సహజీవనం నైతికమే ! అనైతికం కాదు.

సహజీవనమే సరైనది. వివాహం కాదు.

సంప్రదాయాలప్రకారం పెద్దలు కుదిర్చిన వివాహాలలో స్త్రీ పురుష సంబంధాలు స్నేహపూరితమైన వాతావరణంలో తమ సహజీవనాన్ని సాగించలేవు. అందుకనే వారిలో విడాకులు, వివాహేతర సంబంధాలు ఎక్కువ. వీరు " లోకులు ఏమనుకుంటున్నారు అనే దానికి విలువనివ్వరు”.

భార్య భర్తల మధ్య ఏవో కొన్ని సమస్యలు రాక మానవు. వివాహ బంధం దానికి పరిష్కార మార్గం చూపించలేదు. సహజీవనం లో, స్త్రీ పురుషులిద్దరు చక్కటి స్నేహితుల వలే ఉంటారు. కాబట్టి వారు తమ మధ్య పొరపొచ్హాలకు అనవసరమైన అనుమానాలకు అవకాశం ఇవ్వరు.

కాబట్టి, ఏ విధం గా ఆలోచించినా సాంప్రదాయ వివాహం వెలుపలున్న "సహజీవనం" అన్న వ్యవస్థే - స్త్రీ పురుషుల జీవనానికి, సాంఘిక పురోగతికి, రేపటి తరానికి మార్గ దర్శకం అవుతుంది అనడంలో సందేహం లేదు.

సహజీవనం గురించి ఈ రోజు దినపత్రికలో ఓల్గా గారి మాటలు ఈ క్ర్రింద చదవండి.



చాలా ధైర్యం కావాలి


సహజీవనం గురించి సరైన అవగాహన ఉండి, అలా కలిసి బతకాలనుకున్నవారికి చాలా ధైర్యం కావాలి. ఎవరి స్వశక్తి మీద వారికి నమ్మకం ఉండాలి. స్త్రీ పురుష సంబంధాలు స్నేహపూరితంగా ఉండాలనుకున్నవారే ఆస్తి, అధికారం, వంశం, వారసత్వం, కర్మకాండలతో ముడిపడిన వివాహాల కంటే సహజీవనం మేలనుకుంటారు. అపోహలను పట్టించుకోరు. లోకులు ఏమనుకుంటున్నారు అనే దానికి విలువ ఇవ్వరు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఇక్కడ ప్రధానం.




ఇద్దరు మనుషులు కలిసి ఇన్ని వైరుధ్యాలున్న సమాజంలో బతికేటప్పుడు ఎవో సమస్యలు రాక మానవు. సహజీవనం వాటిని సామరస్యంతో సున్నితంగా పరిష్కరించుకునే అవకాశాన్నిస్తుంది. ఇతరుల జోక్యం తక్కువగా ఉండటం వల్ల సమస్యలను త్వరగా పరిష్క రించుకోగలరు. తన జీవితం తన చేతుల్లో ఉంచుకుని ఆ తర్వాత తన సహచరి / సహచరుడి పట్ల, పిల్లల పట్ల, చుట్టుపక్కల వారితో సమాజంలో బాధ్యతతో ఊండగలిగిన వారే ఈ జీవితాన్ని ఎంచుకోవడం మంచిది.

- ఓల్గా, రచయిత్రి


26 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on May 10, 2008 at 6:20 AM   said...

నెటిజన్ గారు,ఓల్గా అభిప్రాయాలు అలా ఉంచితే ఈ అంశం గురించి మీ దృక్కోణం ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.మొదట ఆశయాల వేడిలోనో,ఆదర్శాల జోరులోనో కులం,మతం.ప్రాంతం వగైరాల పట్టింపులు లేనప్పటికీ కొన్నాళ్ళకు మొదటి భర్తను/సహచరులను కొంతబాధతో నైనా వదిలి తమ స్వంతకులంసహచరులతో శాంతియుతసహజీవనం చేస్తూ కొందరు సంతోషంగానే జీవిస్తున్నారు.ఇక్కడ ఉన్న రహస్యం,మీ అధ్యయనంలో ఏమన్నా తేలితే మాతో పంచుకోగలరు.

