తెలుగువాడంటే ఇంత చిన్న చూపేందుకని?

తెలుగుతల్లి పార్టి వ్యవస్థాపకులు, "ఉదయం" దినపత్రికని ప్రాంభించినవారూ,క్రీయాశీలక రాజకీయాలలో చురుకుగా పాల్గొని, కేంద్ర మంత్రి (బొగ్గు శాఖ)పదవిని పొందినవారైన శ్రీ దాసరి నారాయణ రావు ఆ పదవినుండి తప్పించబడ్డారు.

వారు తెలుగు ప్రజలకు, "అంధ్ర ప్రదేశ్"కి చేసిన సేవలను తెలియజేస్తే, కాంగ్రెస్ పార్టి అధిష్టానికి తెలియజేసి వారి అభ్యర్దిత్వాన్ని పునః పరిశీలించమని కోరడానికి అవకాశం ఉంటుంది.




చార్మినార్ బాంక్ మూత పడడానికి - అప్పులని తిరిగికట్టకపోవడమనే కారణం చాలా తప్పండి.
చార్మినర్ బాంకు లేదు కాబట్టీ - సిబ్బంది లేరు. సిబ్బంది లేరు కాబట్టి - అప్పులేవు. అప్పులులేవు కాబట్టి - ఆత్మహత్యలు లేవు. ఆత్మహత్యలులేవు కాబట్టి నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర సరిగ్గా పడుతున్నది కాబట్టి ఆరోగ్యం గా ఉన్నారు ప్రజ. వారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి రాష్త్ర ప్రజలందరు సుఖంగా ఉన్నారన్నది కేంద్రానికి తెలుసు.

అలాగే తిక్కవరపు సుబ్బిరామి రెడ్డి గారు కూడా తమ మంత్రి పదవి (Minster of State - Mines) ని కోల్పొయ్యారు.
వారు కూడ తెలుగు ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను మీరు తెలియజేయగలిగితే వారి గురించికూడ హస్తినకు తెలియజేసి గుర్తించవలసినదిగా తెలియజేయవచ్చు.


ఏడు కోట్ల ఆంధ్రులకి కేంద్రంలో 32 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో 8 మందికి నేటిదాక మంత్రి పదవులున్నవి. ఈ రోజుతో అవి 6 కి దిగిపోయినవి.

ఈ రాజీవశేఖరుడి ప్రభుత్వమే కదా ఈ పవిత్ర భారతావనిలో ఆ కాంగ్రెస్ పార్టికి ఎంతోకొంత బలాన్ని,ఆర్ధిక శక్తిని ఇచ్చినది, ఇస్తున్నదీ, ఇవ్వనున్నది.

మరి ఇంత అలక్ష్యమా? అందులోను అటు కే సీ ఆర్ , ఇటు చిరంజీవి ఉండగా?

ఏడు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైపోవాలి?

"చంకనాకి పోవాలి.
మన కెందుకండి ఈ రాజకీయలు.
చక్కగా తెలుగులో బ్లాగుకోక."

ఎవరు?
ఎవరామాటన్నది?

* చివరగా ఒక చిన్న సందేహమండి?
ఈ ఏడుకోట్ల అంధ్రులకి ప్రాతినిధ్యంవహిస్తున్న ఈ 32 మందిలో కనీసం ఇద్దరికైనా మంత్రులకు కావలసిన లక్షణాలు లేవాండి?
అంత నిర్వీర్యమైన జాతా అండీ ఈ తెలుగు వారిది?

1 వ్యాఖ్య:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on April 11, 2008 at 10:45 AM   said...

వ్యాసం బావుంది. ఏమీ అనుకోకపోతే శీర్షిక కొంచెం మార్చగలరు.

Post a Comment