వినాయకుడు - నాయుడు గారు - రాజుగారు - ఎం డీ గారు - రెడ్డి గారు లేరు.

Posted by netizen నెటిజన్ on Sunday, September 16, 2007
వినాయకుడి చవితికి సంభందించి..
గణెష్ బొప్ప మొరియ(?) కొన్ని చోట్ల ఇలాను మరికొన్ని చోట్లా ఇలాను - గణేష్ బొప్ప వొరియా(?)చదవడానికి కనబడుతుంది.
ఇది తెలుగు భాషేనా?
అర్ధం ఎమిటో?

గణేష్ పూజా?
వినాయక పూజా?
వినాయక చవితా?

అమ్మా, నాన్నా, చెల్లి, మరేమో, పక్కింటి వాసువాళ్ళ అమ్మతోను, (ఆంటికాదు), అలాగే మరేమో సుజాత వాళ్ళ వొదినతోను కలిసి మార్కెట్‌కి వెళ్ళీ అక్కడ అన్ని కొనుక్కునే వాళ్ళం. దేవుని బొమ్మ, గొడుగులు, పూలు వగైర, వగైరాలు.

మొన్న ఆయన అంటున్నారు - వారి మిత్రుడొకరు, ఆ పక్కనేదో ఊరుందంట. అక్కడ ఒకాయన శుభ్రంగా మడికట్టుకుని వినాయకుడి "మట్టి"బొమ్మలు చేస్తాడంట. అవే వాడుతారంట పూజకి. మడి కట్టుకుని చేసిన బొమ్మనే మీరు పూజకి వాడుతున్నారా? మీరు కూడా అంతేనా?

అదేదో ఊళ్ళొ రోడ్డు మీద వినాయకుడి విగ్రహాన్ని పెట్టారంట. అది నలభై అడుగుల ఎత్తు, పాతిక అడుగుల వెడల్పు ఉందంట.

ఇంకో ఊళ్ళోనేమో నలభైఒక్క అడుగుల ఎత్తు ఉందంట.నిజమా? అంతంత పెద్ద విగ్రహాలైతేనే వినాయకుడు అందరిని అనుగ్రహిస్తాడా?

ఇదివరకేమొ వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ వినాయకుడిని చూసేవారు.
అక్కడేమొ దణ్ణం పెట్టుకుంటారు.
ఇప్పుడేమొ అందరికి యెస్ ఎం యెస్ లు ఇస్తున్నారుగా - వినాయక చవితి శుభకాంక్షలు అని! అంతేనా?

పైగా ఈ టీ వీ లో చూపించారు.
"రాజు"గారు వారింట్లో కుటుంబంతో వినాయక చవితి చేసుకున్నారంట!
అలాగే "శాంత బయోటెక్" ఎం డి గారు వారి కుటుంబంతో చేసుకున్నారంట?
"నాయుడు"గారు పార్టీ ఆఫీసులో చేసుకున్నారంట!

మరి మీరు ఎవరింట్లొ చేసుకున్నారు?

మరి ఆయన చిన్నింట్లొ చేసుకున్నడా లేక పెద్ద ఇంట్లో చేసుకున్నాడా?

మరి ఆబిడ ఏవరింట్లో చేసుకుందో?

చెప్పండి.

మీలాంటి పెద్దొళ్ళు చేబితేనెగా మాబోటి చిన్నొళ్ళకి తెలిసేది?
మేము మా పిల్లలకి చెప్పుకోవాలి కదా?

దయచేసి వివరంగా చెప్పండి.
ఈ బ్లాగర్‌కి పైన ఉదహరించిన విషయాలు అర్ధంకావటంలేదు.
మీరేమన్నా ఆ సందేహాలు తీర్చగలరా?

0 వ్యాఖ్యలు:

Post a Comment