ఎవరు?

Posted by netizen నెటిజన్ on Friday, September 28, 2007




పాపం, ఆవిడకు ఆ కెమెర్‌మన్ అలా జూమేస్తున్నాడు అని తెలియదేమో!
పోనిలెండి, అవిడకు ఆ మాత్రం "బెనిఫిట్ ఆఫ్ డౌబ్ట్" ఇద్దాంలే.
అస్సలు ఆవిడ అక్కడికి ఇంటర్వ్యు కి వచ్చిందండి.

ఇంకా గుర్తు రావడంలేదా?

ఇది ఎవరు గుర్తుపట్టలేదా?

"మెరుగైన సమాజం కోసం" పోరాడుతున్న వారి కెమరమన్ ఈవిడను, ఈవిడ సంపదను అన్ని సార్లు జూమేసి, క్లోజప్‌లో మరీ చూపించాడు గదండి.ఐనా గుర్తులేదా? అన్నట్టు, ఈ ప్రోగ్రాం ని అంకర్ చెసింది అబ్బాయి కాదండి, అమ్మాయే! ఎంత ధైర్యం అంటారా? ఇందులో ధైర్యం ప్రశ్న ఏముందండి బాబు?

మరి మీరు చూడలేదా?

బహుశ అతనికి తెలియదేమో, మీరు మీ అన్నయ్యతోనో, చెల్లెలితోనో వారి న్యూస్ చూస్టుంటారని. సిగ్గుతో మీరు అక్కడినుండి వెళ్ళిపోయ్యుంటారులెండి.

అంటే మరి "మెరుగైన సమాజం" మార్పులకు లోనవుతుంది కదండి? అందుకని విలువలు మారిపోయినవి కదా, కాబట్టి ఇలాంటి సీన్లు, అందరు కలిసి, ఏది, అందరు, అంటే, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న,తమ్ముడు, ఒదిన, భార్య, భర్త, బాబాయి, పిన్ని,అందరు కలిసి చూడాలి అని వారి ఉద్దేశం ఐవుంటుందండి. కదా?

అలాగైతే సిగ్గూ, లజ్జా, బిడియాలుండవుకదండి, మరి.
ఎంచక్కాను అందరు కలిసి ఎంజాయి చెయ్యాలి కదా.

అసలే ఈ "రాజీవశేఖరు" డి పుణ్యమా అంటూ భూమి ధర పెరిగిపోయింది కదండి. మరెమో "హౌజింగ్ కాస్ట్" కూడా పెరిగిపోయిందయ్యే.

మరి డబ్బులున్న మారాజులందరు, ఎకరాలు, ఎకరాలు కొనుకున్నారు. లేదా వారికీ "రాజీవశేఖరుడూ" స్థలాలు ఇచ్చాడుకదా.

మరి బీ.పీ.ఎల్ (అదేనండి "బిలో పావర్టి లైను") వారికేమో లెఫ్ట్ పార్టీలు, ఎగస్పార్టీ వాళ్ళు జెండాలు పాతి ఇస్తున్నారు.

మరి మధ్యతరగతి వాడి పరిస్థితి ఏమితీ?

మరి పిల్లలను చదివించుకోవాలంటే ఈ "ఏ1" సిటిలో 11 లక్షలు అవుతుందంట,ఈ రోజు "ఎకనమిక్ టైంస్" లో చదివాను.

మరి పిల్లలనే చదివించుకోవాలా, ఇల్లే కట్టుకోవాలా?

మరి పెద్ద ఇల్లు కావాలంటే అద్దె ఎక్కువ పెట్టాలి. మరి ఉన్నంతలో ఉల్లిపాయలు కొనుక్కుని, చదివించుకుని, అందరికి ఒకొక్కగదికి "వారు" అద్దే కట్టలేరుకదా?

పోని సినిమాకి వెళ్దామా అంటే, తికెట్టు వంద రూపాయలంట.

అందుకని, ఒక టీ.వీ కొనుక్కుని ఇంటిల్లపాది, పిల్లా జెల్లా అందరం కలిసి చూస్తాము.

అది ఆ వాడికి తెలిసినట్టున్నది.
మరి "మెరుగైన సమాజం కోసం" తాపత్రయపడుతున్నాడుకదా.
మరి అడా, మగా అందరు కలిసి, రాసుకుంటు, పూసుకుంటు, బస్సుల్లో తిరిగడం లా.
ఆఫిస్సుల్లో పనిజెయ్యటంలే?

కాబట్టి సిగ్గు, లజ్జ, బిడియం వదిలేసి, ఎంచక్క మారిన విలువలను గుర్తించి, కప్పుకున్న వలువలను మార్చుకోండి అని చెబుతున్నాడు.

ఏమండి, రైల్లో వెళ్ళేటప్పుడు చూడటంలేదా?
బహిర్భూమికి వెళ్ళే వారు రైలు దగ్గిరకురాగానే, మొఖన చెంగేసుకోవడం? ఇది అంతే!

గుర్తుపట్టడానికేముంటుంది?

ఆ "గోపిచందు" అన్నట్టు - " ఆ రెండు తోలు తిత్తులే" కదా?

కాబట్టి ఏమి ఫీల్ అవ్వద్దు.

"మెరుగైన సమాజం" లో ఇవన్ని సర్వసాధారణమే!

కాకపొతే కొంతమందికి చర్మం మందంగా ఉంటుంది, కొంతమందికి పలచగా ఉంటుంది.

నా మీదకు మాట్టుకు ఆ "స్త్రీ సంఘం" వాళ్ళని తోలకండేం.
సరేనా?

ఇంతకి ఆ "ఎద" ఎవరిదంటారు?
ఎక్కడ కొన్నదో ఆ "లేసు".
నాజుగ్గా బాగుంది, కదా?
ఆ గోళ్ళ *"మెనిక్యుర్"కి ఎంత తీసుకుంటాడో?

6 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on September 28, 2007 at 5:26 AM   said...

Fantastic satire. Well done.

A nitpick - the polishing of finger nails is "manicure". Same treatment for the feet is "pedicure".

Happy blogging.

netizen నెటిజన్ on September 28, 2007 at 5:46 AM   said...

@కొ.పా గారికి పొరబాటుని సరి చేసాను.
నెనర్లండయ్యా!

రాధిక on September 28, 2007 at 8:33 AM   said...

హత్య జరిగిందని చెపుతూ ఎలా చేసాడో సినిమాలా చూపించే టీవీ9 వాడికి,మీ బ్లాగుకు పెద్ద తేడా తెలియట్లేదు నాకు. చెత్త చిత్రాలు ఎక్కువ పెడుతూ మంచి బ్లాగుని పాడుచేయకండి.

netizen నెటిజన్ on September 28, 2007 at 8:58 PM   said...

@రాధిక గారికి:
మీ అంచనాలను, అభిప్రాయాలను నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు.

వారం - పదిరోజుల తీవ్రమైన అంతర్మధనం, మానసిక సంక్షోభం - తరువాతే ఈ బ్లాగు వెలువడింది.

మీరు లేవనెత్తిన అంశం మీద మరోక బ్లాగు వ్రాయలని ప్రయత్నం. అందులో జవాబుంటుంది.

విశ్వనాధ్ on September 29, 2007 at 12:29 AM   said...

టపా బావుంది
ఇలాంటి చిత్రాలు తగ్గించి వ్యాసాలు అందించండి

Anonymous on September 29, 2007 at 2:29 AM   said...

మసాలా పాళ్ళు తగ్గించండి netizen గారు, కొంచం ఘాటు ఎక్కువ అయినట్టు ఉంది.

Post a Comment