Indian Minerva on May 10, 2008 at 7:17 AM   said...

ఇది సమంజసమేనని నాక్కూడా అనిపిస్తుంటుంది. నా వరకు భారతీయ వివాహ వ్యవస్థ పురుష స్వామిక వ్యస్థకు ప్రతిరూపం. అది master slave relation ని ప్రబొధిస్తుందే తప్ప చెప్పుకున్నట్లు విలువలను కాదు (ఇక్కడ యెవరు యజమాని యెవరు బానిస చెప్పక్కర్లేదనుకుంటాను). Master slave relation యెంత దృఢమైనదైనా దాన్ని గొప్పగా అభివర్ణించలేముగా. ప్రేమ పెళ్ళిళ్ళూ దీనికి విరుగుడౌతాయని గుడ్డిగా నమ్మేవాడిని కానీ మన ఖర్మో యెమిటో తెలియదు కానీ నేను చూసిన చాలా ప్రేమపెళ్ళిళ్ళూ కూడా ఈ తరహా వ్యవస్థా వలయంలో నే అంతమౌతున్నాయి. పెళ్ళీ ఐన మరినాటినుండి మొదలౌతుంది సంబొధన ప్రధమా విభక్తులు, లక్ష్మణ రేఖలు, భావ నియంత్రణ. దీనికంటే స్వేచ్చా జీవితమే మెరుగు కదా?

ఆ సమాజమొకటి వుంది కదూ... ఐనా మనం మనకోసంజీవిస్తేపోలా because there are no societies only people are for real. Yes ఆ సంబంధం platonic relation కాకపోయినా నేను సమర్ధిస్తాను.

KK on May 10, 2008 at 11:06 AM   said...

సహజీవనానికే నా ఓటు. అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నారో దాదాపు తొంభై శాతం మందికి తెలీదు. ఎవరో అన్నట్లు "పెళ్ళనేది పద్మవ్యూహం లాంటిది. బయటి వాళ్ళకి లోపలికెళ్ళాలని కోరిక, లోపలి వాళ్ళకి బయటికి వెళ్ళాలని కోరిక." ఆధిక్యత ఎవరిదైనా నష్టపోతున్నది కుటుంబ వ్యవస్థ.

Anonymous on May 10, 2008 at 7:17 PM   said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి:
మార్పు సహజం అన్నది అందరు అంగీకరిస్తారు. అది చాందసవాదుల "యుగ ధర్మం" కావచ్చు, "కాల ధర్మం" కావచ్చు. స్త్రీ పురుష సంబంధాలు కూడా ఈ మార్పుకి ప్రభావితమయ్యేవే. ఆదిమానవుడి నుండి నేటి ఆధునిక మానవుడి వరకు, "జత కట్టడం" కూడా ఆ ఆలోచనా సరళికి లోనయ్యిందే. అది "రాక్ఛస వివాహం" కావచ్చు మరొహటి కావచ్చు.

"మన నాగరిక ప్రపంచం"లో దైనందిన జీవనంలో విరామమెరుగని పోరాటంలొ అలసిన రెండు మనసులు ఒక "జీవితకాల బంధం" వివాహం, అది మనకు ఒద్దు అని సహజీవనం కోరుకుంటూఉంటే, తాము నమ్మిన ఆశయాలకోసం, ఆదర్శం కోసం సహజీవనాన్ని స్వాగతించే వారు మరికొందరు. మొదటి జంటలోని స్త్రీ అప్పటికే మొగావాడితో తనకేర్పడిన చేదు అనుభవాలా మూలంగ "వివాహం' ఒద్దు అనుకుంటుంది. ఆ పురుషుడు "స్త్రీ"లతో తన కున్న అనుభవాలమూలంగా సహజీవనాన్ని కోరుకోవచ్చు.

