తెలుగు తెగులు

Communicate కి శంకరనారాయణ నిఘంటువు ఇచ్చిన అర్ధాలు: తెలియజేయు, ఎఋకజేయు, అంటించు, తగిలించు, సోకునట్ట్లు చేయు, పంపు, కలిసి సంభాషించు, సహవాసంజేయు, సంబంధం కలిగియుండు, ఉత్తరప్రత్త్యుత్తరలు వ్రాసికొను, తెలియజేయుట, సమాచారమంపుట, జాబు, వార్త, ధారాళముగా మనసు తెలుపుచు మాట్లాడుట.

Evolution మొదలైనప్పటినుండి జీవుల మధ్య communication ఉంది.అవి సంజ్ఞలు కానివ్వండి, సంకేతాలు కానివ్వండి, శబ్డాలు కానివ్వండి.

Communication కూడా, దేశకాలాను ప్రకారం మార్పు చెందుతూ వచ్చింది. ఉదాహరణకి కొన్న్ని ప్రాంతాలలో తలను అడ్డంగా తిప్పితే "ఔను" అని అర్ధం. కొన్ని ప్రాంతాలలో నిలువుగా అంటే పైకి క్రిందకి తలను కదిలిస్తే "కాదు" అని అర్ధం.

ఇక ఈ తెలుగు భాషకి వస్తే చాలా పదాలు వ్యాప్తిలో లేవు. ఉదాహరణకి "షరాయి", "పంట్లాము".

"రవిక" అంటే కొంతమంది "స్త్రీ"లకే అర్ధం తెలియదు. కారణం వాడుకలో లేక పొవడం. కొన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికి అది చాల తక్కువగానే వాడుకలొ ఉన్నది. "జాకెట్టు" అన్నది ఎక్కువ శాతం మందికి సులువుగా అర్ధం అవుతుంది.

మరి నేడు ఈ భాష మీద ఈ "గోల" ఎందుకు?

"తిప్పెన" ఎమిటి?
"స్క్రూడ్రైవర్" అర్ధంకాదా?

"నెనరులు" ఎందుకు?
"థాంక్స్" అందరికి అర్ధం అవుతున్నది కదా?

"ఖతి" ఎందుకు?
"ఫాంట్" అందరికి అర్ధం కావటంలేదా?

కాదు "నా" తెలుగులో నేను మాట్లాడుకుంటాను, అంతే అంటే, "సరే", మాట్లాడుకొండి?

అలా మాట్లాడుకోవడానికే నేను కొన్ని "క్రొత్త" పదాలు సృష్టించుకుంటాను.
కానివ్వండి.

నా "సుందర తెలుగు" అని మీరు అనుకుంటే మరి కొన్ని సనాతన విలువలకి కట్టుబడి, "సంస్కృతి, అచారం, విలువలు" కోసం నిలబడిన కొన్ని చాందస,సనాతన, పురోగమన వ్యతిరేక శక్తులకు మీకు తేడా ఏముంది?

మార్పుని ఆహ్వానించని ఆ సంస్కృతి అభిలషనీయమేనా?

17 వ్యాఖ్యలు:

గిరి Giri on November 10, 2007 at 3:13 AM   said...

1. వాడుకలో లేవని, చదువరులకు అర్ధం కావని
garbology, bagatelle, verbigeration లాంటి పదాలని అంగ్లంలో వదిలివేస్తామా? "అవకాశం దొరికితే దుమ్ముదులుపుతా నా కొడకా" అనే విధంగా వాడరూ?

2. మార్పు మనుగడకే ముప్పు అన్నప్పుడు, దాన్ని నవ్వుతు అహ్వానించకపోవడం తిరోగమనమా?

3. గోరంద కొండంతులు వినే ఉంటారు (లేక పో్యినా, mountain out of a molehill అనే నానుడి అందుబాటు లోనే ఉందిగా), అది స్ఫురించింది మీ టపా చదువుతుంటే..

Solarflare on November 10, 2007 at 7:00 AM   said...

