"అప్రాచ్యులు" ఎవరు?

Posted by netizen నెటిజన్ on Thursday, November 29, 2007

"కూడలి "లో చదువుకున్నవారు వ్రాసుకున్న బ్లాగు చదివినతరువాత..


మర్యాదకరమైన మాటలు


"ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా."


"కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని ( నిమ్నత్వాన్ని ), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు."


అదే బ్లాగులో "ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)" అని అన్నారు.


పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి ఆ బ్లాగులోని మాటలు.


ప్రశ్న: (1) "అప్రాచ్యులు" ఎవరు?


(2) "మనం" ఎవరు ?


మీరు నివృత్తి చెయ్యగలరా?

3 వ్యాఖ్యలు:

చైతన్య క్రిష్ణ పాటూరు on November 29, 2007 at 10:10 PM   said...

అప్రాచ్యులు అంటే పడమటి దేశాలవారు. ప్రాచ్యం అంటే తూర్పు. అప్రాచ్యం అంటే పడమర. ఇక మనం అంటే మనమే. తూర్పు వాళ్ళమనే వుద్దేశంలోనే వాడారనుకుంటా

సూర్యుడు on December 2, 2007 at 8:11 AM   said...

Aan, I did not realize this. How dare to comment on us, the great east andhraites.

I resent this, I strongly condemn this. I ... this, I ... that, what else?

I have to really think to add some more here :D

I though apraachyuDu means illiterate.

te.thulika on December 8, 2007 at 4:39 AM   said...

చైతన్యక్రిష్ణగారు చెప్పింది రూఢ్యర్థంలో. ఒకప్పుడు బ్రాహ్మమకుటుంబాల్లో సాంప్రదాయాలను తిరస్కరించినవారిని అప్రాచ్చుడు అంటూ కాస్త తక్కువచేసి సంబోధించటం జరిగింది. ఈమధ్య హాస్యంగా కూడా వాడుతున్నారు పైరెండర్థాలూ మేళవించి.
ఈబ్లాగులోనే హాస్యంమీద వ్యాసం గమనించగలరు.

Post a Comment