మన తెలుగు వాడుదా!

Posted by netizen నెటిజన్ on Tuesday, November 27, 2007
వీరు వారణాసి దుర్గాప్రసాద్ గారని, మొన్న నొబెల్ బహుమతి పొందారు.


మన వాడే, అక్షరాల పదహారణాల తెలుగు వాడు.
మరి మనకందరికి సంతోషమేగదా?

కాని ఆయనకి, నేను భారతీయుడ్ని, తెలుగువాడిని అన్న అభిమానం ఉందా అన్నదే ప్రశ్న?
ఏమంటారు?

7 వ్యాఖ్యలు:

yadavalli vsn sharma on November 27, 2007 at 4:26 AM   said...

వారణాసి వారు ఏ విషయంలో నోబెల్ అందుకున్నారో వివరంగా తెలియచేయగలందులకు ప్రార్ధన...

చైతన్య క్రిష్ణ పాటూరు on November 27, 2007 at 6:26 AM   said...

నెటిజెన్ గారు,

ఆయనకు తెలుగు అభిమానం లేకపోవటమేమిటండి బాబూ. తెలుగులో పద్యాలు గట్రా రాసేస్తుంటే. నాకూ ఇదే అనుమానమొచ్చి అంతర్జాలంలో కాస్త వెతికితే ఈ క్రింది లంకెలు తగిలాయి. కాస్త చూడండి తెలుస్తుంది.

http://www.tlca.com/adults/varanasi-swagatham.html

http://www.tlca.com/adults/varanasi-amerikandhra1.html

http://www.tlca.com/adults/varanasi-tirumaleseeyam.html

http://www.tlca.com/adults/varanasi-asmadaandhra.html

http://www.tlca.com/adults/varanasi-soubhagyadinam.html


శర్మ గారు,

దుర్గాప్రసాద్ గారికి గ్లోబల్ వార్మింగ్ గురించిన పరిశోధనకుగాను నోబెల్ బహుమతి వచ్చిందండి. మరిన్ని వివరాలు ఈ క్రింది లంకెలో చూడచ్చు.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/nov/2main50

http://www.tlca.com/member-news/index.html

వీవెన్ on November 27, 2007 at 6:45 AM   said...

1. ఈయన నోబెల్ బహుమతి పొందలేదు. 2007 నోబెన్ శాంతి బహుమతిని ఆల్ గోర్ మరియు IPCC (Intergovernmental Panel on Climate Change) లకు ప్రధానం చేసారు. వారణాసి దుర్గా ప్రసాద్ గారు IPCC పరిశోధనలలో తోడ్పడ్డారు. అందుకు ఆయనను గుర్తించారు. (వార్త చదవండి.)

2. తమ ఇంట్లోని వారు, ఊరివారు, రాష్ట్రంవారు, దేశం వారు, లేదా జాతివారు గుర్తింపుపొందితే గర్వపడడం లేదా సంతోషపడడం సహజం.

3. భారతీయుడనని, తెలుగువాడిని అని అభిమానం ఆయనకి ఉందా లేదా అన్నది ఆయనే చెప్పాలి.

Ram on November 27, 2007 at 7:25 AM   said...

Sorry, Varanasi is not the winner! IPCC is the winner, Varanasi is one of the hundreds of contributers of IPCC

http://nobelprize.org/nobel_prizes/peace/laureates/2007/

netizen on November 29, 2007 at 4:50 PM   said...

@వీవెన్: మీరన్నది నిజమే! చాలామంది "తెలుగువాడికి - నొబెల్" అన్న అపోహలో ఉన్నారు.

ఇక ప్రసాద్ గారి మాటల్లో, ఆంధ్రజ్యోతి నుండి:
ఆంధ్రప్రదేశ్‌తో మీ అనుబంధాన్ని వివరించండి?
నేను 1985 తర్వాత రాష్ట్రానికి రాలేదు. కానీ చిన్నప్పటి నుంచీ ఉన్న అనుభూతులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. నేను రాసిన మాధవ శతకం ప్రచురితమయింది. దీనికి దాశరథి ముందు మాట రాశారు. తెలుగు నేలపై నాకు ఉన్న అభిమానాన్ని ఇప్పటికీ నాకు వచ్చిన కళల ద్వారా తీర్చుకుంటూనే ఉన్నా. నేను వేసిన బొమ్మలు, రాసిన పద్యాలు ఇవన్నీ ఇంటర్నెట్‌లో టీఎల్‌సీఐ.కామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. నా దృష్టిలో తెలుగు అమ్మాయిలంత అందమైన వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. అందుకే నేను తెలుగు రేఖ అనే బొమ్మను గీశా!

netizen on November 29, 2007 at 4:54 PM   said...

@yadavalli vsn sharma:కింద రామ్ గారు మీ ప్రశ్నకి జవాబిచ్చారు. చూడండి.

@చైతన్యకృష్ణ సాలురు:మీరన్నది నిజమే.అభిమానం మెండుగా ఉంది.

rajendra devarapalli on November 29, 2007 at 11:42 PM   said...

శంకరాభరణమో,సప్తపదో,బహుశా వంశవృక్షమనుకుంటా, సోమయాజులు గారు ఒక మాట అంటాడు, నదికి మనం చెంబు తీసుకెళితే చెంబెడు నీళ్ళు,బిందె తీసుకెళితే బిందెడు నీళ్ళొస్తాయని,వారణాసి వక్కాణింపులో మనం చెంబునూ లేదంటే బిందెనూ ముంచుకోవచ్చు.1985 నుంచి తెలుగునేల మీద కాలు పెట్టకపో వటమా హన్నా! అనే చెంబును,ఇన్నేళ్ళయినా మనల్ని మొత్తంగా మర్చిపోలేదనే బిందెనూ మునకలేయించే సౌలభ్యాన్ని వారు మనకు ఇచ్చారు.
లోకాన్ని మరమ్మత్తు చేస్తాను అని బయలుదేరిన ఒక సత్తా గలిగిన సంస్కర్త ఆమధ్య నేను మావూరు వెళ్ళి రెండు దశాబ్దాలయ్యింది ..... ఇలా ఏదో వ్యాసం రాసుకొస్తే నేను ఒక ఉత్తరంలో ఏవండీ మీరుండే హైదరాబాద్ నుంచి మీవూరు నాలుగు గంటల ప్రయాణం రోజుకొక్క అంగుళం నడిచినా ఈపాటికి నలభై మూడు సార్లు వెళ్ళి రావచ్చే అని రాస్తే ఇప్పటికి సమాధానం లేదు,మూడేళ్ళనుంచి శబరి పాత్ర పోషిస్తూ వేచిచూస్తున్నాను.


రాజేంద్ర కుమార్ దేవరపల్లి
http://visakhateeraana.blogspot.com/

Post a Comment