పుస్తకాలు చదవకండి

ఈ మధ్య చాలమంది పుస్తక ప్రియులు బయట పడుతున్నారు.
చాలా సంతోషించదగ్గ పరిణామం ఇది.
వారు చదివి వూరుకుంటే బాగానే ఉంటుంది. కాని వూరుకోరుగా. వీళ్ళకి ఓ జబ్బు పట్టుకుంటుంది. ఆ చదవడం వచ్చింది కాబట్టి నెనొక గొప్ప విమర్శకుడిని / విమర్శకురాలిని అన్న దురభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఇదిఒక జబ్బు. ఈ జబ్బుకి అంటుకున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటవి.

నేను ఇది చదివాను.
నువ్వు చదవలేదా?
ఏం?
ఎందుకని?
ఐనా నువ్వు చదవకపొతే వచ్చే ఇబ్బంది ఏమిలేదులే! నీ ముఖానికి పుస్తకాలు కూడానా అని అనకుండా, వారి మాటల్ల్ల్లోనో, ముఖ కవళికల్లోనో ఇది చూపిస్తారు. ఈ బ్లాగుల పుణ్యమా అంటూ అది ఇంకా ముదిరింది ఈ మధ్యన. అదేదో "బర్డ్ ఫ్లూ"లాగా ఈ రోగం అందరికి అంటుకుంటున్నది. నా బ్లాగు, నా బ్లాగుకి నేనే సుమన్ ( ఇది ఎంకెవరి బ్లాగలోనో కనపడింది లేండి) అన్న లెఖలో అడ్డమైన చెత్త విమర్శ కింద రాసేస్తున్నారు. భాషకి బాసకి, కవిత్వానికి కపిత్వానికి, తేడా తెలియని విమర్శలు గుప్పిస్తున్నారు. బాధల్లా వీటిమధ్య పడి మంచి పుస్తకాలు, మంచి విమర్శలు, మంచి టపాలు చదవలేకపోతున్నామే అని !

సరేలేండి. దీనిమీద ఇంకొకసారి బ్లాగుకోవచ్చు.

ఈ లోపల "సాక్షి" - "రీడింగ్ రూం" లో కల్పన గారి " హవ్ టు టాక్ అబవుట్ బుక్స్ యు హవెంట్ రెడ్" (How to talk about books you haven't read)మీద పరిచయం చదవండి.

8 వ్యాఖ్యలు:

sujatha on April 15, 2008 at 4:52 AM   said...

నెటిజెన్ గారు,

మీరేవూరి సిటిజెనో నాకు తెలియదు. మీ టపాకి ఏవైనా వ్యాఖ్యలు వస్తాయేమో అని చూశాను. ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. మీరెవర్ని ఉద్దేశించి రాశారో నాకు తెలీదు. కాని, నేను నా బ్లాగుని మొదలెట్టిందే నా పుస్తకాలని అందరితో (కనీసం పుస్తకాల విలువ తెలిసిన వాళ్ళతో) పంచుకోవాలనీ, ఇతర్లు పరిచయం చేసే నాకు తెలియని పుస్తకాలని గురించి తెలుసుకోవడానికీను!సో, నేను స్పందించక తప్పట్లేదు.

చదివే వాళ్ళని 'పుస్తకాలు చదవకండి ' అని చెప్పే హక్కు మీకే కాక ఇంకెవరికీ లేదని గ్రహించండి. మీకిష్టం లేకపోతే, సమీక్షలు , పరిచయాలు చదవకండి. ఒకవేళ చదివి, నచ్చకపోతే, నచ్చలేదని రాయండి. ఇంకో విషయం, పుస్తక పరిచయానికీ, విమర్శకూ తేడా తెల్సుకోండి. నాకు తెలిసి ఈ మధ్య పుస్తకాల పరిచయాలే తప్ప, విమర్శలు రాలేదు.

మీరు చెప్పింది కరెక్టే, ఎవడి బ్లాగుకి వాడే సుమనూ, ప్రభాకరూనూ!ఎవరికిష్టమైన విషయం వాడు రాసుకునే పబ్లిక్ డైరీయే బ్లాగు! మీకిష్టమైన సోది ఇంకొకళ్లకి ఇష్టం కాకపోవచ్చు. మీరు దినపత్రికలు చదవకండి అంటే మీరు మానేస్తారా!

