ఎవరు?

Posted by netizen నెటిజన్ on Friday, September 28, 2007




పాపం, ఆవిడకు ఆ కెమెర్‌మన్ అలా జూమేస్తున్నాడు అని తెలియదేమో!
పోనిలెండి, అవిడకు ఆ మాత్రం "బెనిఫిట్ ఆఫ్ డౌబ్ట్" ఇద్దాంలే.
అస్సలు ఆవిడ అక్కడికి ఇంటర్వ్యు కి వచ్చిందండి.

ఇంకా గుర్తు రావడంలేదా?

ఇది ఎవరు గుర్తుపట్టలేదా?

"మెరుగైన సమాజం కోసం" పోరాడుతున్న వారి కెమరమన్ ఈవిడను, ఈవిడ సంపదను అన్ని సార్లు జూమేసి, క్లోజప్‌లో మరీ చూపించాడు గదండి.ఐనా గుర్తులేదా? అన్నట్టు, ఈ ప్రోగ్రాం ని అంకర్ చెసింది అబ్బాయి కాదండి, అమ్మాయే! ఎంత ధైర్యం అంటారా? ఇందులో ధైర్యం ప్రశ్న ఏముందండి బాబు?

మరి మీరు చూడలేదా?

బహుశ అతనికి తెలియదేమో, మీరు మీ అన్నయ్యతోనో, చెల్లెలితోనో వారి న్యూస్ చూస్టుంటారని. సిగ్గుతో మీరు అక్కడినుండి వెళ్ళిపోయ్యుంటారులెండి.

అంటే మరి "మెరుగైన సమాజం" మార్పులకు లోనవుతుంది కదండి? అందుకని విలువలు మారిపోయినవి కదా, కాబట్టి ఇలాంటి సీన్లు, అందరు కలిసి, ఏది, అందరు, అంటే, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న,తమ్ముడు, ఒదిన, భార్య, భర్త, బాబాయి, పిన్ని,అందరు కలిసి చూడాలి అని వారి ఉద్దేశం ఐవుంటుందండి. కదా?

అలాగైతే సిగ్గూ, లజ్జా, బిడియాలుండవుకదండి, మరి.
ఎంచక్కాను అందరు కలిసి ఎంజాయి చెయ్యాలి కదా.

అసలే ఈ "రాజీవశేఖరు" డి పుణ్యమా అంటూ భూమి ధర పెరిగిపోయింది కదండి. మరెమో "హౌజింగ్ కాస్ట్" కూడా పెరిగిపోయిందయ్యే.

మరి డబ్బులున్న మారాజులందరు, ఎకరాలు, ఎకరాలు కొనుకున్నారు. లేదా వారికీ "రాజీవశేఖరుడూ" స్థలాలు ఇచ్చాడుకదా.

మరి బీ.పీ.ఎల్ (అదేనండి "బిలో పావర్టి లైను") వారికేమో లెఫ్ట్ పార్టీలు, ఎగస్పార్టీ వాళ్ళు జెండాలు పాతి ఇస్తున్నారు.

మరి మధ్యతరగతి వాడి పరిస్థితి ఏమితీ?

మరి పిల్లలను చదివించుకోవాలంటే ఈ "ఏ1" సిటిలో 11 లక్షలు అవుతుందంట,ఈ రోజు "ఎకనమిక్ టైంస్" లో చదివాను.

మరి పిల్లలనే చదివించుకోవాలా, ఇల్లే కట్టుకోవాలా?

మరి పెద్ద ఇల్లు కావాలంటే అద్దె ఎక్కువ పెట్టాలి. మరి ఉన్నంతలో ఉల్లిపాయలు కొనుక్కుని, చదివించుకుని, అందరికి ఒకొక్కగదికి "వారు" అద్దే కట్టలేరుకదా?

పోని సినిమాకి వెళ్దామా అంటే, తికెట్టు వంద రూపాయలంట.

అందుకని, ఒక టీ.వీ కొనుక్కుని ఇంటిల్లపాది, పిల్లా జెల్లా అందరం కలిసి చూస్తాము.

అది ఆ వాడికి తెలిసినట్టున్నది.
మరి "మెరుగైన సమాజం కోసం" తాపత్రయపడుతున్నాడుకదా.
మరి అడా, మగా అందరు కలిసి, రాసుకుంటు, పూసుకుంటు, బస్సుల్లో తిరిగడం లా.
ఆఫిస్సుల్లో పనిజెయ్యటంలే?

కాబట్టి సిగ్గు, లజ్జ, బిడియం వదిలేసి, ఎంచక్క మారిన విలువలను గుర్తించి, కప్పుకున్న వలువలను మార్చుకోండి అని చెబుతున్నాడు.

ఏమండి, రైల్లో వెళ్ళేటప్పుడు చూడటంలేదా?
బహిర్భూమికి వెళ్ళే వారు రైలు దగ్గిరకురాగానే, మొఖన చెంగేసుకోవడం? ఇది అంతే!

గుర్తుపట్టడానికేముంటుంది?

ఆ "గోపిచందు" అన్నట్టు - " ఆ రెండు తోలు తిత్తులే" కదా?

కాబట్టి ఏమి ఫీల్ అవ్వద్దు.

"మెరుగైన సమాజం" లో ఇవన్ని సర్వసాధారణమే!

కాకపొతే కొంతమందికి చర్మం మందంగా ఉంటుంది, కొంతమందికి పలచగా ఉంటుంది.

నా మీదకు మాట్టుకు ఆ "స్త్రీ సంఘం" వాళ్ళని తోలకండేం.
సరేనా?

ఇంతకి ఆ "ఎద" ఎవరిదంటారు?
ఎక్కడ కొన్నదో ఆ "లేసు".
నాజుగ్గా బాగుంది, కదా?
ఆ గోళ్ళ *"మెనిక్యుర్"కి ఎంత తీసుకుంటాడో?



పూర్తిగా చదవండి ...

అవును, ఆ ఆడపిల్లలే తెలుగుకి గతి!

Posted by netizen నెటిజన్ on Thursday, September 27, 2007
బాలిఉడ్డు ఆడపిల్లలే "కధానాయిక"లుగా మనకు గతా?

అవునండి. మన తెలిగింటి ఆడపిల్లలు సినిమాలలోకి రావడానికి అంత ఉత్సాహం చూపించడంలేదండి.

అంతే మరి!

వాళ్ళ "ఎద"లని ఎగరేసి,
"బొడ్డు"ని చూపించి,
"నడుము" కుదిపేసి,

"తొడలు" ఆడించేసి,
డబ్బులు దొబ్బేద్దామనుకుంటే ఎలా?

