"సాక్షి" సాక్ష్యంపై మీ తీర్పు ఏమిటి?

పోలేపల్లిలో కొన్ని పొలాలను ప్రస్థుత ప్రభుత్వం స్వాధినం చేసుకుని, ప్రత్యేక ఆర్ధిక మండలి (S E Z - Special Economic Zone)ని ఏర్పాటు చేసి ఆ స్థలాలని కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చిందన్నది వార్త. ఆ భూసేకరణ మూలంగా కొంత మంది రైతులు ప్రాణాలు కోల్పొయ్యారన్నది ఈనాడు కధనం.

చనిపోయినవారిలో "వెంకన్న" ఒకడు. అతన్ని గురించి ఈనాడు ఒక ప్రత్యేక కధనం వెలువరించింది.

ఈనాడు ఉదహరించిన "వెంకన్న" చనిపోలేదు. అతను బ్రదికే ఉన్నాడని "సాక్షి" దిన పత్రిక దానిని ఖండిస్తు ఒక వార్తని ప్రచురించించింది.

"సాక్షి" వ్రాతలను ఎద్దేవా చేస్తు "ఈనాడు" వ్యాసం ఇక్కడ.

ఈ వ్యవహారం బ్లాగ్లోకంలోకి విశాఖతీరాన ప్రవేశించింది.
క్లుప్తంగా ఈ టపా నేపధ్యమిది.

చెరుకూరి రామోజి రావు కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ కి ఉన్న మనస్పర్ధలు చదువరులకి తెలుసు.

రామోజీ రావు వ్యాపార సంస్థలమీద ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న అధికారిక అనధికారిక నిజనిర్ధారణ దాడుల గురించి కూడ చదువరులకు తెలుసు.

నిష్పక్షపాత దినపత్రిక "సాక్షి" ని మొదలుబెట్టడానికి కారణం, "అసలు" విషయాలను "రంగు" పులమకుండా తెలుగు ప్రజలకు చేరవేయాలన్న సదుద్దేశమని రాజసేఖరుడి తనయుడు, జగతి పబ్లికేషన్స్ అధినేత, సాక్షి ప్రచురణకర్త, జగన్మోహన్ రెడ్డి తెలిపినది కూడా మీకు తెలుసు.

ప్రభుత్వం వల్ల జరిగిన అవకతవకలను "ఎండగడుతు" ప్రసార మాధ్యమాలు ప్రత్యేక కధనాలను ప్రచురించినప్పుడు, దానికి జవాబుని తత్సంభదిత ప్రభుత్వ అధికారులు ఇవ్వడం ఇప్పటిదాక ఉన్న సత్సంప్రదాయం.

"ఒక పత్రిక"లో వచ్చిన వార్తని "ఖండిస్తు" మరో నిష్పక్షపాత పత్రిక కధనాన్ని వెలువరింఛడం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నది.

వ్యాపార సంస్థలకు లభార్జన కూడ ముఖ్యమే.యాజమాన్యలకు లాభాలు ఒక్కటే కాదు కొన్ని నైతిక విలువలుకూడా ఉండాలి. నేటితో అది తెలుగు వార్తా పత్రికలలో కొరవడింది. యాజమాన్యాల ఒత్తిడికి లొనయ్యే "మరుగుజ్జు" సంపాదకులున్నంత కాలం ఇక ఇటువంటి "కష్మలం" తో కూడిన వార్తలను చూడక తప్పదేమో.

ఆంగ్ల ప్రసార మాధ్యమాల అధినేతలు రాబర్ట్ మాక్స్వెల్ (Robert Maxwell), రూపర్ట్ మర్డాక్ (Rupert Murdoch) నిజ జీవితాలను ప్రతిబింబిస్తూ , జెఫ్రి ఆర్చర్ (Jeffrey Archer) వ్రాసిన "ఫోర్త్ ఎస్టేట్" (Fourth Estate) నవలను తలపింపజేస్తున్నవి మన ఈ తెలుగు దిన పత్రికలు.

4 వ్యాఖ్యలు:

సూర్యుడు on April 26, 2008 at 5:40 AM   said...

Till now we have never worried about the authenticity of the news published by Eenadu. What you did not mention in your post that we all know is that how Eenadu has reached this stage in that paper business and what is the relation between TDP and that paper and how it distorts the news to suit the TDP party.

What is wrong if someone is showing what is the real story.

BTW, in some other states every political or rather the main political parties have their own TV channels where they show their version of the story. Nothing wrong if it happens in the paper industry also.

No one is talking about the family relations between Eenadu paper group and TDP leadership.

I will sight one example here abut how the news gets written in that paper:

If Rahul Gandhi gets into politics, it is a family rule, if NTR Jr. Balakrishna e.t.c gets into politics, it is to support the party, do you see the difference.

Anonymous on April 27, 2008 at 7:05 AM   said...

@సూర్యుడు: మన తెలుగు పత్రికా రంగంలో కూడ కొన్ని ఆంగ్ల పత్రిలలో లాగా పాఠక సంపాదకులు (Readers Editor / Ombudsman, ఉదా: "ది హిందు") లు ప్రవేశానికి నేపద్యం సిద్ధం అవుతున్నది.

కొన్ని సంవత్స రాల క్రితం కోస్తా జిల్లాలో వర్గ వైషమ్యాలు చెలరేగినప్పుడే ఈ ఆలోచనని కొందరు మెధావులు అప్పట్లో పరిగణించినా కొందరి స్వార్ధపూరిత స్వప్రయోజ్నాలకు ఆ ప్రతిపాదన బలి ఐపొయ్యింది.

అవకాశాన్ని అందిబుచ్చుకుని , పాఠకుల మన్నన ఎవరు ముందు పొందనున్నారో వేచి చూడాలి.

Krishna on April 28, 2008 at 7:26 AM   said...

Eenadu has exposed many scams/scandals during TDP regime too. Only difference then(TDP) & now(congress) is that TDP has done limited scams & Congress is doing scams wherever possible. When scams are happening all around news paers are bound to catch them. Saakshi has to establish its credibility to prove its point. at this point people wont trust Saakshi.

Bolloju Baba on April 30, 2008 at 11:20 AM   said...

నెటిజెను గారికి ,
మీ విశ్లేషణ బాగుంది.

ఇదంతా ఆటలో భాగమే!

బొల్లోజు బాబా

Post a Comment