కొంత మంది తెలుగు బ్లాగర్లు నిజాయితిపరులు

Posted by netizen నెటిజన్ on Monday, December 24, 2007
'ప్లేగియారిజం" మీద "ది హిందు" లో Ombudsman కె. నారాయణన్, "ఒపీనియన్"లో తన శీర్షికలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఈ టపాలో ఉదహరించడంజరిగింది.

ఆ మధ్య తెలుగు బ్లాగర్లను అంతర్జాలం లోని బొమ్మలు వాడుకోవచ్చా అని అడిగితే, వాడుకోవచ్చు అని అన్నారు. "ఉచితంగానే". మరి తెలిసి అన్నారో, తెలియక అన్నారో, "కాసేపు ఆడుకుందాం" అనుకుని అన్నారో తెలియదు. ("అబ్బో, తెలుగు బ్లాగర్‌లేమి అమాయకులు కారండోయి. అవకాశం దొరికితే బాగానే "ఆడుకుంటారు"). ఎందుకో అది "సరి" అని అనిపించలేదు.
ఎక్కడో వెలితి.
ఏదో తేడా.
ఒక విధంగా దానికి కొంత జవాబు దొరికింది ఈ రోజు.

నారాయణన్ గారి మాటలలో - "The resources available on the Internet and the ease of extracting and using them lure many on to the easy path. Material sent over the Internet or stored on web servers is protected by copyright law in the same way material in other media is protected. Permission of the owners is generally needed when the material is downloaded for use in another publication. This, of course, does not apply when it is done for personal, non-commercial use".

తెలుగు బ్లాగర్లు అందరూ ఎంతో కొంత చదువుకున్నావారే.
వారిలో కనీసం కొంతమంది "నిజాయితి"ని కోల్పోకుండా ఉండటం సంతోషానిస్తున్నది.
ఐనా తెలియక కొంతమంది పొరబాట్లు చేస్తుండవచ్చు.
"వారి" కోసం ఆ వ్యాసం ఇక్కడ.

అంతా చదివారుకదా?
ఇక "ప్లేగియారిజం"కి సరైన తెలుగు పదం చెప్పండి.

4 వ్యాఖ్యలు:

ప్రవీణ్ గార్లపాటి on December 24, 2007 at 4:12 AM   said...

మీరు ఇంతకు ముందు తెలుగుబ్లాగు గుంపులో జరిగిన చర్చా హారాన్ని చూడండి.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on December 24, 2007 at 4:33 AM   said...

అయ్యా ,మీరు సంధించిన ప్రశ్నకు సవివరమైన వివిఋఅణ కొంతమేరకు నా బ్లాగులబాగోగులు అను వ్యాసపరంపరలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.అలాగె ప్లేగియారిజం కు కవ్యచోరత్వము,పదచోరత్వము అని బ్రౌణ్యమూ,గ్రంధచౌర్యము అని వేమురి నిఘంటువూ ఘోషిస్తున్నాయి.చిత్తగించవలెను.
భవదీయుడు

రాజేంద్ర కుమార్ దేవరపల్లి
తాజా కలం
నాకు నండూరి రామమోహనరావు గారి ఫొటో కావాలి.

సత్యసాయి కొవ్వలి on December 24, 2007 at 6:32 AM   said...

నిన్ననే ఎవరో వాడారు- ఎత్తిపోతల పధకం

Anonymous on July 12, 2013 at 9:03 AM   said...

మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
http://blogvedika.blogspot.in/

Post a Comment