వాళ్ళు తెలుగు ఆడపిల్లలు.
వాళ్ళంతే.
మా పిల్లలు అట్లాంటి తప్పుడు పనులు చెయ్యరు.
ఆ!



పూర్తిగా చదవండి ...

నెజ్జనులకు క్షమాపణలు. చిరుతే యమదొంగా లేదా యమదొంగే చిరుత - ౧

నెజ్జనులకు క్షమాపణలు.

అది అమలాపురం కాదట.

అనంతపురం అట.

ఇక వాళ్ళు బాలకృష్నుడి అభిమానులట.

ఇరు వర్గాలు కాంగిరెస్సు పార్టి వారట.

మిగతా పార్టీ లవారి కోసం వేచి చూద్దాం.



పూర్తిగా చదవండి ...

చిరుతే యమదొంగా లేదా యమదొంగే చిరుత?

అమలాపురంలో రగులుకున్నదట.
విజయవాడకి అంటుకున్నదట.
"వాడీ" డబ్బాని వీళ్ళు తీసుకెళ్ళి కాలవలో పడేసారంట.
వాళ్ళేమో "వీడి" సినిమాకి "ఆ హాళ్ళో" బాన్నర్లు, గట్రా కట్టకూడదని గొడవంట.

ఇంత గొడవజరుగుతున్న ఈ సినిమాలు అంత గొప్పవా?

ఈ సినిమాలు చూడాలంటారా?


ఇది "వాడిది"
ఆ బొడ్డు, దానితో వాడి ఆట, పాట చూడాలా?
ఇదేమో "వీడిది".
ఆ నడుము దానితో వీడి నకరాలు కావాలా?


ఇక దీనికి రాజకీయ కక్ష్యలు ఎంతవరకు ఆజ్యం పోస్తాయొ వేచి చూడాల్సిందే.



సినిమా బాగుందా (జూలై 20న 2007లో) కి అనుబంధంగా ఒక poll కూడా ప్రచురించడం(?) జరిగింది.
ఆ పోల్ల్‌లో ప్రేక్షకుల మీద సినిమాలలొ "కులం" ప్రభావం ఎంత వరకు ఉందో చూద్దామని ఒక చిన్న ప్రయతం చెయ్యడం జరిగింది.

ఆ గణాంకాలు:
ఆ ఫొల్ల్లో పాల్గొన్నవారు ఏడుగురు.
వీరిలో రెండు శాతం మందిమీద సినీ జగత్తులోని వ్యక్తు ల కుల ప్రభావం ఉంది.

నిర్మాత, దర్శకుడు, కధానాయకుడు, నాయిక, సంగీత దర్శకుడు - వీరందరి కులాలు కూడా ఆ pollల్లో పాల్గొన్నవారిని ప్రభావితం చేసినట్టు కనపడుతుంది.

చివరకు ఆ సినిమా సమీక్షకుడు, అది ప్రచురించిన పత్రికాధినేత కులం కుడా దీనికి అతీతం కానట్టుంది.


కొసమేరుపు: కొత్తగా విడుదలవుతున్న నిర్మాతది ఒక కులమైతే, అందులొని కధానాయకుడి కులం మరొకటి. వారిద్దరు బానే ఉంటారు.
మరి మధ్యలో నాశనమైపొయ్యేది ఈ కులాల రణక్షేత్రంలో ఎవరు?



పూర్తిగా చదవండి ...

హిందూ ఫత్వా

Posted by netizen నెటిజన్ on Sunday, September 23, 2007

Vishwa Hindu Parishad leader and former Bharatiya Janata Party Member of Parliament Ram Vilas Vedanti on Friday issued a 'fatwa' against Tamil Nadu Chief Minister M Karunanidhi for his statement challenging the existence of Lord Ram.

The VHP kendriya margdarshak mandal leader and two-time BJP Lok Sabha member issued the 'fatwa' in Ayodhya in which he said whosoever chopped off the head and tongue of the Dravida Munnetra Kazhagam president would be gifted with gold by the saints of Ayodhya.

దీనికేమంటారు?

మళ్ళీ రక్తపాతమా?

ఏటు వైపు వెళ్తున్నాం మనం?




పూర్తిగా చదవండి ...

ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఎక్సెల్లంట్ పర్సనల్ బుక్ లైబ్రెరి

Posted by netizen నెటిజన్ on Friday, September 21, 2007
ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. ఒకరికి పప్పు, నెయ్యి ఆవకాయ ఐతే, ఇంకొకరికి రొయ్య పప్పు కూర అంటే ఇష్టం. ఒకస్త్రీకి వండి పెట్టడం ఇష్టం, మరొకామేకు పిల్లలతో గడపడం ఇష్టం. ఒకరికి కవిత్వం ఇష్టం. మరొకరికి కధలిష్టం.

పుస్తకాలంటే ఇష్టం ఉన్నవారికి పుస్తకాలగురించి మాట్లాడుకోవడం ఇష్టం. వాటిని కొనుక్కుని చదువుకోవడం ఇష్టం. ఇంకొకరితో చదివించడం ఇంకా ఇష్టం.

కొంతమంది పుస్తకాలు కూడా కొంటారు. చదివి అవతల పారేస్తారు. కొంతమంది పుస్తకాలు కొంటారు. అందంగా కనపడాలని, దళసరి ప్లాస్టిక్ కాగితంతో వాటికి చక్కగా అట్టలేస్తారు. ఇంకా అందమైన పుస్తకాలని అందమైన అద్దాల తలుపులున్న అరల్లొ బిగిస్తారు. అవి చూడ డానికి మాత్రమే. చదవడానికి కాదు. మీరు, నేను చదవడానికి కానే కాదు. పదిమందికి తన సాహిత్య "కలాపోసన" సూపించడానికే సుమా!ఆ పుస్తకాలంటుకుంటే మీరందరు మైలడిపొతారు.ఇది సాధారణంగా బాగా డబ్బుతో మదించినవారి లక్షణం.

పుస్తకాలను చదువుకోవడానికి మాత్రమే కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పుస్తకాలు, కొని చదివి ఊరుకోరు. ఆ పుస్తాకాలని చదివి అనందిస్తారనుకునే వాళ్ళకి అవి పంపుతారు. ప్రముఖ రచయిత దాట్ల వెంకట నరసరాజు గారి లాగ. పుస్తకాలు అచ్చేసేది చదవడాని కే కదా. చదవండి. చదివిన తరువాత నాకు పంపండి. మళ్ళీ మనబోటి వారికి అది చదవడానికి ఇవ్వచ్చు కదా అని అంటారు.