తమచుట్టు ఉన్న సమాజంలోని "కుటుంబ వ్యవస్థ" లోని "కుళ్ళు" ని, వెరచి సహజీవనాన్ని కోరుకునే వారు మరి కొందరు.

విశృంఖల జీవనానికి ఆంక్షలు విధించే సమాజానికి జవాబుచెప్పలేక సహజీవనాన్ని కౌగలించుకునేవారు మరికొందరు.

వ్యక్తిగత సామాజిక, సాంఘిక, ఆర్ధిక నేపధ్యల కారణాలు మరికొంతమందివి.

"సీత, మా అక్క కాదు, మా అమ్మ," అన్న కృష్ణ "సహజీవనం" లో ఉదయించిన మిత్రుడు.
సహజీవనంలో సహచరిని భరించలేక మరోక "సహచరి"తో పయనించిన ఆమెద్వారా "కృష్ణ" కి ఒక సోదరి కూడా ఉంది. కాని వీరెవ్వరు ప్రముఖులు కారు.

హేమమాలిని, జయప్రద, శ్రీదేవి, పవన్ సహజీవనం సాగిస్తున్న ప్రముఖులే.
ఇంక్కొక విషయం: వివాహ వ్యవస్థని ఈ బ్లాగరి తిరస్కరించడంలేదు.

ఇక మీరన్న "స్వంతకులంసహచరులతో శాంతియుతసహజీవనం" అన్నదానికి - కొంత కాలం క్రితం తమళనాడులోని కోయంబత్తూరు, మధురైలోని అగ్రకులాలతో వివాహ సంబంధాలకోసం కోస్తా జిల్లాలలోని కొన్ని కుటుంబాలు వెంపర్లాడాయి. చేసుకున్నవి కూడా. విభిన్నమైన ఆచార, వ్యవహారల వల్ల ఆ కుటుంబాలలో కొన్నింట్లలో ప్రశాంతత లోపించింది. కాని నేడు ఆ పరిస్థితి లేదు.

కాబట్టి స్వకులస్థులతోనే సహజీవనం సాగిస్తే ఆచార వ్యవహారాలలో పెద్ద తేడాలుండవు కాబట్టి పయనం పెద్ద ఒడిదుకులకు లోను కాదని వారి అభిప్రాయం కావచ్చు.

రాధిక on May 10, 2008 at 9:02 PM   said...

సరే సహజీవనమే సరయినదనుకుందాము.మరి బధ్రత మాటేమిటి?పిల్లలు,బాధ్యతలు లేనంత వరకు సహజీవనం అంత సుఖం ఉండదు.బాధ్యతలు వచ్చినప్పుడేగా బేధాభిప్రాయాలు వచ్చేది.

Kathi Mahesh Kumar on May 10, 2008 at 9:29 PM   said...

ఇక్కడ సమస్య పెళ్ళా? సహజీవనమా? కాదుకదా!?!
సమస్య కేవలం సహజీవనం లో ని నైతికత గురించి అనుకుంటా.

ఓల్గా గారు చెప్పింది పక్కన పెడితే, ప్రేమించడం ఎంత నైతికమో,సహజీవనం అంతే నైతికమని నా ఉద్దేశ్యం.ఎందుకంటే,ఈ రెండూ వ్యక్తిగత విషయాలు కాబట్టి. ప్రేమ మీరి, పెళ్ళి పేరుతో సమాజాన్ని పర్మిషనడిగితేనో,లేక సహజీవనంలో పిల్లలు పుడితేనో వస్తుంది అసలు సమస్య.

సో!సమాజాన్ని దూరంగా పెట్టి, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండగలిగే ధైర్యముంటే సహజీవనానికి ప్రొసీడ్ అవ్వొచ్చు.లేదంటే బుద్దిగా పెళ్ళి చేసుకుని సమాజాన్ని ఉద్దరించవచ్చు.

