ఎవరి చావు వారు చస్తే తప్పేమిటండి?

పోలీసుశాఖలో, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగార్హతలలో ప్రస్తుతం అమలులోనున్న వయో పరిమితిని 25 నుండి 28 పెంచమని B.C వర్గానికి చెందిన కొంత మంది విద్యార్ధులు నిన్న ఉస్మానియా యూనివర్సిటి ప్రాంగణంలో నున్న ఆర్ట్స్ కాలేజి పై అంతస్థుకి జేరుకుని ఆందోళనకి దిగారు. ఒక వేళ ప్రభుత్వం గనక "దిగి" రాకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

సాయంత్రం సుమారు 4-30 గంటల ప్రాతంలో మరొక విద్యార్ధి వర్గం బయలుదేరింది. వీరు SC, ST, BC వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకున్నారు. వయోపరిమితిలో మార్పు "unjustified" డిమాండ్ అని, దాని ద్వారా కొన్ని వర్గాలే లాభిస్తాయి గనుక "ఆత్మహత్య" ప్రయత్నాన్ని విరమించాలని వారు ఆందోళనకి దిగారు.

ఇదంతా తెలుసుకున్న రాష్ట్రముఖ్యమంత్రి, why yes or ఎలక్షన్లు దగ్గిరలో ఉన్నవని తెలిసినవాడు కాబట్టి, అందరితో శనివారం సాయంత్రం మాట్లాడుతాడన్న సమాచారం తెలుసుకున్న విద్యార్ధులు మేడ దిగి క్రిందకి దూసుకు వచ్చి అక్కడే ఉన్న విద్యార్ధి గుంపులలోకి జొరబడి పారిపొయ్యారు.

వారు పారిపొయ్యారు కాబట్టి ఎవరిని అరెస్టు చెయ్యడంకుదరలేదు. సాక్షాత్తు హైదరబాదు నగర పోలీసు కమిషనర్ బయ్యారపు ప్రసాద రావు గారి సమక్షంలోనే ఇదంతా జరిగినది.

ప్రసార మాధ్యామలన్ని కూడా అక్కడే ఉన్నవి. డిజిటల్, ఎలెక్ట్రానిక్ ప్రింట్ అందరూ అక్కడే ఉన్నారు.

ఫొటొలు తీసారు. మచ్చుకి రెండు ఫొటొలు.


ఏవండి వాళ్ళ మొఖాలు గుర్తుపట్టలేరాండీ?
అంతే లెండి బాలయ్య ఇంట్లో హంతకుడుని గుర్తుపట్టలేకపొయ్యారు.
ప్రశాంత రెడ్డి హంతకుడిని గుర్తుపట్టలేకపొయ్యారు.
ఆయేష హంతకుడిని గుర్తుపట్టలేకపొయ్యారు.
మరి వీళ్ళనెలా గుర్తుపడతారంటారా?
అదీ నిజమేలెండి.
కాని అండి, వాళ్ళు ఆ పనులు చేసేటప్పుడు తీసిన ఫొటొలు లేవండి.
వీరివి ఉన్నవిగా?
హ్రస్వ దృష్టి అంటారా?
మరి ఆ విద్యార్ధులలో నలుగురుని గుర్తించారు.
కాని అరెస్టు చెయ్యలేకపొయ్యారు.

ఈ మధ్య ప్రతివాడికి ఇదొక పని ఐపోయింది.

అమ్మాయి ప్రేమించలేదని కరెంటు స్థంభం ఎక్కి దూకుతాననేవాడొకడైతే, పెళ్ళాం మాటవినడం లేదని దూకుతాననేవాడు మరొహడు. కాని అలా అనే వాళ్ళే కాని దూకినవాడేవ్వడు కనపడటంలేదు. ఆఖరుకి, బసంతికోసం ధర్మేంద్ర కూడా దూకిన పాపాన పోలేదు.

మన విద్యార్ధులు ఎదిగారనుకోవాలా?
అలాంటి తుచ్చమైన విషయాలకి కాకుండా జీవన్మరణ సమస్యలకొరకు తమ పవిత్రమైన ప్రాణాన్నిఅర్పిస్తున్నారంటారా? మరి నిలబడి ముందుకి వచ్చి పోలీసులకు లొంగిపోవచ్చుగా?

రేపు ఓటు వెయ్యకపోతే దూకుతానని మన రాజీవశేఖరుడో, నారా బాబు గారో లేక చిరంజీవిగారో అంటే మన పరిస్థితి ఏమిటి?

వాళ్ళ చావు వాళ్ళని చావమందామా!?

0 వ్యాఖ్యలు:

Post a Comment