ఇంకా కొంత మంది ఉంటారు. వాళ్ళు వారికిష్టమైన విషయం మీదే పుస్తకాలని సేకరిస్తారు. కొంగర జగ్గయ్య. ఆయన దగ్గిర కొన్ని వందల రామాయణాలు ఉండేవి. అలాగే "జెమ్మాలజి" మీద కూడ.

కారా మాస్టారున్నారు. (కాళీపట్నం రామారావు గారు). వారికి కధలంటే ఇష్టం. అందుకని ఎక్కడెక్కడవో కధలు సేకరించారు. వాటిని పదిమందికి అందుబాటులోకి తెచ్చారు.


పుస్తకాల ఖరీదు?
విశాలంధ్ర వారనుకుంటాను వారి పుస్తకాలజాబితాలో వీరేశలింగంగారి మాటని ప్రచురించారు. ఆ వాక్యం గుర్తు లేదు గాని, దాని అర్ధం ఇది - "చిరిగిన బట్టయిన వేసుకొ, ఫరవాలేదు - కాని ఒక పుస్తకం కొనుక్కో".

పుస్తకాలు డబ్బున్నవారేవరైనా కొనుక్కోవచ్చు. కాని వాటిని పోషిండం చాలా కష్టం. పోషించడం అంటే అర్ధం ఆ పుస్తకాల జాబితా పెరుగుతు ఉంటుంది. మొదట్లో ఒక అరలో ఇమిడిపోతాయి. ఇక రెండో అర మొదలవుతుంది. మళ్ళి ఇంకొక అర కావల్సివస్తుంది. అది నిండిపోతుంది. అప్పుడు పక్కనే ఉన్న బల్ల మీద పడేస్తాము. తరువాతా నెమ్మదిగా పక్కల మీదకి జేరుతాయి. ఇక కొందరి ఇళ్ళల్లో ఐతే స్నానాలగదిలోకి కూడా చేరుతాయి.

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. స్థలం. ఒక గజం భాగ్యనగరం చుట్టుపక్కల ఐతే సుమారుగా మూడు వేలు పలుకుతోందట. పుస్తకాల అలమరా సుమారుగా ఒక ఐదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగులు వెడల్పు, ఒక అడుగున్నర లోతు ఉండాలి కదా? మరి ఆ లెఖ్ఖన ఎన్ని చదరపు అడుగులైంది? మరి మీ అలమర కి ఎంత స్థలం కావాలో ఆలోచించుకోండి. మరి అలమరకి, స్థలం కోసం ఎంత వెచ్చిస్తున్నారు?

అలాగే మీ అలమారాని దేనితో చేయించుకుందాం అని అనుకుంటున్నారు?
చెక్క? ఐతే మరి ఏ చెక్క? అడుగు ధర ఎంత?మరి దానికి గాజు బిగిస్తారుకదా? అది ఎంత మందాన ఉందాలి? దానికెంత? వడ్రంగి కూలి ఎంత? ఇవన్ని లెక్కేసుకుంటు పోతే మీకు పుస్తకాలకి ఎంత "కరుసవుద్దో" తెలుస్తుంది. ఇదెక్కడి గోలా ఈ బ్లాగరు ఇలా అంటారేమిటి అని? పుస్తకాలు కొనుక్కొవద్దా?

లేదు. మిమ్మల్ని పుస్తకాలు కొనవద్దనడంలేదు. కొనుక్కోండి. బెకన్ మహశయుడన్నట్టు, "కొన్ని పుస్తకాలు రుచి చూడాలి, కొన్ని మింగాలి, మరి కొన్ని తిని జీర్ణం చేసుకోవాలి".

కాబట్టి ముందే, అవి ఎమిటి అన్నవి నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యంతో పుస్తకాలని సేకరిస్తే కొంత కాలానికి బ్రహ్మాండమైన స్వంత పుస్తకభాండాగారం ఏర్పడుతుంది.

లేకపొతే అవన్నీ కూడా చివరికి వీధి మూలమీదున్న చెత్తకాగితాల దుకాణం వాడికి చేరుతాయి. ఇక అంతే సంగతులు. ఇంకో అవకాశం కూడా ఉంది. మనకి పుస్తకాలమీద ఉన్న నిర్లక్షాన్ని ఇంట్లొ వాళ్ళు పసిగట్టారో ఇంక అంతే సంగతులు. వాళ్ళు కూడా ఒకొక్క పుస్తకాన్ని నెమ్మదిగా అవసరాన్ని బట్టి వాడికి చేరవేస్తారు.

కాబట్టి ఇందాక అనుకున్నట్టు ముందే మనకి ఇష్టమైన విషయం ఏమిటి అన్నది నిర్ణయించుకుని వాటిమీదే దృష్టి పెట్టుకుంటే బావుంటుంది.

ఎలాంటి పుస్తకాలు కొనాలి?
ఈ రోజు నాకు కధలంటే ఇష్టం. అక్కడెక్కడోఒక కవిత చదివాను. అది బాగుంది. మరి ఆ పుస్తకం కొనొద్దా? కొనుక్కోండీ. కాని కొనబొయేముందు ఆ పుస్తకాన్నిఎందుకు కొనాలనుకుంటున్నామో ఒకసారి మళ్ళీ ఆలోచించుకుంటే బాగుంటుంది. అంటే అదొక కవితా సంకలనం అనుకుందాం. అప్పుడు అందులో ఏ కవిత మీకు నచ్చిందో చూసుకోవాలి. ఆ కవి ఇతర కవితలు కూడా చూడాలి. అవి కూడా బాగుంటే అప్పుడు ఏంచెయ్యాలి? అదే మీ నిర్ణయం. కవిత్వమా? కధలా? నవలలా? కవితా సంకలనాలా? కధా సంకలనాలా? ఒకే రచయిత్రివా? వివిధ రచయిత్రులవా? ఒక తరానివా?

లేదండి. ఏదైనా బాగున్న పుస్తకం ఐతె నేను కొనుక్కుంటాను. బాగున్న పుస్తకం , బాగలేదన్న పుస్తకం అని ఉండవు. బాగా రాసిన పుస్తకం బాగ వ్రాయని పుస్తకాలే ఉంటాయి అని ఒక పెద్ద మనిషి అన్నాడు. కాబట్టి దాన్ని బట్టి నిర్ణయించుకొండి.

మరి కొనొక్కొవడా నికి డబ్బులు కావాలికదా? ఉన్నవి కదా? లేవు. పండగలకి చీరలకి, జాకెట్లకి, దాచుకున్నట్టే పుస్తకాలకి కూడా "ఇంత" అని కేటాయించాలి. ఆలా ఐతే మీకు కావలిసినవే కొనుక్కోగలుగుతారు. లేక పొతే అడ్డమైన చెత్త కొనాల్సి వస్తుంది.మీరు ఉద్యోగస్తులైతే నెలకి ఇంత అని కేటాయించుకోండి. అందు లో ఏమేమి పుస్తకాలు కొనాలో చూసుకోండి. అందులోనే సరిపుచ్చుకోండి.

