ఈనాడు - మార్గదర్శి రామోజీ రావు ..పారిపొయ్యాడంట?!

దినపత్రికల పరిభాషలో చెప్పాలంటే ఇది అదిరిపొయ్యే బానరు (Banner). దీన్ని చూసే మీరు కధని చదువుతారు, ఇదిగో ఈ బ్లాగు ని చదువుతున్నట్టు.



పత్రిక ఇంతలావు బానరు పెట్టలేదు.క్లుప్తంగా "జేంస్ హాడ్లి చేజ్" (James Hadley Chase) తన నవలకి పెట్టుకున్న పేరులాగా - "హిట్ అండ్ రన్" (Hit and run) అని పెట్టుకున్నారు. పతాక శీర్షికలాగా దీన్ని ఏ మొదటి పేజిలోనో పెట్టలేదు. ప్రకటనలిచ్చే ఏ సంస్థకైనా "పేజ్ 3" విలువ అవగతమే. మొదటి పేజి, ఆఖరి పేజి కాకపొతే కనీసం 3 వ పేజి ఐనా ఇవ్వమని అడుగుతుంటారు. పేజ్ 3లో బాక్స్ ఐటం గా పెట్టారు. బొమ్మని చూసారుగా!



చెరుకురి రామోజీరావు అనుకుంటే (రాజుగారు అనుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే పద్ధతిలో..), ఈయన "మెడియా బారెన్" (Media baron) కదా, ఆ ద్విచక్ర వాహన చోదకుడికి,ఎంతో కొంత "సహాయం" ఇంటికి పంపించే ఏర్పాటు చేయించవచ్చు. అంటే ఇప్పటి దాక అటువంటిది ఏమి చెయ్యకపొయిఉండినట్టైయితే.




ఎన్నెన్నో గూడుపుఠాణిలూ, కుట్రలు, కుతంత్రాలు, నేరాలు, ఘోరాలు వెలుగులోకి తీసుకునివచ్చిన "పెద్ద మనిషి" కాబట్టి, తన అధీనంలో ఒక సంస్థ, తగిన వనరులతో ఉన్నది కాబట్టి, ఆ చోదకుడిని (AP 11 N 7274) వెతికి పట్టుకోవడం ఏమంత కష్టం కాదు. అతనికి కొంత పరిహారాన్ని ఇస్తే బాగుంటుంది. లేకపొతే ఆ "పేదవానికి కోపాన్ని" మరొక "సాక్షి" వాడుకోడనిఏముంది.



"చట్టం తన పనిని తను చేసుకుంటూ పోతూ ఉంటూ ఉంటుంది", (ఎక్కడికి అని అడగొద్దు) అనే ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు ఏమంటారో.


తా.కలం: పెద్ద జోకేమిటంటే ఇప్పటి దాక మన తెలుగు బ్లాగరులెవరు దీనిమీద స్పందించకపోవడం. ఇదే జగన్

ఐతే, లో వార్త వచ్చిఉంటే ఎంత గొడవ జరిగిఉండేది.


15 వ్యాఖ్యలు:

బ్లాగాగ్ని on April 2, 2008 at 4:42 AM   said...

ఇప్పుడే చూశానిది.
గుద్దిన తరువాత ఆ మనిషి బతికున్నాడో లేదో కూడా తిరిగి చూడని వ్యక్తి ఇంటికి సహాయం పంపించడం కూడానా?
ఇక 'ఈనాడులో వార్త వచ్చిఉంటే ఎంత గొడవ జరిగిఉండేది?' -
మీరన్నది 100% కరెక్ట్. కానీ ఇక్కడ ప్రధాన సమస్య పత్రికల 'రీచ్'. ఈనాడు విస్తృతంగా చదవబడే పత్రిక. దానిలో వచ్చిన ఎంత చిన్న వార్తైనా కొన్ని లక్షలమంది చదువుతారు. ప్రతిస్పందనలు కూడా అదే రీతిలో వుంటాయి. సాక్షి వారంరోజుల వయసుకూడా లేని పత్రిక. దీనిని రోజూ ఎంతమంది చదువుతున్నారు(ముఖ్యంగా బ్లాగర్లు)? ఎవరూ చదవనప్పుడు ప్రతిస్పందనెట్లా ఆశిస్తాం?

Anonymous on April 2, 2008 at 6:29 AM   said...

@బ్లాగాగ్ని: నిజమే బ్లాగాగ్ని గారు. కాని జగన్ గారు 11 లక్షల 75 వేలలోగిళ్ళల్లో "సాక్షి" అందుతున్నదని చెప్పుకున్నారు.