తెలుగులో ఉన్న వాడుకలోలేని పదాలు తెలియవు కానీ, క్రొత్త పదాలని కనుక్కొవడానికి ఉత్సాహం మాత్రం చాలా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజికి తెలుగులో పదాలు లేవు, కావాలనుకొంటే వీటికి పదాలు తయారు చేయాలి. తెలుగు బ్లాగ్లోకంలో కొంచం అతి ఎక్కువైంది. మరీ తమిళ్ళుల్లా అర్థంపర్థం లేని ఆవేశాలు, నాటకీయత ఎక్కువ పాళ్ళల్లో ప్రదర్శిస్తున్నారు.

@గిరిగారు - గోరంద కొండంతులు కాదు గోరంత కొండంతలు. మీరు Red Queen's Race గురించి చదివారో లేదో - ఒక సారి చదవండి.

ramya on November 10, 2007 at 8:24 AM   said...

నిజమేననుకోండి, కాని ఇప్పుడు మన భాషలో తెలుగు పదాలు తక్కువ మిగతావి ఎక్కువగా వాడుతున్నాం,నేనయితే తెలుగే మాట్లాడు తున్నాను అనుకునేదాన్ని బ్లాగ్ కోసం రాసి చూసుకుంటే తెలిసింది అది తెలుగు కాదని(దాంట్లో అక్కడక్కడ తెలుగు వుంది అంతే) . ఆ మధ్య ఎక్కడో ఒక కథ చదివాను ఆకథ లో వేరే దేశం వారు ఇండియా కి ఏదో పరిశోధన (మరొకటో సరిగ గుర్తుకు లేదు)కోసం రావాలని అనుకుని వారు వచ్చే ప్రాంత భాష తెలుగు అని తెలుసుకుని నేర్చుకోవాలని ఇంటెర్ నెట్ లో వెతికారట అక్కడ కనిపించిన తెలుగు (సినిమాలో ఏంటో) చూసి అరే ఇది మన ఇంగ్లీషే కాస్త మార్చి వారు మాట్లాడు తున్నారు అనుకున్నారట.ఈ కథ జోక్ గా రాసినా ఒకప్పటి భాష ఒకటి పూర్తిగా కనుమరుగవుతుందేమో నన్న బాధ దాంట్లో కనిపించింది. మీరన్నది కూడా నిజమే ఎదుటి వారికి అర్దం కావటమే బాష యొక్క ఉద్దేశం.కథైనా, కవితైనా ప్రతి ఒక్కరికీ అర్దం ఐతే నే అది గొప్పది. కాస్త భాష ఒరిజినాలిటినీ కాపాడాలనే చిన్ని చిన్ని స్వార్దం లో తప్పు లేదుకదండి.(నాకూ నిజమైన తెలుగు రాదండీ ఆ మాట కొస్తే ఏ బాష లోనూ పూర్తి గొప్ప ప్రావీణ్యం లేదు).

Anonymous on November 10, 2007 at 6:07 PM   said...

చాలా కాలం నుంచి ఇంగిలిపీసు సంస్కృతి అంత సరదాగా అక్కున చేర్చుకున్నపుడు మీలాంటి వారు లేకపోవటం వలన ఇప్పటికే చాలా నష్టం జరిగింది. తెలుగు మాట్లాడితేనే ఛాందసవాదం అనుకునే రోజులు ఇవి. ఇంగిలిపీసు మాట్లాడితే నాగరికతా, ఆధునికతా కదా :-)

ఇప్పుడు ఫక్ యూ, ఐ స్క్రూడ్ అప్ అంటేనే కొద్దిగా బాగుంది. స్కూళ్ళలో కూడా అమ్మాయిలు, అబ్బాయిలు వాడేసుకుంటున్నారు. అదే తెలుగులో అది చాలా దారుణంగా పలుకుతుంది. జనాలు కొడతారు.

మీరన్నట్లు ఈ నాగరికతే బాగుంది లేండి.

netizen నెటిజన్ on November 10, 2007 at 9:33 PM   said...

@giri:దేని మనుగడకు ముప్పు?

@ramya: "originality" భాషని మీరు "పాటిస్తూన్నారా"?