పుస్తకాలు సేకరించడం ఎలా?
మరి సరిపుచ్చుకోవాలంటే ఏమేమి కొనాలో తెలియాలి కదా? అవును. అందులో భాగంగా యాహూ , గూగుల్ లాంటి వాటిల్లొ ఉండే సాహిత్యానికి సంభందించిన గుంపుల్లొ చేరండి. అలాగే సాహిత్యాభిమానులతో పరిచయాలు పెంచుకోండి. దానివల్ల కొత్త పుస్తకాలగురించే కాకుండా, మీకు కొత్త ఐన కొన్ని "పాత పుస్తకాల"గురించి కూడా తెలుస్తుంది. మీరున్న ఊళ్ళో సాహిత్య సభలు జరుగుతుంతే వాటికెళ్ళండి. అలాంటివి లేక పోతే మీరే మొదలుపెట్టండి. పది మంది పది రూపాయలేసుకుంటే నెలకి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు.

మీ ఊళ్ళో ఉన్న పుస్తకాల కొట్లో మీ చిరునామా ఇవ్వండి. కొత్త పుస్తకాలు, సాహితి సమావేశలు ఉన్నప్పుడు తెలియజేయమనండి.

కొన్ని పెద్ద దుకాణాలకు ప్రాంతీయ శాఖలుంటాయి. ఉదాహరణకు, విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి సంస్థలు. ఈ సంస్ఠలు కొత్త పుస్తకాలు విడుదలైనప్పుడుకాని, నెలకొకసారనో వాళ్ళ ప్రచురణలతో బాటు , ఒక పుస్తకం రూపంలో కొత్త విడుదలల గురించి తెలియజేస్తుంటారు. అందులో సభ్యులుగామిమ్మల్ని చేర్చుకోమని కోరితే వాళ్ళు చేర్చుకుంటారు.

"విశాలాంధ్ర" కి ఒక పధకం ఉంది. దాని ప్రకారం ఒక పాతిక రూపాయలు వారికి కడితే దానిని వారు రెండు సంవత్సరాల సభ్యత్వ రుసుము కింద తీసుకుని మిమ్మల్ని వారి "పుస్తక ప్రియుల సమూహం" లో( Book Readers Club)లో చేర్చుకుంటారు. సభ్యులకి తమ ప్రచురణల మీద ఇరవై శాతం, వారు అమ్మే ఇతరుల పుస్తకాల మీద పది శాతం తగ్గింపు ఇస్తారు. వారు జరిపే పుస్తక ప్రదర్శనలకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు.

మీ అభిరుచికి తగ్గ పుస్తకాలని ప్రచురించే సంస్థలకు మీ చిరునామతో ఉత్తరం వ్రాస్తే, వారు కూడా మీకు తమ దగ్గిరున్న పుస్తకాల గురించి తెలియజేస్తుంటారు.

వీటాన్నింటిని దగ్గిరపెట్టుకుంటే మీకు కావలిసిన పుస్తకాలన్ని అందుబాట్లో ఉన్నట్టే.

పుస్తక ప్రదర్శనలు
ప్రతి సంవత్స రం, ఈ పుస్తకాల వాళ్ళందరు ఒక చోట చేరి పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేసుకుంటారు. సాధారణంగా ఇలాంటి ప్రదర్శనలకి సుమారుగా నూట యాభై నుండి రెండు వందలదాకా, ప్రచురణకర్తలు, విక్రేతలు తమ పుస్తకాలని తెస్తారు. అక్కడ మనం ఐపోతాము. చీరలకొట్లొ ఎటు చూసిన చీరలే? అన్ని కావాలి. డబ్బులు చూసుకోవాలి. మరి మన దగ్గిర అవి లేవుగా. అందుకని ఇందాకా అనుకునట్టు ఈ వార్షిక ప్రదర్శనలకి కూడా ప్రణాళిక బద్ధంగా కొంత సొమ్ముని పక్కన పెట్టుకోవాలి.

ఇక ఈ పుస్తక ప్రదర్శనలలో ఎక్కువ పుస్తకాలు మనకి కావలసినవి,(వారు అమ్మాలనుకున్నవాటితో మనకి పనిలేదు)ఎలా కొనాలో చూద్దాం.

అంధ్ర దేశంలో, సాధారణంగా ఈ పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం డిసెంబరు - జనవరి మధ్య జరుగుతుంటాయి. శనివారం మొదలవుతాయి. ఆదివారం ముగుస్తాయి. నెలాఖరున మొదలవుతాయి. సుమారుగా మరుసటినెల మొదటివారాంతంలోపు ముగుస్తాయి. కారణం ఏమి లేదు. అప్పుడే ఈ "పుస్తకాల పిచ్చొళ్ళ" దగ్గిర డబ్బులుంటాయి. అవే కదా జీతాల రోజులు. పైగా మన డబ్బుతో సంక్రాంతికికూడా పని ఉంటుందన్నది మరిచిపోకూడదు.

ఇక ఆ ప్రదర్శనలో పాల్గొనే వారు శనివారం తమ పుస్తకాలకట్టల్ని తెరిచినా అవి సర్దడానికి సమయం తీసుకుంటుంది. అలాగే దూరాభారాన్నుండి వచ్చినవాళ్ళందరి పుస్తకల కట్టలన్ని వారికి అందకపోవచ్చు. అవన్ని అంది, వాటిని సర్దుకునేటప్పడికి వారికి ఏ సోమవారం మధ్యహ్న్నమో అవుతుంది. అంతే కాక కొంతమంది ప్రదర్శకులు కూడా రాలేకపోవచ్చు. వారి ఇబ్బందులు వారికుంటాయి. మరో చోట ఎక్కడన్నా పాల్గొనడం లాంటివి జరగవచ్చు. అందుకని వారు ఇక్కడకి ఆలస్యంగా చేరుకోవచ్చు. అనారోగ్యం కారణం కావచ్చు. వాళ్ళు మనుషులేకదా?

మొదటి సారి :
అందుకని ఏ మంగళవారమో ఒక సారి ఒక ప్రదక్షణ చేస్తే, ఎవరెవరున్నారో, ఏ ఏ పుస్తకాలు అందుబాట్లో ఉన్నవో తెలుస్తుంది. అంతేకాక ముందే తయారుచేసుకున్న జాబిత వారందరికి చూపిస్తే వారు ఏ పుస్తకాలున్నవి చెబుతారు. అంతే కాకుండా వారి దగ్గిరలేని పుస్తాకాలు తెప్పించడానికి వారికి మనం ముందే చెప్పడంవలన వారు వెళ్ళేలోపే మనకి ఆ పుస్తకాలను తెప్పించిపెట్టగలరు. తద్వారా మనం ఎంత డబ్బు సమకూర్చుకోవాలో కూడా తెలుస్తుంది.