ఇంకో గ్రామరు మిస్టేకు! భాష కి బాస కి తేడా తెలీకుండా రాసేస్తున్నారని వేదన పడ్డారు. భాష ప్రక్రుతి...బాస విక్రుతి. రెండూ ఒకటే! (బాసకి వేరే అర్థం ఉంటే ఉండొచ్చు గాక) .

మీరు చెప్పడం వల్ల పుస్తకాలు చదవడం ఎవరూ మానేయరు. రాయడం అంతకంటే మానెయ్యరు. కాకపోతే మీరు దీన్ని 'జబ్బు ' బర్డ్ ఫ్లూ అని పోల్చడమే చవకబారుగా ఉంది.

netizen on April 15, 2008 at 4:30 PM   said...

@sujatha: టపాకి టపాలు (వ్యాఖ్యలు)
1 - http://oremuna.com/blog/?p=1393
2 - http://kasturimuralikrishna.wordpress.com/2008/04/15/
3 - మీ వాఖ్య ఉండనే ఉంది:
పరిచయము: ఎరుక, పరిచితి, మాలిమి, వాసన, విభావము
విమర్శ: అవమర్శము, అవలోకనము, అవలోడనము,చర్చ,పరామరిక,పరామరిస,పరామర్శ విచారాణ, విమర్శనము,సంఖ్య, సమీక్ష

ఇక భాష / బాస గురించి కొంత:

శపనము ఆశ్రవము ఆడిక ఆల(లా)పనము అభాషణము అభిసంధి అభియోగము అలాపము అంగీకారము అప్దేశము అర్ధము బాఢము బైజికము బైసుక బంధకము భంగి భాషణము భాషిక భాషితము బిరుదుదబ్బు దివ్యముఫణితి గిర హేతుకము హేతువు ఇడ ఇర(ళ) జల్పము జిహ్వ కోపు కారణము కరణము కతము కతన క్రియాకారము లపనము లపితము మడి మాటమాటమినుకు మిష ంఖము మూలము నె(స)ము నీయమమునిమిత్తము నొడి నొడుగు నుడుగు ఒడబడికఒడబాటు ఒడంబడిక
ఒట్టు ఒప్పందముపంతముపణబంధముపట్టు పానలు పద్దుపలుకు పని పరిభాషణము పరిగ్రహముపేరు పిడివాటుపొందుపూనికపూర్వభావి ప్రమాణముప్రతిశృతముప్రతిశృతిప్రతిశుత్తు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాతముప్రతినరాజిసాకు సమయముసమయముసంధసంధిసందు సంక(గ)రముసంప్రతిపత్తి సంస్థ సంవరణము సంవిద సంవిత్తు సత్యంకారము సత్యాపనము స్కంధము
సుద్ది తోడుతలము తర్కము త్విట్టు ఉక్తి ఉపసంవాదమువంక వాణివాణి వాచ వాదు వాకము వాక్కువాక్కు(కు) వచనము వచస్సు వైనము వలను వెంట వ్రతము వ్యాహృతి
వ్యాహారము

netizen on April 15, 2008 at 8:19 PM   said...

అందరికి:
నెటిజన్ కి తన తోటి బ్లాగర్‌లను కించ పరచాలని ఏ కోశానా లేదు. సాధ్యమైనంత వరకు "తెలుగు" వ్యాప్తికి శ్రమించడంకొరకే ఈ బ్లాగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి దాక జరుగుతున్నది కూడా అదే. నెటిజన్‌ని గమనిస్తున్నవారికి అర్ధం అయ్యే ఉంటుంది.

ఇక తెలుగు సాహిత్యం, వాటిని పంచే తెలుగు పుస్తకాల విషయంలో నెటిజన్ చేసిన, చేస్తున్న కృషి అది అనుభవించిన వారికి తెలుసు.

నెటిజన్ పుస్తక విమర్శలు / సమీక్షలు / పరిచయాలు గురించి మాట్లాడడం జరిగింది కాని, రచనలు, వాటి ప్రచురణకు రచయితలు పడే వెతల గురించి కాదు. ఆ విషయాలను కూడా నెటిజన్ ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచంలోని వివిధ బ్లాగులలో తన వాఖ్యల ద్వార వెలువరించడం జరిగింది. వాటిని చదివిన వారికి అది అర్ధం అవుతుంది.

