ది అచీవర్స్

Posted by netizen నెటిజన్ on Thursday, January 17, 2008
" అంబాని(ముఖేష్)కి, భారత దేశంలోని అతి పేదవాడికి ఒక గొప్ప సారుప్యత ఉంది. అదేమిటంటే ఇద్దరూ కూడా 'పన్నులూ ఒద్దనే అంటారు". ఇది ఎన్.డి టీ వి వారి "Indian of the Year" బహుమతి ప్రధానోత్సవ సందర్భంలో - కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం గారి వాఖ్య.

ముఖేష్ "బెస్ట్ బిజినెస్ మాన్ ఆఫ్ ది ఇయర్" బహుమతి గ్రహీత.

తస్సాదియ్యా, వీళ్ల మాటలతో గారడీలు చూడండి: "Inspirational Leader" అంట. దీనిని, అబ్దుల్ కలాంకి ఇచ్చారు.

ఇక "Entertainer of the Year" గా రజనికాంత్ బహుమతిని అందుకున్నాడు.

"బెస్ట్ ఆక్టర్" అవార్డుని షారుఖ్ ఖాన్‌కి ఇచ్చారు. అంటే ఈయన "ఎంటర్‌టైనర్" కాదు, ఆ రజనికాంత్ గారేమో "అక్టర్" కారేమో!

"రాజుగారి రెండో పెళ్ళం" మంచిదంటూ మళ్ళీ మొదలుపెడుతున్నానంటారా?!

1 వ్యాఖ్య:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on January 18, 2008 at 12:13 AM   said...

ఈమధ్య నేనో సాహితీ మాసపత్రిక చదువుతూ అవాక్కయ్యాను.ఆసంచికలో ఒకతి ఉత్తమకధ,మరొకరు ఉత్తమ కధకుడు.రెండూ వేర్వేరు.ఉత్తమకధకుడు రాసింది ఉత్తమకధ ఎందుకవ్వలేదో,ఉత్తమ కధకుడు ఉత్తమ కధ ఎందుకు రాయలేదో అంతుబట్టటం లేదు.కొన్నాళ్ళ క్రితం యూత్ ఐకాన్ ఆఫ్ ది యియర్ అని ముకేష్ అంబానీ తమ్ముడికే మరో టీవి వారు ఒక ఆవార్డు ఇచ్చారు. ఎవరనారు భారతీయ టీవి చానళ్ళలో హాస్యం తక్కువని?

Post a Comment