అమ్మకాలు, కొనుగోళ్ళు, చందాదారుల సంగతి వారికే తెలియాలి.
ఆ పదకొండు లక్షల డెభైఐదువేలల్లో ఒక్క బ్లాగరు
లేకపొయ్యాడే.:(

Naveen Garla on April 2, 2008 at 6:51 AM   said...

ఈ వార్త ద్వారా తను కూడా 'ఆ రెండు పత్రికల' కన్నా తేడాగా లేనని సాక్షి నిరూపించుకొంది. ఈ సంఘటన ద్వారా రామోజీరావును 'సాక్షు'లు అనుక్షణం కేమెరాలతో వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రదేశంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూండగా దీని మీదే ఏమిటట ఇంట్రెస్టు? కక్ష సాధింపు, దాడి కాకుంటే. ప్రజల గళంగా, ప్రతిపక్షంగా ఉండాల్సిన పత్రిక ఇలా పేజీలను అన్నార్తుల ఆర్తనాదాల కోసం కాక ఇలాంటి చిల్లర విషయాల కోసం కెటాయించడం అంత బాగోలేదు.

Naveen Garla on April 2, 2008 at 6:53 AM   said...

>> ఆ పదకొండు లక్షల డెభైఐదువేలల్లో ఒక్క బ్లాగరు
లేకపొయ్యాడే.:(
ఈ వార్త లింకును ఆ రోజే వ్యాఖ్య రూపంలో ఇచ్చాను: http://oremuna.com/blog/?p=1375#comment-31129

( http://gsnaveen.wordpress.com )

Anonymous on April 2, 2008 at 8:21 AM   said...

@naveen garla: నిజమే నవీన్ గారు. వారికిది వార్త.పాత్రికేయులు చెప్పుకునే ప్రధమ పాఠం. కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కని కరిస్తే వార్త. అలాగున , విలువలు గురించి మాట్లాడే మనిషి, పదుగురు చూస్తున్నప్పుడు, ఆలోచించి జాగ్రత్తగా చెయ్యాలి, ఏం చేసినా.
ఈ సంఘటన దానిని నిరూపిస్తున్నది.
"సాక్షి" వార్తా పత్రిక !

రాఘవ on April 2, 2008 at 8:25 AM   said...

ఐనా గుద్దింది రామోజీరావే అనడాన్కి సాక్షి??? :)

Niranjan Pulipati on April 2, 2008 at 8:41 AM   said...

ఆ ఫోటో లో చూస్తే బైక్ పైన వ్యక్తికి గానీ, బైక్ కి గానీ ఏమీ కాలేదు అని చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఆ బైక్ కనీసం పక్కకు ఒరిగినట్టూ కూడా లేదు. హైదరాబాద్ ట్రాఫిక్ లో మరీ ఇంత చిన్న సంఘటనలు వందలలో జరుగుతుంటాయేమో రోజూ.. అదేదీ సాక్షి కి కనిపించలేదా పాపం ? అయినా పత్రిక విడుదల ముందు ఆ సాక్షి ఇచ్చుకున్నా హైప్ లో ఆ పత్రిక ను ఎంతో గొప్పగా వూహించుకున్నాము. తీరా చూస్తే ఇలాంటి చెత్త న్యూసు. విడుదల అయి వారం గడిచినా ఇంకా ఆ రెండు పత్రికలను, 'దేశం' ను ఆడిపోసుకోవటం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. ఇలాంటి వేస్ట్ న్యూస్ మీద కూడా స్పందిచాలంటే కొద్దిగా కష్టమేమో.

Anonymous on April 2, 2008 at 8:46 AM   said...

@రాఘవ: మీరు" "సాక్షి" గా నిలబడరా, రాఘవ గారు? :)

Anonymous on April 2, 2008 at 8:51 AM   said...

@naveen garla: అబ్బ! ఆ పదకొండు లక్షల డెభైఐదు వేల మందిలో మన "బ్లాగర్ " మీరొకరు దొరికారండి!
చందాదారులా మాస్టారు?
అబ్బే, ఏమి లేదండి, ఈ టపాలికి మీరు "సాక్షి" గా ఉంటారేమో నని!
ఇందాక రాఘవ గారు, "సాక్షి" ఎవరని అడిగారు! :)

Anonymous on April 2, 2008 at 9:07 AM   said...

@niranjan pulipati: ఆర్యా నిరంజన్ గారు. "దేశం" మట్టుకు ఏం ఒరగ బెట్టిందండి! ఏలుతున్న ప్రభుత్వాన్ని తిట్టడం తప్పితే!" అని "వారు" అడుగుతున్నారండి.
మరి దానికి మీ స్పందన?
టీవి9న్నర రజనికాంట్ ఇష్టైలో ఉందా, లేదు, టీవి 5", "బెస్ట్ న్యూస్‌రీడర్ " - కల్యాణి ఇష్టైల్లో ఉందా?

