తెలుగు సాహిత్యం - వర్గీకరణ (తెలుగు నిధి)

Posted by netizen నెటిజన్ on Saturday, December 1, 2007


2007 సెప్టెంబరు నెలలో "సాహిత్య సేవకులు" కావాలని "తెలుగు నిధి" వారు కోరడం, ఆ ఉద్యోగానికి చిన్న ప్రవేశార్హత పరిక్ష పెట్టడం, ఈ బ్లాగును గమనిస్తున్నవారందరికి గుర్తు ఉండేవుంటుంది.
తెలుగు తల్లి
అనివార్య కారణాలవల్ల "తెలుగు నిధి" కార్యక్రమం కొంత కాలయాపనకు గురైనది. కనీసం "దీపావళి"కైనా మొదలుపెట్టాలి అనుకున్నది, ఇప్పుడు 2008 వరకు వేచి చూడాల్సివస్తున్నది.

ఎంతో కొంత చదువుకున్నవారు, నేటి అంతర్జాల సాంకేతిక ఉపకరణాలతో కనీస పరిచయమున్నవారు, కళల పట్ల అనురక్తి కలిగిఉన్నవారు, ఐన ఈ బ్లాగరు సముదాయాన్ని చూస్తే ముచ్హటేస్తున్నది.

ఈ సముదాయంలోని బ్లాగరులకు తెలుగు సాహిత్యం మీద కొంత అవగాహన ఉన్నదని గమనించినప్పుడు "తెలుగు భాషాభిమాని" ఐన వారికెవైకైనా సంతోషం కలుగక తప్పదు.

కాని..
వీరికి తెలుగు సాహిత్యం గురించి "పరిపూర్ణ" సమాచారం అందుబాటులో లేదు అన్న నగ్న సత్యం అర్ధమైనప్పుడు కొంత బాధ కలుగకమానదు.

తెలుగు సాహిత్యాన్ని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిపించడం కొరకు సాహిత్యాన్ని "పునఃవర్గీకరణ" చెయ్యాల్సివచ్చేటట్టు ఉన్నది. అది అందరికి అర్ధమయ్యే రీతిలో జరిగితే బాగుంటుందని "తెలుగు నిధి" సభ్యుల అభిప్రాయం. ఒక తరానికి తెలిసిన సాహిత్యాన్ని మరొక తరానికి అందిచడానికి ఈ "పునఃవర్గీకరణ" తప్పదు.

అందులో భాగంగానే తెలుగు సాహిత్యాన్ని కొన్ని "ప్రక్రియ"లకు చెందే విధంగా "వర్గీకరణ" చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమైనది.

కింద ఇచ్చిన పట్టికని గమనించండి.

వీటికి కలుపవలసిన "వర్గీకరణ"ని, ఈ బ్లాగు "వాఖ్యల" ద్వార మీ అమూల్యమైన సూచనలని తెలియజేయండి.

"తెలుగు"ని పరిపుష్టం చెయ్యడానికి మీ వంతు సహకారాన్ని
అందిచమని, వినమ్రతతో "తెలుగు నిధి" మిమ్మలందరిని కోరుకుంటున్నది.

వర్గీకరణలు:

౧ - పద్య సాహిత్యం
౨ - గద్య సాహిత్యం
౩ - వచన సాహిత్యం
౪ - కధా సాహిత్యం
౫ - ..........
మీ సూచనల క్రమం ప్రకారం ఇంకా కలుపవలసినవి..

మీ సందేహాలకు, సూచనలకు మీ జాబుని ఈ చిరునామాకి పంపండి.

1 వ్యాఖ్య:

రాఘవ on December 1, 2007 at 3:58 AM   said...

నాటక,నవలాసాహిత్యాలు కూడా కలపండి.

Post a Comment