ఎవరి దగ్గిర ఏమేమి పుస్తకాలున్నవో మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని, ఆ దుకాణం పేరు, సంభందిత వ్యక్తి పేరు, ప్రదనలో ఆ దుకాణానికి నిర్దేశించిన సంఖ్య దాని ఎదురుగుండా వారిస్తానన్న పుస్తకాల పేర్లు (రచయితల పేర్లతో సహా) వ్రాసుకోవాలి. మొత్తం ప్రదర్శనలోని అన్ని దుకాణాలు తాపిగా చూడాలి. హడావుడి ఏమి లేదు.

రెండో సారి :
ఇక రెండోసారి మళ్ళీ వెళ్ళాలి. ఇది ప్రదర్శన మొదలుపెట్టిన వారానికి వెళ్ళవచ్చు. ఉచిత సలహా ఏమిటంటే శనివారం మధ్యాన్నం ఐతే భేషుగ్గా ఉంటుంది. ఎందుకంటే సందర్శకులు ఎక్కువమంది ఉండరు. దుకాణ్ణాల్లో ఉన్నవాళ్ళు కూడా కొంచెం తాపిగా మనకి జవాబివ్వడానికి తయారుగా ఉంటారు. ఈసారి డబ్బుల్తో వెళ్తున్నాం కాబట్టి పుస్తకాలు మోయడానికి ఎవరినన్నా తోడు తీసుకెళ్ళాలి.ఒక మంచి నీళ్ళ సీసా కూడా తీసుకెళ్ళడం మరిచిపోవద్దు. మొదటి సారి వచ్చినప్పుడు చూసిన పుస్తాకాలుకొన్ని ఐపొయి ఉంటాయి. అవి మళ్ళి ఎప్పుడొస్తాయో కనుక్కుని, నమ్మకం కుదిరితే, కొంత సొమ్ము ఆ పుస్తకానికి "బయాన"గా ఇవ్వోచ్చు, వారు మన ప్రతిని మనకి ఉంచేందుకు.
దానికి రశీదు తీసుకోవడం మరిచిపోవద్దు. దానిమీద వారి ముద్ర, తేది, సంతకం ఉండాలి.

ముచ్చటగా మూడోసారి .
ఈ సంవత్సరం, ఇదే ఆఖరుసారి మనం ఆ పుస్తక ప్రదర్శనకి వెళ్ళడం. మనం కట్టలు మోసుకుంటూ వెళ్ళాం కదా, ఇంటికి? అబ్బో ఎన్ని పుస్తకాలో కొన్నాం అని సొరకాయలు కోసాం కదా. అప్పుడు, పక్క బల్ల వనజాక్షి గారు, ఎదురుబల్ల "రాముడు మంచి బాలుడు"గారు,మేడ మీద "ఆంటి"గారు, వాళ్ళు వాళ్ళకి కూడా "ఒక" పుస్తకం తెచ్చిపెడుదురు అని అంటారు కదా. ఆప్పుడు మనం బుర్ర ఇంచక్క ఊపేసి "అలాగే" అని అన్నాం కదా. ఆ పుస్తకాలు, మన పిల్లకి, మన పిల్లాడికి, మరి మన "వారి"కి, వారి "వాళ్ళ"కి పుస్తకాలు కొని ఇవ్వాలికదా? అందుకని ముచ్చటగా మూడోసారి వెళ్ళడమన్నమాట.

ఒక సారి, మళ్ళీ మన జాబితా బయటికి తీసి, దుకాణం పేర్ల ప్రకారం, సంఖ్యల ప్రకారం, ముందే చూసివున్నాం కాబట్టి, తిన్నగా ఆయా దుకాణాలకెళ్ళి, మనకి కావలసిన పుస్తకాలు తీసుకుని వచ్చేయ్యడమే.

పుస్తకాలు కొన్న ప్రతిసారి వారిచ్చే విక్రయచీటిలో పొరబాట్లు ఏవైనాఏమినా ఉన్నవేమో అని ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అలాగే ప్రతి దానిలోను కనీసం పది శాతం తగ్గింపు ఇచ్చారా అన్నదికూడా లెక్ఖ చూసుకోవాలి.చిల్లర నాణేల ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకటికి రెందుసార్లు మనకి వెనక్కిచ్చిన చిల్లర లెక్కబెట్టుకోవడం మరవద్దు.

అఖరురోజున రద్ది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైతే పొద్దునే ఎండేక్కకుండానే వెళితే, త్వరగా వెనుతిరగవచ్చు.

దాదాపు అందరు దుకాణందార్లు ఒక చేతిసంచిలో, పుస్తకాలేసి ఇస్తారు. అన్ని సంచీలు మోసుకుని తిరగడం చిరాకు. అందుకని వారినే ఒక పెద్ద సంచి అడిగి అందులో ఈ చిన్న సంచీలు, పుస్తకాలు వేసుకోవడం సుళువు.

అలగే మనతో పాటు ఇంకేవరన్నా వుంటే, ఏదో ఒక దుకాణాన్ని బండ గుర్తుపెట్టుకుని అక్కడికే చేరడం మంచిది. ఓకవేళ అది మరిచిపొతాము అనుకుంటే ఆ దుకాణానికిచ్చిన సంఖ్యని గుర్తుపెట్టుకోవచ్చు. అలా ఐతే ఎవరు తప్పిపోరు. నలుగురైదుగురు వెళ్ళినప్పుడు, ఏవరైనా ఒకళ్ళు ఒకచోట నిలబడితే మిగతవాళ్ళు తమకి కావలిసినవి కొనుక్కుని మళ్ళి అక్కడికే చేరవచ్చు. ఇదొక పద్ధతి.

పుస్తకాలు - ముద్రణ - నాణ్యత
పుస్తకాలు కొనేటప్పుడు తప్పని సరిగ్గా పుటలన్ని క్రమం తప్పకుండా ఉన్నవా అని చూసుకోండి. అలాగే వెన్ను మీద కుడతారు. అలా కుట్టినప్పుడు కొంత పాఠం మనకు సరిగ్గా కనబడదు. ఆది కూడా చూసుకోవాలి. ముద్రణలో ఒకొక్కసారి అక్షరాలు అలుక్కుపోయి సరిగ్గా కనపడవు. అదికూడా జాగ్రత్తగా గమనించి ఇవేవి లేని మంచి ప్రతిని ఎన్నుకుని తీసుకోవాలి.