రాజేద్రగారు చెప్పినట్టు ఆదర్శాలు లేక ఆశయాల జోరులో ఈ నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానం అలాగే ఉంటుందేమో! వేడి దిగింతర్వాత మనం ఎంత నీట్లో ఉన్నామో తెలుస్తుంది.

phani.rebba on May 10, 2008 at 11:05 PM   said...

నా ఓటు వివాహ వ్యవస్థకే, సహజీవనంలో బేధాభిప్రాయాలు ఒస్తే సులభంగానే మల్లి ఇంకొక సహచరి/ సహచరుడిని చూసుకోవచు కాని అప్పుదు మనుషులుకు పషువులకు పెద్ద తెడా ఉండదని నా అభిప్రాయం. కొంత టిమె ఫెరిఒడ్ తరువాత సహచరి/సహచరుడిని మార్చెస్తా అంటె అది ఎంత అసహ్యంగా ఉంతుందో అలోచించంది.
ఆలాగని వివాహ వ్యవస్థలో తప్పులు లేవని నేను అనను. కాక పొతే వివాహం లొ బాధ్యతలనుండి తప్పుకోవడం అంత సుళువు కాదు.
మనిషి తనకోసం మాత్రమే బతుకుతా అంటే అడవిలొ భతకదం మేలు. సమాజం లో బతకడం అనవసరం.
ఏ సంబంధమైనా నిలబడడానికి పరస్పర అవగాహన, నమ్మకం ముఖ్యం.
ఇవి పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు.
ఏది ఏమైనా నా ఓటు వివాహానికే .

Siva on May 11, 2008 at 10:01 PM   said...

వివాహ వ్యవస్థకి అర్థం తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది పితృస్వామ్య వ్యవస్థగా చెలామణీ అవుతుంది అనేవి నిజాలు. అలాంటప్పుడు దాన్ని చక్కదిట్టటం సరి అయిన పని అవుతుందా లేక అలిగి ఇలా 'సహ జీవనం" పేరుతో బాద్యతలు లేని ప్రపంచంవైపు మళ్ళటం సరి అయినదా?

మనకోసం మనం జీవించటం అనేది అన్ని విషయాలలో వర్తించదు. బావితరాల పట్ల మన భద్యతలనేవి ఉంటాయి అన్న విషయాన్ని మనం నిర్ల్యక్ష్యం చెయ్యలేం!

Chaks on May 12, 2008 at 12:27 AM   said...

దూరపుకొండలు నున్నగా కనపడ్డంలో తప్పు లేదు.
మీరుచెప్పినట్ట్ట్లు సహజీవనం(ఆడా-మగా, ఆడా-ఆడా, మగా-మగా) ఇప్పటికే మనదేశంలో మొదలయింది. మీరు ఉదహరించిన హేమమాలిని, జయప్రద, శ్రీదేవి, పవన్ లాంటి వాళ్ళు యమా సంతోషంగా వున్నారని మీ అభిప్రాయమా? వాళ్ళబాధలు వాళ్ళు చెబితేనే గానీ మనకు తెలియదు కదా?
రాధిక గారు చెప్పినట్లు పిల్లాపీచు లేనంతవరకూ ఫరవాలేదు లేకపోతే ఈ విధానం వలన అనాధలు పెరుగుతారు.
ఓల్గ వ్యాసం చివరి పేరా ఒకసారిచదవండి. "ఇద్దరు మనుషులు......బాధ్యతతో ఊండగలిగిన వారే ఈ జీవితాన్ని ఎంచుకోవడం మంచిది" ఒక ప్రక్క వివాహ వ్యవస్థలో లోటుపాట్లు చెప్బుతూ దీనిని ప్రత్యామ్నాయంగా చూపిస్తూ మళ్ళి ఆ చివపేరా లోని లిమిటేషన్ మాత్రం ఎందుకు? ఆ మాత్రం బాధ్యత ఉండేవారికి వివాహవ్యవస్థ ఎందుకు సరిపోదు?

