తెలుగు సాహిత్యం - వర్గీకరణ (తెలుగు నిధి) ౨

2007 సెప్టెంబరు నెలలో "సాహిత్య సేవకులు" కావాలని "తెలుగు నిధి" వారు కోరడం, ఆ ఉద్యోగానికి చిన్న ప్రవేశార్హత పరిక్ష పెట్టడం, ఈ బ్లాగును గమనిస్తున్నవారందరికి గుర్తు ఉండేఉంటుంది.

అందులో భాగంగానే డిసెంబర్ 1, 2007 న మరొక టపాని ప్రచురించడం జరిగింది.
ఆ టపాని ఇక్కడ చూడవచ్చు.
సూక్షంగా ఆ టపాలో తెలుగు సాహిత్య "వర్గీకరణ"లో కలుపవలసిన నూతన "వర్గీకరణ"లని, "వాఖ్యల ద్వార మీ అమూల్యమైన సూచనలని తెలియజేయండి" అంటూ కోరడమైనది. కారణం "అరటి పండు తొక్క వొలిచి, పండుని నోట్లొ పెట్టినంత" సుళువుగా ఈ వర్గీకరణలు ప్రజలందరికి చేరాలన్న సదేచ్హ.

విపరీతమైన, ఆర్ధిక, మానసిక, సాంసారిక, వైవాహిక, వివాహ, వివాహేతర, లైంగిక, సామాజిక, నైతిక, వగైరా వగైరా ఒత్తిడిలకు లోనవుతున్న ఈ తెలుగు ప్రజలకు అంతకన్నా సులభంగా వారి తెలుగు "నిధి" వారికి అప్పగించడం కష్టమని "తెలుగునిధి" సభ్యులు భావించారు.

ఒక తరానికి తెలిసిన సాహిత్యాన్ని మరొక తరానికి అందిచడానికి ఈ "పునఃవర్గీకరణ" తప్పదు. అందులో భాగంగానే తెలుగు సాహిత్యాన్ని కొన్ని "ప్రక్రియ"లకు చెందే విధంగా "వర్గీకరణ" చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమైనది.

అందులో భాగంగానే ఆనాడు కొన్ని వర్గీకరణములను ఈ విధంగా సూచించడం జరిగింది. అవి ఇవి:

౧ - పద్య సాహిత్యం

౨ - గద్య సాహిత్యం

౩ - వచన సాహిత్యం

౪ - కధా సాహిత్యం
ఆ టపాకు స్పందిస్తు, డిసెంబరు ౧న, రాఘవగారు "నాటక,నవలాసాహిత్యాలు కూడా కలపండి" అని సూచించారు.

ఇక ఈ "వర్గీకరణ" అభిప్రాయంతో కొంత మేరకు భావసారుప్యత ఉన్న రెండు బ్లాగులు, మచ్చుకి :
ఒకటి:నువ్వుశెట్టి బ్రదర్స్ "తల్లీ! భిక్షాందేహీ!"
రెండు:కాల్ ఫర్ దళిత పర్సనల్ నరేటివ్స్

ఇక "తెలుగునిధి" వారి వర్గీకరణలు చూడండి.

  1. దిగంబర సాహిత్యం
  2. అవివాహిత సాహిత్యం
  3. అశ్లీల సాహిత్యం
  4. కమ్మ సాహిత్యం
  5. కాపు సాహిత్యం
  6. అందరికి సాహిత్యం
  7. కృష్ణ జిల్లా వర్గీకరణలు
  8. గుంటూర్ జిల సాహిత్యం
  9. జంఝ సాహిత్యం
  10. డిటేక్టివ్ సాహిత్యం
  11. తెలంగాణా సాహిత్యం
  12. దళిత సాహిత్యం
  13. దొరల సాహిత్యం
  14. నవలా సాహిత్యం
  15. పత్తేదారి సాహిత్యం
  16. పిలక సాహిత్యం
  17. పురుష సాహిత్యం
  18. ప్రేమ సాహిత్యం
  19. బాల సాహిత్యం
  20. బాలల సాహిత్యం
  21. బాలిక సాహిత్యం
  22. బాలుర సాహిత్యం
  23. బూతు సాహిత్యం
  24. బైబుల్ సాహిత్యం
  25. బొంకు సాహిత్యం
  26. మాదిగ సాహిత్యం
  27. మాల సాహిత్యం
  28. యువ సాహిత్యం
  29. రంకు సాహిత్యం
  30. రజస్వల సాహిత్యం
  31. రాయలసీమ సాహిత్యం
  32. రెడ్డి సాహిత్యం
  33. వంటింటి సాహిత్యం
  34. విధవ సాహిత్యం
  35. వివాహిత సాహిత్యం
  36. వెలయాలి సాహిత్యం
  37. వైదిక సాహిత్యం
  38. వైష్ణవ సాహిత్యం
  39. ఉర్దూ సాహిత్యం
  40. శవ సాహిత్యం
  41. శృంగార సాహిత్యం
  42. స్త్రీ సాహిత్యం ...

మీ మార్పులు, చేర్పులు, సూచనలు, సలహాలు, సద్విమర్శలు,కువిమర్శలు, ప్రేలాపనలు, అరుపులు, కేకలు, హాస్చ‌ర్యాలు, అసహ్యాలు మొదలైనవన్ని ఈ చిరునామాకి పంపండి.