ఇలా కొనుక్కోవడం వల్ల మనం మనకి కావసిన పుస్తకాలు మాత్రమే కొనుక్కుంటాం.
అంతే కాదు, మన పరిమితులలోనే కొనుక్కుంటాం.
మన అభిరుచికి తగినట్టే కొనుక్కుంటాం.
- 0 -
ప్రతి జీవికి ఒక ఒంటరి సాయంకాలం ఉంటుంది. ఆ సాయంకాలం ఈ పుస్తకాలే అమేకి సహచరులు.

అలగే ప్రతి జీవి బూడిదలో కలిసిపోవాల్సిందే.
అలా కలిసిపోయేటప్పుడు కొందరు వీలునామలు వ్రాస్తారు. ఉన్న మేడలు, బంగారం ఏ పిల్లకి ఎంత, ఏ కోడలికి ఎంత, ఈ మనవడికి ఇంత, ఈ మనవరాలికింత అన్నట్టుగానే అంత మంచి పుస్తకాలని ఒక చోటికి చేర్చి, వాటిని అనాధలుగా వదిలేయవద్దు.

అవి ఎక్కడికేళ్తే పదికాలలపాటు, ఇంకో పదిమందికి తమ సహచర్యాన్ని అందివ్వగలవొకూడా చూసుకోవాలి. మన తరువాత గూడా మన నేస్తాలని వారు జాగ్రత్తగా చూసుకుంటారు అన్న నమ్మకం కుదిరినప్పుడే, వారిని అక్కడికి పంపే ఏర్పాట్లు చెయ్యాలి.
- 0 -
వెళ్ళండి, వెళ్ళి మీకు కావలిసిన పుస్తకాలు కొనుక్కోండి.
పదిమందితో పంచుకోండి.



పూర్తిగా చదవండి ...

Labels:

రాముడు మద్యపాన ప్రియుడా?




రాముడు మద్యపాన ప్రియుడా?
మాంసాహారా?
క్షత్రియుడు కదా!
క్షత్రియ ధర్మాలే కదా?
మరి ఇవన్ని "ఒప్పు"లే కదా?
కాదా?

తమిళనాడులోనున్న తండ్రి మాటలకి,
ఎక్కడో కర్నాటకలోని కూతురి ఇంటిమీద దాడి సబబేనా?
దారిన పొయ్యేవారిని పెట్రొల్ పోసి కాల్చేయ్యడం హిందు మత సమ్మతమా?



పూర్తిగా చదవండి ...

వినాయకుడు - నాయుడు గారు - రాజుగారు - ఎం డీ గారు - రెడ్డి గారు లేరు.

Posted by netizen నెటిజన్ on Sunday, September 16, 2007
వినాయకుడి చవితికి సంభందించి..
గణెష్ బొప్ప మొరియ(?) కొన్ని చోట్ల ఇలాను మరికొన్ని చోట్లా ఇలాను - గణేష్ బొప్ప వొరియా(?)చదవడానికి కనబడుతుంది.
ఇది తెలుగు భాషేనా?
అర్ధం ఎమిటో?

గణేష్ పూజా?
వినాయక పూజా?
వినాయక చవితా?

అమ్మా, నాన్నా, చెల్లి, మరేమో, పక్కింటి వాసువాళ్ళ అమ్మతోను, (ఆంటికాదు), అలాగే మరేమో సుజాత వాళ్ళ వొదినతోను కలిసి మార్కెట్‌కి వెళ్ళీ అక్కడ అన్ని కొనుక్కునే వాళ్ళం. దేవుని బొమ్మ, గొడుగులు, పూలు వగైర, వగైరాలు.

మొన్న ఆయన అంటున్నారు - వారి మిత్రుడొకరు, ఆ పక్కనేదో ఊరుందంట. అక్కడ ఒకాయన శుభ్రంగా మడికట్టుకుని వినాయకుడి "మట్టి"బొమ్మలు చేస్తాడంట. అవే వాడుతారంట పూజకి. మడి కట్టుకుని చేసిన బొమ్మనే మీరు పూజకి వాడుతున్నారా? మీరు కూడా అంతేనా?

అదేదో ఊళ్ళొ రోడ్డు మీద వినాయకుడి విగ్రహాన్ని పెట్టారంట. అది నలభై అడుగుల ఎత్తు, పాతిక అడుగుల వెడల్పు ఉందంట.

ఇంకో ఊళ్ళోనేమో నలభైఒక్క అడుగుల ఎత్తు ఉందంట.నిజమా? అంతంత పెద్ద విగ్రహాలైతేనే వినాయకుడు అందరిని అనుగ్రహిస్తాడా?

ఇదివరకేమొ వాళ్ళందరి ఇంటికి వెళ్ళి వాళ్ళ వినాయకుడిని చూసేవారు.
అక్కడేమొ దణ్ణం పెట్టుకుంటారు.
ఇప్పుడేమొ అందరికి యెస్ ఎం యెస్ లు ఇస్తున్నారుగా - వినాయక చవితి శుభకాంక్షలు అని! అంతేనా?

పైగా ఈ టీ వీ లో చూపించారు.
"రాజు"గారు వారింట్లో కుటుంబంతో వినాయక చవితి చేసుకున్నారంట!
అలాగే "శాంత బయోటెక్" ఎం డి గారు వారి కుటుంబంతో చేసుకున్నారంట?
"నాయుడు"గారు పార్టీ ఆఫీసులో చేసుకున్నారంట!

మరి మీరు ఎవరింట్లొ చేసుకున్నారు?

మరి ఆయన చిన్నింట్లొ చేసుకున్నడా లేక పెద్ద ఇంట్లో చేసుకున్నాడా?

మరి ఆబిడ ఏవరింట్లో చేసుకుందో?

చెప్పండి.

మీలాంటి పెద్దొళ్ళు చేబితేనెగా మాబోటి చిన్నొళ్ళకి తెలిసేది?
మేము మా పిల్లలకి చెప్పుకోవాలి కదా?

దయచేసి వివరంగా చెప్పండి.
ఈ బ్లాగర్‌కి పైన ఉదహరించిన విషయాలు అర్ధంకావటంలేదు.
మీరేమన్నా ఆ సందేహాలు తీర్చగలరా?



పూర్తిగా చదవండి ...

పరిక్ష - సాహిత్య సేవకులు పాల్గొనండి!

Posted by netizen నెటిజన్ on Saturday, September 15, 2007

"సాహిత్య సేవకుల"కు తెలుగు సాహిత్యంలో ఏమేరకు ప్రవేశమున్నది తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది.