Unknown on May 16, 2008 at 1:22 PM   said...

It is ethically right without sex.With sex I don't see any diffrence between humans and amimals.

venkat on June 25, 2008 at 3:20 AM   said...

It is very easy to run from the responsibilities but this world runs only because people take the responsibility.
I think u can never say ur boss that i work for the company and take the salaries but i dont want to take any responsibility if something goes wrong.

I have seen a comment that without sex, living together is ok.
But lets grow up no MAN approaches a women without having the word SEX in his mind or vice versa.
if we analyse the marrige setup in india it was not only targeted to sex or just living together happily everafter we inherit these concept from the west.
But in india a householder with his wife come together to create a system where old people get refuge students requirement are met and the marrige targets this.
if anyone forgets this and approaches marriage it is as good as living together.
But we need to rethink about the male domination in the indian marriage system etc.
But here we need to understand that if the MAN is dominating he will be dominating towards a lover or wife. The marriage system didnt bring this.
Its the persons behaviour brought this concept.
And this bahaviour is changing.

I really feel that we are living in a modern society where freedom is like oxygen without which we cannot live.So the same freedom has to be enjoyed while choosing the partner.
So living together in search of a partner who shares everything with you even the bed is really good thing.Because we can understand the person and his behaviour. But wen u found our loving one we need to start building the setup which notonly Binds the MAN and WOMEN with love but also responsibility.
I feel that just living together is as good as opening an option to leave ur partner at any time.
Do u really want to cheat ur friend whom u really owe a lot. Living together with you loved ones without marriage is as good as that

HAVE FAITH AND RESPONSIBILITY

రవి వైజాసత్య on July 2, 2008 at 9:02 PM   said...

నాకు వ్యతిరేకత ఏమీలేదు కానీ సహజీవనం చాలామటుకు బర్రెను కొనకుండా పాలుతాగుదామనే వాళ్ళకు మాత్రమే ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ "కొత్త వ్యవస్థ" (అదీ ఒక వ్యవస్థనే అని గుర్తుచేయటానికి) అలాంటి వారినే ఆకర్షిస్తుంది. అంతగా కట్టుబడినప్పుడు మూడుముళ్ళు వేయటానికి సంకోచమెందుకు. పారిపోవటానికి దారులన్నీ తెరిచి ఉంచుకున్నప్పుడు సహాజీవనం కూడా అవసరమా? (అనవసరంగా జెలసీలు, ప్రేమలో పడటాలు, ట్రయాంగిల్లు, తలనొప్పులు ఎందుకు రామా)..అన్నట్టు ఇదే విషయంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన జర్మన్ సినిమా చూశా..జర్మనీలో పుట్టిపెరిగిన టర్కీ జాతీయులైన అమ్మాయి, అబ్బాయిలు సహజీవనం చేసే కథ (పేరు గుర్తుకు రావట్లేదు..వీలుంటే తప్పకుండా చూడండి)

netizen నెటిజన్ on July 3, 2008 at 12:04 AM   said...

@రవి వైజాసత్య: ఇది మీ అభిప్రాయం.
అది వారి అభిప్రాయం

Kottapali on July 3, 2008 at 3:27 AM   said...

