ప్రసార మాధ్యమాలు - ఒబిట్ ‌లు

Posted by netizen నెటిజన్ on Thursday, February 7, 2008
చనిపోయైన వారి గురించి మంచిమాటలు చెప్పుకోవాలి. పోయిన వారు ఎటూపొయ్యారు. మళ్ళీ వారిని విమర్శించనేలా?

ఆ మధ్య ఒక పెద్ద మనిషి చనిపొయాడు. బాగా పరిచయమున్న వ్యక్తి. ఒకానొక వామపక్ష పత్రికలో ఉద్యోగం చేసాడు. వాటికి ఉన్న సాంస్కృతిక సంఘాలకు సహజంగానే దగ్గిరయ్యాడు. సాహిత్యం, సాహిత్య కారులు, అరసం, విరసం, సరసం, నీరసం అన్నింటిని తిట్టేవాడు. డబ్బున్నవాళ్ళతో తిరిగి చందాలు వసూలు చేసేవాడు. సినిమా ప్రపంచంలో వామపక్ష వాదులతో పరిచయమున్నవాళ్ళతో భుజాలు కలిపేవాడు. ఆ పేర్లు తనకి అవసరం అనుకునే చోట వాడుకునేవాడు.

ఏదో కారాణాల వల్ల (అవి మనకి అనవసరం) చేస్తున్న దినపత్రికనుండి ఒక ఫారిన్ మిషన్ వారి పత్రికా కార్యాలయంలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది కాస్త మూతపడింది. బాక్‌ టు హోం.

స్థూలంగా ఒక పాత్రికేయుడు గా ఇది అయన జీవితం.

పుట్టుట గిట్టుట కొరకే కదా. వయసు మీద కొచ్చింది. అనారోగ్యంతో హాస్పిటలో ట్రీట్మెంట్ తీసుకుంటు చనిపొయ్యాడు.

ఒక ప్రముఖ అంగ్ల దిన పత్రికలో, ఒబిట్ వ్రాస్తు అయనని ఆ ఫారిన్ మిషన్ పత్రికకు ఏకంగా "సంపాదకుడు" ని చేసేసారు.

దీన్నేమనాలి?


"ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు" చదివిన తరువాత;

0 వ్యాఖ్యలు:

Post a Comment