Niranjan Pulipati on April 2, 2008 at 11:40 AM   said...

నేను ఇక్కడ 'దేశం' ఇరగదీసిందని ఎక్కడా చెప్పలేదే.. నేనన్నదల్లా 'సాక్షి ' తొలి సంపాదకీయం లో వార్తలని వక్రీకరించం, నిస్పక్షపాతం గా వుంటాం అని డప్పాలు కొట్టుకుందే.. ఇలాంటి వారలు, సొంత వ్యూస్ తో దానిని ఏ విధం గా సమర్థించుకొంటుంది అని అడుగుతున్నా .
ఇక 'దేశం' అంటారా, అది పాలించినప్పుడు చేసిన తప్పులకు నాలుగేళ్ళ క్రితలే ప్రజలు శిక్షించారు.. ఇప్పుడు పాలనలో ఏది అడిగినా ఇంకా ఆ తొమ్మిదేళ్ళ గురించి మాట్లాడటం తప్పి ఈ కాంగ్రెస్సు ఏమి చేసిందంటారు ? ఆ విషయం ఎప్పుడన్నా ఈ సాక్షి కనీసం ప్రస్తావించనైనా లేదే. అంతెందుకు, పత్రిక వచ్చిన వారం లో ప్రభుత్వం చేసిన ఒక చిన్న తప్పు కూడా ఈ సాక్షి కి కనిపించలేదా ? పాత ప్రభుత్వం చేసిన తప్పులు మాత్రమే కనిపిస్తాయా ? ఈ ప్రభుత్వం 22 విచారణా సంఘాలు వేసిందే.. ఇంతవరకూ ఒక్కటీ తేలలేదు.. అయినా ఇంకా పాత ప్రభుత్వం మీద ఆరోపణలతోనే సరిపుచ్చుతోందే. ఆ విచారణల సంగతి తేల్చి 'దేశం' చేసిన తప్పులకు వాళ్ళను శిక్షించవచ్చు కదా.

జ్యోతి on April 2, 2008 at 11:45 PM   said...

అసలు ఈ సాక్షి సంగతి చూద్దామని మొదటిరోజునుండి వేయించుకున్నా. పర్లేదు.మ్యాటర్ లేకున్నా తూకానికి లాభమే అనుకున్నా. ప్రజల పత్రిక అన్నా కూడా వీడు చంద్రబాబు, ఈనాడు మీదా ఎప్పుడు గొంతు విప్పుతాడా డైరెక్ట్ గా అని చూశా. మొన్న సోమవారం రోజు కారు, కార్టూన్ చూసాక చిరాకేసింది. మరుసటిరోజునుండే మానేసా. ఐదు రోజులు తీసుకున్నా కూడా ఒక్క పేజీ పూర్తిగా చదవాలనిపించలేదు. చూడ్దానికే ముద్దుగా ఉంది రంగు రంగులతో .ఇంకా కొన్ని రోజులు చూస్తే (చదివితే కాదు) నాకు తిట్లే వస్తాయేమో..

Naveen Garla on April 3, 2008 at 12:18 AM   said...

http://epaper.eenadu.net/pdf/2008/04/03/20080403a_011101009.jpg

ఇది చదవండి. అసలు ఆ కారులో రామోజీరావు లేనే లేడట. ఏమైనా డ్యామేజీ అయ్యిందిరా అని అంటే అది కారుకే (నంబరు ప్లేటు పగిలింది). ఇప్పుడేమని సమర్థించుకుంటారు 'సాక్షు'లు? అందుకే ఆవేశం కూడదనేది. శత్రువును మట్టికరిపించాలంటే...మన చేతికి మట్టి కానవసరం లేదు.

Anonymous on April 3, 2008 at 12:32 AM   said...

@జ్యోతి: తిట్లెందుకు? ఎవరి అభిప్రాయం వారిది? "సాక్షి" నిష్పక్షపాత పత్రిక అని మెగాస్టార్ చిరంజీవి గారే దానికి కితాబు ఇచ్చారు. అది వారి అభిప్రాయం. ఇది మీ అభిప్రాయం.
కిలో "ఈనాడు" కి, (అంటే తెలుగు పత్రికలన్నంటికి) ఈ చెత్త కాగితాల వారు ఎంత ఇస్తున్నారు?
అలాగే ఆంగ్ల పత్రికలకి ఎంత ఇస్తున్నారు?
ఆ మాత్రం నెలసరి చందా అంత కూడ మీకు మిగలడం లేదా?
పోతే ఇక పల్లీలకి, పొంగడాలకి, పకోడీలకి "సాక్షి" పనికి రాదా?

Post a Comment