నెటిజెన్ .. ఇది కేవలం అభిప్రాయాల గ్డవే అయితే .. ఎవడి గంగలో వాడు మునుగుతాడూ అని ఊరుకోవచ్చు. రెండు విషయాల్లో ఇది వ్యక్తిగతం కాకుండా పోతుంది. మొదటిది, దృఢమైన కుటుంబ వ్యవస్థ లేనప్పుడు పుట్టే పిల్లల బాధ్యత సమాజం మీద పడుతుంది. (పిల్లలు పుడుతూ ఉండాలి, లేకుంటే సమాజం మొత్తం వృద్ధాప్యంతో కుంగి పోతుంది). రెండు దృఢమైన కుటుంబ వ్యవస్థ సమాజం మనుగడకి మూలం. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసమూ, స్త్రీ పురుష సంబంధాల గురించ్న కనీస అవగాహనా లేకుండా సంబంధాలు పెట్టుకుంటే (ఉన్న వ్యవస్థల్ని కూలదోసుకుంటే) పరిస్థితి ఏమీ మారదు. పెళ్ళిలో స్త్రీ మీద ఎలాంటి అణచివేత జరుగుతోందని ఓల్గా అంటున్నారో ఇంకా అంతకంటే అధ్వాన్నమైన పరిస్థితి ఈ సహజీవనంలో జరుగుతుంది. ఎంతో ఆత్మవిశ్వాసమూ, మానసిక పరిణతీ, జీవితం పట్ల, మానవ సంబంధాల పట్ల అవగాహన ఉన్న వారికే ఈ సహజీవనం లాంటివి పని చేస్తాయి.

ramya on July 3, 2008 at 4:40 AM   said...

బయట ఎన్ని పోరాటాలు,చిరాకులు ఉన్నా కుటుంబజీవితం మనిషిని ఎంతో సేదతీరుస్తుంది.
సహ జీవనం లో కుటుంబవ్యవస్థ ఉండదేమో, అప్పుడు మనిషి జంతువులా ఒంటరివాడైపోడా! ఒక వయసు తరువాత (పిల్లలూ,బంధువులూ లేని) ఒంటరితనం భయంకరమైనది.

netizen నెటిజన్ on July 4, 2008 at 3:30 AM   said...

@కొత్తపాళీ: ఆ సహజీవనంలోని నైతికత వారివురిది. ఎంతో ఆత్మ విశ్వాసమూ, మానసిక పరిణితి ఉన్నవారికే. అంతే కాదు, మీరు అన్నట్టు ఆందులో నుండి వెలువడ్డ పిల్లల సంరక్షణ చుట్టు ఉన్న సమాజం అవసరమైనప్పుడు అందుకోవాలి/ వారిని ఆదుకోవాలి.

@రమ్య: నిజమే, ఒక వయసు తరువాత ఒంటరితనం భయంకరమైనది. సహజీవనంలో ఒక భాగస్వామిని కోల్పోయిన తరువాతి జీవితం, ప్రత్యేకంగా, పిల్లలు లేనప్పుడు, అది అనుభవించినవారికి గాని తెలియదు ఎంత భయంకరమైనదో! సమాజం, వివాహనికిచ్చిన "అర్హతాపత్రం" సహజీవనానికి ఇవ్వదు కదా! అప్పుడు లోకులు కాకులు గా మారుతారు.

Konduru on August 6, 2008 at 7:11 PM   said...

It fails when the partners get to grow old. The relationship is so stronger and the responsibility of parteners are vetry high if they are married. If they are not married and living together it leads to confussion when it comes children and other things. Marriage systems is designed do nicely to solve many problems in the society. Living together without marriage doesn't make sense.

Here I obsereved one thing, why are you not approving the comments when it is against the post. This is very much biased. You may feel that you its working for some time but in the long term people will realize that this is not true\transperent platform to discuss anything.

netizen నెటిజన్ on August 6, 2008 at 9:27 PM   said...

@ Konduru: మీ సమయాన్ని వెచ్చించి మీ అభిప్రాయ్నాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

ఈ బ్లాగ్ ఎప్పుడూ సద్విమర్శలను ఆహ్వానిస్తుంది. బ్లాగరి అభిప్రాయాలతో ఏకిభవించని వ్యాఖ్యలను కూడా మీరు ఇక్కడ చదవ వచ్చు.మరి ఈ బ్లాగరి తొ అంగీకరించని అభిప్రాయాలను ప్రచురించటంలేదన్న ఆలోచన ఎందుకు కలిగిందో తెలియటం లేదు. మీ అభిప్రాయానికి కారణం ఏదైనా ఉంటే తెలియజేయండి. అటువంటి పొరబాటు ఏదేని జరిగి ఊంటే సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించిన వారవుతారు, మీరు.

