రాముడు మద్యపాన ప్రియుడా?

Posted by netizen నెటిజన్ on Friday, September 21, 2007రాముడు మద్యపాన ప్రియుడా?
మాంసాహారా?
క్షత్రియుడు కదా!
క్షత్రియ ధర్మాలే కదా?
మరి ఇవన్ని "ఒప్పు"లే కదా?
కాదా?

తమిళనాడులోనున్న తండ్రి మాటలకి,
ఎక్కడో కర్నాటకలోని కూతురి ఇంటిమీద దాడి సబబేనా?
దారిన పొయ్యేవారిని పెట్రొల్ పోసి కాల్చేయ్యడం హిందు మత సమ్మతమా?

7 వ్యాఖ్యలు:

మేధ on September 21, 2007 at 3:48 AM   said...

hఇక్కడ నాకు ఒక విషయం అర్ధమవలేదు.. అసలు రాముడు అనేవాడే లేడనేది కరుణానిధి గారి వాదన కదా.. రాముడు, రామసేతు అన్ని వాల్మీకి కల్పించిన పాత్రలని ఆయన ప్రగాఢాభిప్రాయం.. అలాంటప్పుడు, రాముడు తాగితే ఆయనకెందుకు, ఇంకేదో చేస్తే ఆయనకెందుకు..?!

మేధ on September 21, 2007 at 3:52 AM   said...

అలానే బి.జె.పి. వాళ్ళు చేసిన పని కూడా గర్హనీయం.. వాళ్ళు ఆయన కూతురింటి పైన రాళ్ళు వేయడమే కాదు.. అమాయకులైన ఇద్దరిని సజీవదహనం చేశారు(మొన్న జరిగిన బస్సు దహనంలో).. అసలు హిందూ మతమే కాదు.. ఏ మతం వీటిని సమ్మతించదు..

RAMABHAKTHAHANUMAAN on September 21, 2007 at 10:01 AM   said...

బిజెపి వాళ్ళు చేసినపనే నీకు కనిపించిదా? వాడు వాగే వాగుడు వినిపించట్లేదా?కొన్ని కోట్ల హిందువుల ఆరాధ్యదైవం రాముడిపై మాట్లాడినట్టు వాళ్ళలో పదో వంతు వున్న వేరే మతస్తుల దేవుడిపై అలా మాట్లాడి చూడమను.ఏంజరుగుతుందో తెలుస్తుంది.హిందూ అనగానే ఏదో లోకువ,వాళ్ళని ఎవరైనా ఎంత నీచంగా అయినా విమర్షించొచ్చు అన్నట్టుంది నీవరస.

వికటకవి on September 21, 2007 at 10:26 AM   said...

నెటిజెన్ గారూ, బాగా చెప్పారు. అమాయకుల మరణానికి కారకులయిన వారిని తప్పక శిక్షించాలి. కానీ వార్తల ప్రకారం అది బీ.జే.పీ కాదు, వీ.హెచ్.పీ గట్రా. కాకపోతే, ఇవన్నీ ఒకే చెట్టు కొమ్మలన్నిది వేరే సంగతి.

మేధ గారు,

మీ కామెంట్ సూపరు.

మరమరాలు on September 21, 2007 at 10:39 AM   said...

అసలు రాముడు లేనిప్పుడు రాముడు మద్యం ఏలా త్రాగినాడు అబ్బ!!!!!!!!! ఈ 'కరుణ'మయుడి గోలకీ ఆ బుద్ధి లేని వామపక్షాల సన్నాయి తోడు.
-మరమరాలు

Mallik on September 23, 2007 at 4:50 AM   said...

రాముడు మద్యం తాగినట్లు వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ఈ ప్రస్తావన సుందర కాండం లో హనుమంతుడు సీతమ్మతో మాట్లాడుతున్నపుడు కనిపిస్తుంది. "అమ్మా. నువ్వు కనిపించకుండా పోయిన తర్వాత రాముడు నిద్రహారాలు మానాడమ్మా,మద్యమాంసాలు కూడా ముట్టట్ట్లేదు" అని హనుమంతుడు అంటాడు. వానరులంతా మద్యం తాగుతారు. ఇది హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉండడం వలన తెలిసింది. అందువల్లనే రాముడు తాగడం చూడకపోవడం వలన హనుమంతుడు భార్యా వియోగం వలన రాముడు తాగడం లేదని అనుకున్నడు. అంతే. దీని కోసం బుర్రలు బద్దలు కొట్టు కోవక్కర్లేదు. కరుణానిధి లాంటి మూర్ఖులు వాళ్ళకన్నీ తెలుసనుకుంటారు.

Anonymous on November 10, 2007 at 10:45 AM   said...

రాజకీయ నాయకులకు ఇదేగా పని. జనాలను ప్రశాంతంగా ఉండనివ్వరు.

Post a Comment