నెమలి

Posted by netizen నెటిజన్ on Wednesday, November 7, 2007
కళ్ళతొనే వ్యభిచరించే కొజ్జావాళ్ళ
కళ్ళకి నెమలితప్ప యింకెవరు కనుపిస్తారు?
జాతియత పక్షులపరం చేసేసి
మీరంతా పక్షుల్లా ఊరేగండి
చరిత్ర పునరావృతమవుతుంది.

తెల్లవాడు నల్లవాణ్ణి,
వున్నవాడు లేనివాణ్ణి
దోపిడి!దోపిడి! దోపిడి!

మీరు పెద్దలకేసే పిండాలను
ప్రేతాత్మల తృప్తికై తినే కాకి,
కుళ్ళును, కల్మశాన్ని పాయసంలా
తిని ప్రజాసేవ చేసే వాయసం
కాదు ఎందుకో జాతివిహంగం?

చీరచూసి పీటలువేసే
పుండాకోర్లు! దగాకోర్లు!

1 వ్యాఖ్య:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on November 8, 2007 at 6:34 AM   said...

ఏమీ అర్థం కాలేదు.
కవిత్వానికీ ఆవేశానికీ ఆమడ దూరం.

Post a Comment