ఇక తెలుగులో మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను తెలియజేస్తే , మీ వంతు సహాయాన్ని అందజేసిన వారవుతారు. పెద్ద ఇబ్బంది పడకుండా తెలుగులో వ్రాయడానికి చాల ఉపకరణాలు (tools) సిద్ధంగా ఉన్నవి. వివరాలు కావలంటే ఇక్కడే అడగండి! జవాబులు వస్తాయి.

Mahatma on December 4, 2008 at 9:14 AM   said...

Manadee voka batukena, kukkalavale, nakkalavale, sandulalo pandulavale......ani next generation pillalu(talli evaro, tandri evaro teliyani)haiga padukuntoo tirugutaru. Am I right Mr.Netigen.

Perfectly right for Mr.Netigen, certainly not for Miss Netigen. As a male dog, I enjoy 24 x 7, but how about Miss Netigen ?

Volga, are you hearing ! ! !

Unknown on December 5, 2008 at 3:05 AM   said...

నైతికం అనైతికం కాదు ముఖ్యం జీవనం అది ఎంత వరకు అనేది ముఖ్యం.మనం మన కోసం జీవించాలి.

Suresh on February 6, 2009 at 10:54 AM   said...

entamandito shajeevan cheyyavacchuno konchem selavistara?
oka vypu pub lapi daadi chesi amayakula swechaku bangam kaligistunte evarikee nastam ledu kaani. mari enduku saha jeevan ante inta akkasu.
andaroo okati gamaninchandi, palukubadi unna vaadike ilanti advantages anni. samanyulaku kaadu.

The present society transformed into two parts. Lwas are fails because no one controlling.

Legal question comes if i do sahajeevanam only one hour or a day or a month. Please make it clear to people!

It's absolutly a bumper offer for Pawan. Who knows he might get some one soon and uses sahajeevanam. So make the laws very clear and punish accordingly. who are others to show their favour on various issues. just follow the law! This is my opinion :)

కొత్త పాళీ on February 7, 2009 at 6:38 AM   said...

ఒకడికి బాగ జ్వరం వచ్చింది. ఎందుకు జ్వరం వచ్చిందా అని నిన్నంతా ఏమి చేశానో అని పరిశీలించి చూసుకున్నాడు. పొద్దున లేచి ఇంట్లోంచి బయటికి రాంగానే పక్కింటి వాడి మొహం చూశాడని గుర్తొచ్చింది. ఇంకేముంది, వాడి మొహం చూడ్డం మూలానే జ్వరం వచ్చింది అనేసి డిసైడైపొయ్యాడు. అట్లా ఉంది ఈ వ్యవహారం .. పెళ్ళా .. సహజీవనమా అని. సమస్యలకి మూలం పెళ్ళి అనే ప్రక్రియ కాదు. దాంపత్య జీవితం నించి ఏం కోరుకుంటున్నాము, ఏం కోరుకోవాలి, తమ దాంపత్య జీవితం ఎలాగుండాలి అన్న మౌలిక విషయాలపై స్త్రీపురుషులిద్దరికీ కనీసమైన అవగాహన కూడా లేకపోవడం .. ఇదీ అసలు రుగ్మతకి కారణం. అటువంటి అవగాహన ఉన్న వాళ్ళు తమ పరస్పర సంబంధాన్ని ఏ పద్ధతిలో అమలు పరుచుకున్నా బాగానే ఉంటారు.
ఈ విషయమ్మీద వోల్గానే ఇదివరలో ప్రయోగం అని ఒక మంచి కథ రాశారు. కానీ సమస్యని కూలంకషంగా మూలాలనించి చర్చించకుండా పైన ఉదహరించిన లాంటి పొడి నిర్ణయాలు ప్రకటిస్తే అందువల్ల మంచి కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
పైన ఎవరో "సహజీవనం" చేస్తున్న ప్రముఖులు అంటూ జయప్రద, శ్రీదేవి ఇత్యాదులని ఉదహరించారు. నాకు తెలిసి వీళ్ళు ఆల్రెడీ ఒక పెళ్ళయి ఏదో ఒక కారణం వల్ల ఆ పెళ్ళిని చట్టపరంగా రద్దు చేసుకోడానికి ఇష్టపడని వ్యక్తులతో చేస్తున్నారు ఈ సహజీవనం. హిందూ సామాజిక చట్టాల ప్రకారం బహుభార్యాత్వం నేరం కనక ఈ పని చేస్తున్నారు గానీ వాళ్ళకి సమాజం గురించి కానీ సహజీవనం గురించి కానీ ఏదో గొప్ప అవగాహన ఉండి మాత్రం కాదు అని నా అనుమానం. ఇది నా అనుమానం మాత్రమే.
ఒకట్ మాత్రం నిజం. ప్రపంచంలో చాలా దేశాల్లో లాగానే మన దేశంలోనూ డబ్బూ అధికారం ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది. వాళ్ళకి చట్టాలు వర్తించవు సరిగదా, వాళ్ళు చేసిన పనుల్ని లీలలుగా కూడా కీర్తిస్తారు.

