"బుగ్గ కారు" - ఈనాడు - తెలుగు పదాలు

మధ్య ఈనాడు వారు తెలుగు పదాలు విరివిగానే వాడుతున్నారు. కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ఎప్పుడో రష్యన్ అనువాదాలలో చదివిన కొన్ని తెలుగు పదాలు ఇప్పుడు ఈనాడులో కనపడుతున్నవి. వాటిల్లో ఒకటి చోదకుడు.

పదాతిదళం ఈ రోజుల్లో ఎంత మంది వాడుతున్నారు. అలాగే వైమానిక దళం కూడాను. నౌకా దళం అన్నది కొంచెం విరివిగా, నేవికి బదులుగా వాడడం ఎక్కువగా కనబడుతుంటాయి. ఈనాడు వారు మొదట్లో వారి పాత్రికేయ సిబ్బందికని ఒక నిఘంటువుని ప్రచురించారు. పరకాల వారు కూడ ఒకటి ప్రచురణలోకి తెచ్చారు. ఇంకా చాలా మంది ఈ పారిభాషిక పదకోశాలను వెలువరించారు.

సరే అసలు సంగతిలోకి:

చాలా రోజుల క్రితం ; "బుగ్గ కారు" అన్న పదం కళ్ళెమ్మటబడింది. ఏ నేపధ్యంలో చదివింది గుర్తు రాలేదు. అందువల్ల దాని అర్ధం తెలియలేదు.

ఈ రోజు ఈనాడులో, మన ఆమాత్యులవారు, అసెంబ్లీ "సాక్షి" గా, ఈ బుగ్గకారులో రద్దీ సమయాల్లో ఎలా రాంగ్ రూట్‌లో తిరుగుతున్నారన్నది చూపిస్తున్న చిత్రాలను ప్రచురించింది. అది చూసిన తరువాత "బుగ్గ" కారుల గురించి తెలియవచ్చింది.

మీకేవరికైన ఈ "బుగ్గ" గురించిన అదనపు సమాచారముంటే తెలియజేయగలరు.

మీ సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు.

15 వ్యాఖ్యలు:

Anonymous on April 2, 2008 at 8:16 AM   said...

@కొత్తపాళీ: నెనర్లు!ఏ ప్రాంతం వారు వాడుతున్నారు ఈ పదాన్ని?

Anonymous on April 2, 2008 at 8:25 AM   said...

ఈ బుగ్గ కారు గురించి నేను మొదటగా ఈనాడు లోనే చూశా. అదీ వై.ఎస్. ముఖ్యమంత్రి కాకానే.
మంత్రి వర్గమ్లో చేరుతున్నామని తెలియగానే కొందరు ఎమ్లెయేలు కె.సి.ఆర్ కు మొర పెట్టుకున్నారట." అన్నా నువ్వేం చేస్తావో తెలియదు కానీ నాకు బుగ్గ కారున్న పదవి కావాలి" అని. అలా వుంది మన ఎమ్మెల్యేల పదవీ కాంక్ష. బహుశా వాటి ద్వారా వచ్చే సదుపాయాల్లో ఇదీ ఒకటేమో :-)

-- విహారి

వీవెన్ on April 2, 2008 at 8:29 AM   said...

బుగ్గ ఏ ప్రాంతంలో ఏ అర్థం ఇస్తుందో ఇక్కడ చర్చకు వచ్చింది: http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/945a69c3b3a1338e

Anonymous on April 2, 2008 at 8:37 AM   said...

@విహారి: అవునండి, విహారి గారు. రేపు ఎలక్షన్స్‌లో అందరు చూస్తుండగానే ఈ "ప్రజ" ఆ "బుగ్గ" లు పగిలేలా కొట్టకపోతే ఆ రాజీవశేఖరుడి మీసం మీరు పీకేసినంత ఒట్టు!

Anonymous on April 2, 2008 at 7:05 PM   said...

@వీవెన్: మీకు కృతజ్ఞతలు.

Anonymous on April 2, 2008 at 7:07 PM   said...

@వీవెన్: ఆ లింక్ పని చెయ్యటంలేదండి. సరైన లింక్ ఇవ్వగలరా?

తెలుగు'వాడి'ని on April 2, 2008 at 9:33 PM   said...

వీవెన్ గారు ఇచ్చిన లంకె కరెక్టేనండి కాకపోతే మీరు ఆ లంకెను copy చేసినప్పుడు చివర కొంత cut అయిపోతుంది ... ఇదిగోండి పూర్తి లంకె :

బుగ్గ గురించి చర్చ

FYI: ఇలా మీకు పొడవాటి లంకె ఎవరైనా ఇచ్చినప్పుడు ... మీరు మీ browser లో ఆ page యొక్క source చూసి పూర్తి లంకెను తెలుసుకోవచ్చు .. ( Firefox అయితే View->Page Source, Internet Explorer అయితే View->Source ).. అలా చేయగా కనిపించే source లో మీ లంకెను వెదకండి ... అక్కడ నుంచి పూర్తి link ను copy చేసుకోండి.

Anonymous on April 2, 2008 at 9:44 PM   said...

@వీవెన్ గారు, ఆ "బుగ్గ" వివరం తెలిసింది. మీకు థాంకులు.

"బుగ్గ" వివరాలకు ఇక్కడ చూడండి.
http://tinyurl.com/3944jo
లేదా ఇక్కడ
http://groups.google.com/group/
telugupadam/browse_thread/
thread/945a69c3b3a1338e

Anonymous on April 2, 2008 at 10:08 PM   said...

@తెలుగు"వాడి"ని గారు, మీకూ కృతజ్ఞతలు!

జ్యోతి on April 3, 2008 at 5:54 AM   said...

బుగ్గ = చెంప, బల్బు, నీటి బుడగ, బెలూన్,

Anonymous on April 3, 2008 at 6:39 AM   said...

@జ్యోతి:థాంకులు మీకు.
"నీటి బుగ్గలు" ఏ ప్రాతంలో వాడుకలో ఉందో ఎవరైనా చెప్పగలరా?

రానారె on April 3, 2008 at 10:41 AM   said...

భూమిలోనుంచి దానంతట అదే పైకి వుబికే నీటి వూట - అనే అర్థంలో కడప ప్రాంతంలో నీటిబుగ్గ అనే పదాన్ని వాడతారు. కడప పట్టణంలో గుండా ప్రవహించే వంక/యేరు/చిన్ననది ఒకటుంది. దాని పేరు బుగ్గవంక.

Anonymous on April 3, 2008 at 7:15 PM   said...

@రానారె: ఆ అర్ధం గుర్తువచ్చింది, కాని వాడకం ఎక్కడన్నది తెలియరాలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు, రానారె గారు.

Anonymous on July 12, 2008 at 6:33 AM   said...

ఏ తెలుగుపదం ఎక్కడిదైనా, ఉపయోగపడితే ఆదరించడం మన తెలుగువాళ్ళు నేర్చుకోవాలి. ఎన్నో పరాయిభాషల్ని మన నెత్తిమీద మోస్తున్నాం. తోటి తెలుగువాడి వాడుకని భరించలేమా ?

Post a Comment