జుడీషియస్ ప్రిస్కిప్షన్

Posted by netizen నెటిజన్ on Tuesday, December 18, 2007
జుడీషియస్ ప్రిస్కిప్షన్

జకిరా బేగం ఒక నిందితురాలు. మెడికో లీగల్ కేసుగా, నాలుగు మాసాల గర్భిణి్ఐన ఈమెను 11వ తారీఖున GMH (Gandhi Medical Hospital కాదు, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల) లో చేర్చారు. చేర్చేటప్పడికి ఈమె తీవ్రమైన రక్తస్రావంతో బాధ పడుతున్నది.

12వ తారీఖున ఈమె గర్భంలోని శిశువు చనిపోయింది. 14వతారిఖు మధ్యాన్నం 12-20ని.ల వరకు అమెను కాపాడడానికి అక్కడి వైద్య బృందం ప్రయత్నించింది. కాని ఆమెను రక్షించలేకపొయ్యారు. వివరాలకు ఇక్కడ చూడండి.
"పల్మనరి ఎంబాలిజం" గురించి ఇక్కడ చూడండి.

పీ.జీ డాక్టర్ కామాక్షి బాధ్యతారహిత్యంవల్లే జకీర చనిపోయిందని, ఆమె బంధువులు వారి తోటివారు, డా.కామాక్షిని గాయపరిచారు.

మృతురాలు జకీర తరఫున ప్రాతినిధ్యం వహిస్తు అక్కడకు చేరుకున్న ఎం.ఐ.ఎం పార్టి ఎం.ఎల్.ఎ అక్బర్ పాషా క్వాద్రి అనుచరగణం ఆసుపత్రిలోని వస్తువులను విధ్వంసకాండకు గురిచేసి, అక్కడ భయోత్పద పరిస్థితిని సృష్టించారు. ఆ దుండగుల ఆగడాలను చూసి ఆ ప్రదేశంలోని రోగస్థులు, వారి బంధువులు, పిల్లా జెల్లా అందరు అక్కడినుంచి పారిపోయారు.

మొన్న నిలోఫర్ హాస్పిటల్లో ఎం.ఎల్.ఎ, అఫ్సర్ ఖాన్, నిన్న నయాపూల్ హాస్పిటల్‌లో అహమద్ పాషా కాద్రి, రేపు...? వీరు ప్రజా ప్రతినిధులు. వారే ఎలా ఉంటే?

మరి వైద్యులకు రక్షణ ఏది?

సిబ్బంది కొరత, పరికరాల కొరత, పనిముట్ల కొరత, రోగులలో వారి బంధువులలో కాని అనుచరులలోకాని అవగాహనారాహిత్యం లాంటి ప్రతికూల పరిస్థితులలో డాక్టర్లును వెనువెంటనే విధులకు హాజరవమన్న కోర్టు, ఆ ఇద్దరు ఎం.ఎల్.ఏ లను పట్టించుకోని ప్రభుత్వన్ని ఏమి అనలేదే?

ఇదేనా జుడీషియస్ ప్రిస్కిప్షన్?

కొసమెరుపు: ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డిగారు, నయాపుల్ ప్రసూతి వైద్యశాలలో మరణించిన జకీరకు అక్షరాల లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియ ప్రకటించినట్లు శ్రీ అసదుద్దిని ఒవైసి, గారు చెప్పారు.

0 వ్యాఖ్యలు:

Post a Comment