@solarflare: "అర్థంపర్థం లేని ఆవేశాలు, నాటకీయత ఎక్కువ పాళ్ళల్లో ప్రదర్శిస్తున్నారు." ఎంత మంది మీతో ఏకిభవిస్తారో చూద్దాం!

@anonymous: "దెxxxయ్" అన్న పదమ్ మీరు వాడటం లేదా? అంగ్లమ్‌లో "kiss"ing బానే ఉంటుంది కాని, తెలుగులో "స్కూఇంగ్" "OK"కాదా?

రొమాన్సింగ్ తెలుగులో ఒకటీను, love making అంగ్లమ్‌లో ఇమ్‌కొక విధంగా ఉంటుందా?

ramya on November 10, 2007 at 10:33 PM   said...

నెటిజెన్ గారు
ఒరిజినాలిటి పాటిస్తున్నానని నేను రాయలేదే(పాటించట్లేననే నాబాధ).మీరు నా వాఖ్య ని పూర్తిగా చదవలేదనుకుంటాను.
..............

ఇది మీ టపాకి అన్వయించు కోకండి ;-కనీసం ఒక్క భాష లోనైనా మంచి ప్రావీణ్యత లేకుండా పోయిందేనని అనిపిస్తుంది

netizen నెటిజన్ on November 11, 2007 at 3:43 AM   said...

@ramya:భాష "originality" అంటే ఎమిటి, మీ ప్రకారమ్?

గిరి Giri on November 11, 2007 at 4:50 AM   said...

నేను రాసిన వ్యాఖ్యలో వర్ణక్రమదోషము ప్రచురించిన తర్వాత గమనించాను, మన్నించండి..తెలుగు మనుగడకే ముప్పు..

Anonymous on November 11, 2007 at 9:37 PM   said...

Kissing is not equal to Screwing.

You may kiss a kid, a lovable brother. You don't screw them.

I hope you got the difference now.

netizen నెటిజన్ on November 11, 2007 at 11:10 PM   said...

@Anonymous: ఇక్కడ భాష - పద జాలం. తేడా ప్రసక్తి కాదు.

ఆంగ్లపదం అర్ధం సులువుగా అవుతుందన్నప్పుడు, ఆ పదం ఎందుకు వాడకూడదు అన్నది ప్రశ్న.

Solarflare on November 12, 2007 at 11:01 AM   said...

ఎవరేమన్నా, తెలుగు భాషాభిమానం ఉండడం బానే ఉంది కాని, అది వెఱ్ఱి తలలు వెయ్యడమే బాలేదు.

Anonymous on November 13, 2007 at 6:34 AM   said...

It's a matter of balancing. We do tend to get carried away once in a while in excitement. That's ok.

Nobody is forcing the usage of "nenarlu" or "trippena". It's nice to have a word to come up with.

Since English is so widely in use, it's bit satisfying to have an equivalent in Telugu. It comes so handy when answering your kids' curiosity.

Once you satisfy that curiosity, you can then explain why such words are not in much use in day-to-day conversations. Then we can go on about the cultural differences and how people greet and treat each other in that part of the world. Otherwise it might just seem an excuse and an insufficiency of the language.

VIJAYABHASKAR on November 16, 2007 at 12:15 AM   said...

we show interese to know the new words in english..Ex: my job is bangalored.....etc...But why can't we accept new words in TELUGU?

Solarflare on November 16, 2007 at 3:20 AM   said...

ముందు తెలుగులో ఉన్న పదాలు తెలుసుకొని ఆ తర్వాత ఇలాంటి experiments చేస్తే బావుంటుంది. expermentation అని భాషని ఖూనీ చేస్తానంటే ఎలా? దానికి మళ్ళీ పురోగతి అని ఇంకొటని పేరొకటా!? englishలో వాళ్ళు చేస్తున్నారు మనమెందుకు చెయ్యకూడదు అన్నది చాలా హాస్యాస్పదం. వాళ్ళని చూసి నేర్చుకున్నది చాలు - మనమింక సోంతంగా బుఱ్ఱలు పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అలా అని ఏది పడితే అది సృష్ఠించదం కాదు - అర్ధవంతమైన సృష్ఠి అన్నివేళలా ఆమోదయోగ్యమే.

Post a Comment