పుస్తకాలు చదవకూడదన్నది నెటిజన్ అభిప్రాయం కాదు. నెటిజన్ వెలువరించిన టపాలను చదివిన వారికి నెటిజన్‌కి పుస్తకాల మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది.

ఎవరి బ్లాగుకి వారే సుమన్ అన్న బ్లాగొక్తిని నెటిజన్‌తో బాటు అందరు అంగీకరించినదే.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on April 15, 2008 at 11:30 PM   said...

నిర్మొహమాటంగా, నిష్కపటంగా ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను అని మీరు అనుకోగానే సరిపోదు!
చదువుకునేవారికి ఇబ్బంది కలుగకూడదు!

కొన్ని సందర్భాలలో మీ "మాటలు" ఇతరులని నొప్పిస్తాయి. అది తెలిసే మీరు వ్రాస్తున్నారా?...మీకు తెలుగు భాష మీద ,సమాజపు పోకడలమీద ఉన్న అభిప్రాయం,వాటిని కాస్తన్నా మెరుగుపరచాలన్న మీ అభిలాషా అందరికీ తెలిసినవే.కానీ పుస్తకాలను పరిచయం చేస్తూ మీరన్నమాటలు నాతోపాటు చాలామందిని బాధపెట్టాయి.సుజాత,మురళీకృష్ణ,ఒరెమునా కిరణ్ పైకి చెప్పగలిగారు.మిగిలినవారు లోలోన కుములుతున్నారు.

మీరు చెప్పిన కల్పన గారి సమీక్ష సాక్షి పత్రికలో రావటానికి చాలా కాలం ముందే కూడలి కబుర్లలో ఈ పుస్తకం గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది.
http://www.nytimes.com/2007/11/11/books/review/McInerney-t.html

పైగా మీరు వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది...

వీళ్ళకి ఓ జబ్బు పట్టుకుంటుంది. ఆ చదవడం వచ్చింది కాబట్టి నెనొక గొప్ప విమర్శకుడిని / విమర్శకురాలిని అన్న దురభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఇదిఒక జబ్బు....

.....అన్న లెఖలో అడ్డమైన చెత్త విమర్శ కింద రాసేస్తున్నారు. భాషకి బాసకి, కవిత్వానికి కపిత్వానికి, తేడా తెలియని విమర్శలు గుప్పిస్తున్నారు. బాధల్లా వీటిమధ్య పడి మంచి పుస్తకాలు, మంచి విమర్శలు, మంచి టపాలు చదవలేకపోతున్నామే అని !.....

మొదట ఇది రాసింది మీరేనా అన్న అనుమానానికి గురయ్యాను నేనైతే.

మీ ఈ టపాకి,మొదట మీరు రాసిన ఇన్నయ్య గారి టపాలోని కామెంట్లనూ ఒక్కసారి చదివి మీరే నిర్ణయించుకోండి.

netizen on April 16, 2008 at 8:52 AM   said...

? కి:నెటిజన్ చూడరు. అలాంటి వాఖ్యలు రాసి మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు.

krishna rao jallipalli on April 16, 2008 at 10:36 AM   said...

నిజమే ... ఎవరికీ వారే పెద్ద మేధావి , పుడింగి అని అనుకుంటుంటారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.

netizen on April 17, 2008 at 10:42 PM   said...

పుస్తకాలు - విమర్శ - పరిచయం అంశాలమీద ఇలాంటి టపా రాసిన గుర్తు కూడా లేదు.
ఒకసారి చూడండి!
http://netijen.blogspot.com/2007/06/blog-post_11.html

netizen on April 18, 2008 at 4:33 AM   said...

దీనిమీద వాఖ్యానించవచ్చు:
నెటిజన్ ఇదివరకే అంటే, 2007 జూన్‌లో ప్రచురించిన టపాలో, సి.బి.రావుగారు పొద్దులో వ్రాసిన " పుస్తక సమీక్ష " ( http://poddu.net/?p=219 ) వ్యాసానికి కూడ ఒక లంకేని ఇవ్వడం జరిగింది.

రావుగారి వ్యాసంలోని ఒక ముత్యం: "వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది."

సి.బి రావు గారి చిరునామా:
(http://paradarsi.wordpress.com)

Post a Comment