"కోట" - "సాక్షి". మార్గదర్శి రామోజీరావు పారిపోలేదంట!

వార్తని గమనించి మీతో పంచుకోవడానికి పంపిన తోటి బ్లాగరు - శ్రీ నవీన్ గార్ల గారికి కృతజ్ఞతలతో టపా మొదలువుతున్నది.

Samuel Langhorne Clemens తన మరణవార్తని విన్నప్పుడు - "The reports of my death are greatly exaggerated", అని అన్నాడట.

అలాగే మన "సాక్షి" పొటిగరాపు నగేష్ బాబు కూడా ముందు వెనకా చూసుకోకుండా ఈ రిపోర్ట్‌ని ఫైల్ చెయ్యడం, "ఖాఖీవనం" పతంజలి గారు "ఒకే" అనడం, అది ఆ పదకొండు లక్షల డెభైఐదు వేల లోగిళ్ళలోకి చేరడం వెనువెంటనే జరిగిపోయినవి.

దానికి "ఖండన" ఇదిగో ఇక్కడ ఉండనే ఉంది.ఇక
ఒక చిన్న అనుమానం. మీరెవరన్నా దానిని తీర్చగలిగితే సంతోషం.

మార్గదర్శి రామోజీరావుగారి స్థాయికి తగిన బండే అది - చూస్తే మెర్క్ (Mercedes Benz) లాగానే ఉంది. మరి అంత ఖరీదైన కారుని తన సెక్యూరిటి అధికారికి కేటాయించారంటారా?

చూద్దాం మన "సాక్షి", నగేష్ బాబులు రేపు ఏమంటారో?
రేపు కలుద్దామా !


* ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి ఇక్కడ నొక్కండి.
* హార్ద్ కాపి వారు, నేటి అంటే గురువారం, ఏప్రిల్ 3, 2008 నాటి ఈనాడు, బ్రాడ్‌షీట్‌లో 11వ పేజిలో ఎడమ చేతివైపు మొట్టమొదటి బాక్స్ చూడండి.

2 వ్యాఖ్యలు:

Anonymous on April 3, 2008 at 6:53 AM   said...

అది బెంజి కాదు. హుండయ్ అసెంట్. అయినా హుండయ్ అసెంట్ లో రామోజీ వెళ్ళడని రూలు లేదు.

Post a Comment