ఈ "తెలుగునిధి" టపా కు వచ్చిన ప్రతి స్పందన ప్రచురించబడుతుంది. అలా ఇష్టపడనివారు - తమ అయిష్టాన్నితెలియజీస్తే వారి అభిప్రాయాం గౌరవించబడుతుంది.


6 వ్యాఖ్యలు:

oremuna on March 6, 2008 at 2:42 AM   said...

మరీ ఇలా నిలువుగా కాకుండా కొద్దిగా అడ్డంగా కోసి మరళా కొద్దిగా నిలువుగా కోసి తరువాత అవసరాన్ని బట్టి నిలువుగా అడ్డంగా కోస్తే ఉపయోగకరంగా ఉండేది, కావాలంటే ఒక ఎంట్రీ నుండి మరొక ఎంట్రీకి సాఫ్ట్ లింకులు లేదా డాటెడ్ లింకులు ఇవ్వవచ్చు.

Anonymous on March 6, 2008 at 3:30 AM   said...

@oremuna: మీ సూచనలకి ధన్యవాదములు. ఆ కోయడాలు, నరకడాలు తెలియవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి.

కొత్త పాళీ on March 6, 2008 at 3:00 PM   said...

హబ్బ ఏవి బ్రహండమైన వర్గీకరణండీ!

కృష్ణా వాళ్ళదేమో జిల్లా సాహిత్యమా? గుంటూరు వాళ్ళది జిల సాహిత్యమా? - చాలా బాగుంది.

మీ ప్రవేశ పరీక్షలో ఇదికూడా ఒక ప్రశ్నగా చేర్చండి:
అశ్లీల సాహిత్యమునకు, బూతు సాహిత్యమునకు, శృంగార సాహిత్యమునకు గల పోలికలను తేడాలను సోదాహరణముగా వివరింపుము. (5 గుణములు)

oremuna on March 6, 2008 at 9:37 PM   said...

మీకు అర్థం అయినట్టు లేదు!

"అయినా నాకెం బాధ?"


వర్గీకరణ ఇలా బండగా చెయ్యకుండా, కొంచెం అర్థం అయ్యేట్టు చేసి ఉండవలసినది.

ఉదాహరణకు:
తొలి రౌండ్లో
కుల సాహిత్యం, ప్రాంతీయ సాహిత్యం, ....

తరువాతి రౌడ్లో కుల సాహిత్యంలో (....); ప్రాంతీయ సాహిత్యంలో (....)

ఇలా వర్గీకరణ చేస్తే కొంచెం చదవదగ్గగా ఉండేది.

Anonymous on March 6, 2008 at 11:05 PM   said...

@కొత్తపాళి:దున్నపోతులా నిద్రపోతున్న ఈ సమాజాన్ని, మాములు చరణాకోలతో నిద్ర లేపలేము. అందుకనే మా భాష అంత కటువుగా ఉంటుంది అని తన ప్రత్యుత్తరంలో నగ్నముని వ్రాసాడు. నగ్నముని ఆ ఉత్తరంలో రాసిన పదజాలాన్ని ఇక్కడ ఉదహరించడం కష్టం. ఎందుకంటే, ఈ బ్లాగుని స్త్రీలు కూడా చదువుతున్నారు.

రక్తం సల,సల,సల కాగిపోతుంది.
బుర్ర ఎప్పుడు బద్దలై పోతుందో తెలియని పరిస్థితి. బ్లాగర్ ఒకరు ఎక్కడో అడిగారు.
What do you expect, Utopia? అని.
అది ఒద్దు అని అనుకున్నప్పుడు, నీ సమాజంగురించి అలోచనేల? నీ విద్వత్తు ఎందుకు?
నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన ఎందుకు?

"తెలుగునిధి" doesn't exist.
But you know there were a few applications.

"విశ్వనాధ సత్యనారాయణ ఎవరు" అని ఒక "సాహితీవేత్త" అడిగితే మీ జవాబు?
మొన్నటి "లల్లాదేవి" పేరు కూడా తెలియదా?
వీరు...?

Anonymous on March 6, 2008 at 11:25 PM   said...

@oremuna: అర్ధం అయ్యింది. అయ్యింది కాబట్టే ఒక పెగ్గు ఎక్కువయ్యింది. ఈ మధ్య అర్ధం చేసుకోవడం కూడా ఎక్కువై, పెగ్గులూ ఎక్కువైపొయ్యి , బుర్రకి మత్తు ఎక్కువైపొతున్నది. మత్తువేక్కువై పోతున్నకొద్ది ఓపిక నశిస్తున్నది.

ఎప్పటి "తెలుగునిధి"?
౨౦౦౭లో మొదలైన "తెలుగు నిధి". ఇన్ని గంటలు, ఇన్ని బ్లాగుల తరువాత భళ్ళున వాంతి అయ్యింది. కాళ్ళ మీదే పడింది. అందుకనే మీరు " అయినా నాకెం బాధ" అని అనగలిగారు.
కడుపుని ఆపుకోగలరు. తీసుకోగలరు. వాంతిని ఆపుకోలేరు కదా?
ఇక్కడ రీడబిలిటి గురించి ఆలోచించలేదు.
ఇక సాగతీసే ఓపిక లేక ఇక్కడితో ముగించాల్సివచ్చింది.

Post a Comment