ఈ వారం ఈ సాహిత్య పరిక్ష "శవ సాహిత్యం" విభాగానికి చెందినది. ఈ వారం సాహిత్య సేవకుల వేతన వివరాలు కూడా "తెలుగు నిధి" తెలియజేస్తున్నది.

౧ - "అణాకొక బేడ స్టాంప్" రాసినదెవరు?

౨ - "మొగలాయి దర్బారు"ని తెలుగులోకి అనువదించినదెవరు?

౩ - "నాయర్" ఎవరింటిలో వంటచేసేవాడు?

౪ - కొమ్మురి సాంశివరావు సృష్టించిన ప్రసిద్ధ పాత్రల పేర్లు తెలియజేయండి?

౫ - "షాడో" పాత్ర సృష్టి కర్త ఎవరు?

మీ జవాబులో ప్రశ్న సంఖ్య - వ్రాసిన కవి / కవయిత్రి / రచయిత /త్రి, కధకుడు/రాలు పేరు, రచన పేరు వగైరా వ్రాసి పంపాలి.
మీ జావాబుని ఈ చిరునామాకి పంపండి.

తెలుగునిధి ఎట్ జి్‌మైల్ డాట్ కాం.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

* * *


ఎన్నిక కాబడ్డ ప్రతి సాహిత్య సేవకుడు / సేవకురాలికి నివసిస్తున్న ఊరు / పట్టణ / గ్రామన్ని బట్టి వేతనం నిర్ణయించబడుతుంది.

ఇది తప్పనిసరి.
ప్రతి సాహిత్య సేవకుడు / సేవకురాలికి ఒక గణణయంత్రం ఉండితీరాలి. ఇది తప్పనిసరి.

అలాగే దానికి అంతర్జాల అనుసంధానం ఉండాలి. ఇది తప్పనిసరి.

వేతనం
ఇక వేతనం కనీసం మాసానికి పదివేల రూపాయలు. ఇది కాక ప్రోత్సాహకాలుకూడా వుంటాయి.
(అక్షరాల పదివేల రూపాయలు. INR 10,000/-)

+ + + + +



పక్కనే చిన్న poll అభిప్రాయసేకరణ కోసం.
అందులో పాల్గొనండి.

ఒకవేళ మీ అభిమాన డిటెక్టివ్ పాత్ర అందులో లేనట్టయితే దిగువనున్న "వాఖ్య" (comment)లో దయచేసి పేర్కొనగలరు.

తెలుగు సాహిత్యానికి కనీసం ఆ మాత్రం సహాయం చేయరూ?



పూర్తిగా చదవండి ...

సాహిత్య సేవకులు కావాలి - ప్రవేశ పరిక్ష

Posted by netizen నెటిజన్ on Saturday, September 8, 2007
ముఖ్య ప్రకటన
సభ్యుల కోరిక మేరకు ఈ ఉద్యోగం పేరు "సాహిత్య ప్రచారక్" నుండి "సాహిత్య సేవకులు" గా మార్చడమైనది. గమనించగలరు. ఇక పరిక్ష వ్రాయండి! అర్హులు కండి! ఉద్యోగం పొందండి!!






"తెలుగు నిధి" కి "సాహిత్య సేవకులు కావాలి" ప్రకటన అంతర్జాల ముఖంగా మీరు చూసే ఉంటారు.(ఈ ఉద్యోగానికి అర్హతలకోసం "తెలుగు నిధి" వారి ప్రకటన ను చూడండి).

"సాహిత్య సేవకు"లను ఎన్నుకోవడానికి జరిగిన "సర్వసభ్య సమావేశం" లో సభ్యులు కొన్ని ప్రతిపాదనలు చేసారు. సభ్యుల సూచన మేరకు ఒక ప్రశ్నావళిని తయారుచేయడం జరిగింది. (అందులో నమూనా కొఱకు కొన్ని ప్రశ్నలు క్రింద ఉన్నవి).

"సాహిత్య సేవకుల"కు తెలుగు సాహిత్యంలో ఏమేరకు ప్రవేశమున్నది తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది.

మీ ముందు కొంత పాఠన్ని ఉంచాము.
అది చదివి దాని వ్రాసినవారేవరన్నది చెప్పలి. మీ జవాబులో
ప్రశ్న సంఖ్య - వ్రాసిన కవి / కవయిత్రి / రచయిత /త్రి, కధకుడు/రాలు పేరు, రచన పేరు వగైరా వ్రాసి పంపాలి.

అవసరమైతే సంప్రదించడానికి జవాబిస్తున్న వారి పూర్తి పేరు,(ఇంటిపేరుతో సహా)పూర్తి చిరునామతో పంపాలి. (అజ్ఞాతనామాలు, అనానిమాస్ అడ్డ్రసులతో జవాబులు చెల్లవు).

మీ జావాబుని ఈ చిరునామాకి పంపండి.

తెలుగునిధి ఎట్ జి్‌మైల్ డాట్ కాం.
* * * * *

ప్రశ్న: ఇది మచ్చుకి మాత్రమే.
ఇక్కడ కొంత పాఠం ఉంది. పూర్తిగా చదివి ఇది వ్రాసిన వారి పేరు, గ్రంధ నామము, మీకు తెలిస్తే దేనినుండి ఇది తీసుకొనబడింది తెలియజేయండి.



ప్రశ్న
పాఠం:

"ఆలోచన యనగానేమి?అది యొక మానసిక వ్యాపారము. అతీంద్రియము. తాత్వికుడు ఆలోచన సేయును. అది లోకమునకుపకరించును. అయిన ఆలోచనచేయనిదెవరు? మానిసి ఐన ప్రతివాడును ఆ కార్యమును సలుపగలుడు. కాని తారతమ్యములు గలవు. కొందరివి మంచివైయుండును. కొందరివి కాదు. ఇంతకు నాతని మనంబున నేమి గలదు? మనకు తెలియదు. తెలియును. ఇది యొక చమత్కారము."

ఇది వ్రాసిన వారెవరు?
ఇది వ్రాసిన వారి పేరు *...................................
ఈ పాఠం ఈ రచన లోనిది:................................

ప్రశ్న ౨: లల్లాదేవి అసలు పేరేమిటి?

మీ జావాబు:..................................................

ప్రశ్న ౩: ""అతను అయోనిజుడు, స్వయంభువు, బ్రహ్మ మానస పుత్రులజాతిలోని వాడు. తన నివాసం మొగలితుర్రు అని వ్రాసుకున్నా యదార్ధంచేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలుకా గుమ్మలూరు అనే గ్రామంలో".

ఈ పాత్ర పేరేమిటి?
సృష్టికర్త ఎవరు?
మీ జావాబు:..................................................

