్హిన స్నేహితుడు తన చెల్లెలికి కట్నం ఇవ్వలేక బాధపడటం చూసాడు.
తనే, ఆ అమ్మాయి అంగీకరిస్తే చేసుకుంటాను అని అన్నాడు.
కులంకాని అమ్మయిని చేసుకుంటే నిన్ను వెలివేస్తానని తండ్రి అన్నాడు.
అతను ఆ అమ్మాయిని చేసుకున్నాడు.
ఈ దేశం, ఈ ప్రజలు వద్దనుకున్నాడు.
ఆ అమ్మయితో, విదేశంలో స్థిరపడ్డాడు.
వారికొక్కడే బాబు.
జీవితం మీద, తన విలువల మీద "విశ్వాస్"అంతో సుఖంగానే బతుకుతున్నాడనిపిస్తోంది.
అతనే..డాక్టరేట్ సంపాదించుకున్నాడు.
ఇంతకంటే వ్యక్తిగతవివారాలివ్వడానికి మనసొప్పడంలేదు.
ఆ స్నేహితుడు దూరమైపొయ్యాడే అని బాధగా ఉంది.

@anonymous:
మార్గదర్శులెక్కడో లేరు.
మనమధ్యే ఉన్నారు.
కాని మనం వారికోసం ఇంకెక్కడో వెదుకుతూవుంటాం.

Post a Comment