* * * * *
* మీ (పంపుతున్న వారి) పూర్తి చిరునామా:
జవాబులు పంపవలసిన ఆఖరు తేది:
వీటికి జవాబులు ఆదివారం,౧౬ సెప్టంబరు ౨౦౦౭ సాయంత్రం ౬:౦౦ (భారతీయ కాలమానం ప్రకారం) లోపు తెలుగు నిధి కి అందాలి.
అలా అందిన వాటినే పరిశీలనకు ఎన్నిక జేయడం జరుగుతుంది.
పరిక్ష, ప్రశ్నావళి కొరకు మీ సూచనలేమైనా ఉంటే పైన ఇచ్చిన ఈమైల్‌కి పంపించగలరు.

* "సాహిత్య సేవకులు" జీత భృత్యాల వివరాలు త్వరలో, ఈ బ్లాగు ద్వారానే !
* ఈ వివరములేని జాబులు, జవాబులకు "తెలుగు నిధి" జవాబియ్యదు.



పూర్తిగా చదవండి ...

కత్తికి రెండు వైపులా పదునే!

Posted by netizen నెటిజన్ on Friday, September 7, 2007
నిజమే!
ప్రసార మాధ్యమాలు కావాలి.
కాని అవి తమ హద్దులేరగాలి అన్న ఈ నెటిజన్ మాట ఏమిటో చూద్దాం అని వేలాదిగా వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు.

అటు మొన్నటి రాకుమారి డయాన నుండి నిన్నటి రవీంద్ర రెడ్డి, లాలసల - రోహిత్ వరకు మొన్న లోకే‌ష్ - బ్రహ్మణిల వివాహం నుండి నిన్న పవన్ "కల్యాణ్" వరకు "కాదేవరు మాకు అడ్డు" అంటూ ప్రసార మాధ్యామాలు - వాటి మధ్య చిక్కి విలవిలాడుతున్న నేటి "మనిషి" దయనీయ పరిస్థితి చూసారుగా?

ఈ పరిమితి తెలుగు బ్లాగులకి మాత్రమేనని, మన తెలుగు ప్రసారమధ్యమాల వరకే అని అనుకోవద్దు.

ఈ నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవించే మరొక ఆంగ్ల దినపత్రికలోని వార్త ఇక్కడ చూడండి.



పూర్తిగా చదవండి ...

*** ఉద్యోగ ప్రకటన ***

Posted by netizen నెటిజన్ on Tuesday, September 4, 2007
*** ఉద్యోగ ప్రకటన ***

"సాహిత్య ప్రచారకులు"
కావాలి.

ముందుగా ఈ సంస్థ "తెలుగు నిధి" గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు:

తెలుగునాట తెలుగు అంతరించిపోతున్నది గమనించిన కొంతమంది ప్రవాస అంధ్రులు, (ప్రవాసాంధ్రులు తప్పనిసరిగా అమెరికా వారై ఉండాలని లేదు. వారు ఖర్గపూర్ వారైఉండవచ్చు,సతారా వారైఉండవచ్చు, ఒరిస్సా వారైఉండవచ్చు, తమిళనాట ఉన్నవారైఉండవచ్చు కదా?) తమ తోటి తెలుగు సోదర సోదరీమణులతో కలిసి, తెలుగు సంస్కృతిని పరిరక్షిండంకోసం ఒక నిధిని మొదలుబెట్టారు.

దాని పేరు "తెలుగు నిధి"

ఈ నిధికి కొన్ని నిర్దేశిత లక్ష్యాలను కూడా నిర్ణయించడం జరిగింది.

అందులో ఒకానొక లక్ష్యం: ప్రచురించబడ్డ ప్రతి తెలుగు సాహిత్య ప్రక్రియని కాలదోషం పట్టకుండా భద్రపరిచి, ముందు తరాలా వారికి అందచేయాలి.

నేటి తెలుగు అభిమానులు,ఎవరికి తోచినరీతిలో వారు, వారి శక్థి సామర్ధ్యాలామేరకు తెలుగు వాడి చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతుని, విభిన్న కళా రూపాలను వారికి తోచిన రీతిలో భద్రపరుస్తున్నారు. కొందరు సాహిత్యంలొని కధలను సేకరిస్తుంటే మరికొందరు పత్రికలను సేకరిస్తున్నారు.

ఇది ఒక బ్రహాత్కార్యం.

ఇది ఒక యజ్గ్నం.

దాదాపు శతబ్దాంకాల సాహిత్యాన్ని ఒక దరికి చేర్చి దానికి ఒక మార్గదర్సిక సూచిని తయారుచెయ్యాలి.


అందులో భాగమే నేటి ఈ ప్రకటన.

"తెలుగు నిధి" తన "సాహిత్య ప్రచారకులు" కోరుకుంటున్న కనీస అర్హతలు ఇవి.

౧. విధిగా తెలుగు వ్రాయడం, చదవడం తెలిసి ఉండాలి.

౨. పద్యం, గద్యము, వచనం అనేకాకుండా తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోను పరిచయం ఉండాలి.

3. స్త్రీ , పురుషులిద్దరు అర్హులే.

౪. వయస్సు కనీసం ౧౮ సంవత్సరాలుండాలి.

౫. గణన యంత్రంతో (కంప్యుటర్)చక్కటి పరిచయం ఉండాలి.

౬. అంతర్జాల విహారులై, దాని మేళకువలన్ని తెలిసిన వారై ఉండాలి.

ఉద్యోగస్థలం: మీ ఇల్లే మీ కార్యాలయం.
పని వేళలు : మీరు కోరుకున్న సమయం.

"తెలుగు " అభిమానులందరికి తెలియజేయ్యండి.

మీరు అర్హులనుకున్నావారందరికి తప్పక తెలియజెయ్యండి.

చెయ్యీత్తి జై కొట్టు తెలుగోడా!!


* ముఖ్య గమనిక: నగదు రూపేణా గాని, మరో రూపేణా గాని "ఒక్క రూపాయి"కి గూడా మీరు "తెలుగు నిధి" చెల్లించవలసినది లేదు.

త్వరలో మరిన్ని వివరాలు..



పూర్తిగా చదవండి ...

మీరు బ్లాగు వీరులా?

Posted by netizen నెటిజన్ on Sunday, September 2, 2007
పొద్దులో తాడేపల్లి బాలసుబ్రమణ్యం గారి "మన జాతీయ కళారూపాల సంరక్షణ" (ఆగస్ట్ 1వ, 2007) వ్యాసానికి రోహిణిప్రసాదు గారి వ్యాఖ్య చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఇది.

తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.

* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.



పూర్తిగా చదవండి ...