netizen నెటిజన్ on February 7, 2009 at 10:17 PM   said...

@కొత్తపాళీ: ఆ సహజీవనంలోని నైతికత వారివురిది. ఎంతో ఆత్మ విశ్వాసమూ, మానసిక పరిణితి ఉన్నవారికే. అంతే కాదు, మీరు అన్నట్టు ఆందులో నుండి వెలువడ్డ పిల్లల సంరక్షణ చుట్టు ఉన్న సమాజం అవసరమైనప్పుడు అందుకోవాలి/ వారిని ఆదుకోవాలి", అని మీకు జూలై లోనే జవాబిచ్చాను.

ఇక మీరన్న"దాంపత్య జీవితం నించి ఏం కోరుకుంటున్నాము, ఏం కోరుకోవాలి, తమ దాంపత్య జీవితం ఎలాగుండాలి అన్న మౌలిక విషయాలపై స్త్రీపురుషులిద్దరికీ కనీసమైన అవగాహన కూడా లేకపోవడం .. ఇదీ అసలు రుగ్మతకి కారణం. అటువంటి అవగాహన ఉన్న వాళ్ళు తమ పరస్పర సంబంధాన్ని ఏ పద్ధతిలో అమలు పరుచుకున్నా బాగానే ఉంటారు“, అన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అది లేదు కాబట్టే నేటి ఈ దుస్థితి.

ఇక ఆ మధ్య మన గుజరాత్ లో ఒప్పొందం పెళ్ళిళ్ళు కూడా మొదలైనవి. చట్టంలోని ఒక వెసులుబాటు ద్వార మన ఆంధ్రదేశంలోను కొంతమంది తమ వివాహేతర సంబంధాలకి ఒక "నైతికత" ని అపాదించుకున్న ప్రబుద్ధులున్నారు.

Unknown on February 20, 2009 at 9:00 PM   said...

marriages are not master slave relations as mentioned by someone here...There are MANY marriages where man and women share responsiblities and are very mordern....I dont think we can trust volga...who happens to be a feminist and seems to be confused...She once conducted a meeting trying to convince the public that women have a way of writing which is not being recognised by men because this is a mans world...WHAT CRAP!!...some of the greatest women writers are the most talented and they were recognised because of their talent alone...which by the way volga is not.....her writings are boorish at the most...

The most easiest thing to say is to break free...but are not our marriages more successful than those of europe?.Yes they are ...is it possible if marriages are really so much like a master and slave...
Problem with volga is that she is brainless....In many ways a women gets security out of a marriage and in case of divorce she gets alimony.....but in a live in relationship all that is not possible...if the relationship dosent work ....the girl and guy will try another and another....and when they are young attraction is commen...this is nothing but modern prostitution....if live in ok ...so is prostitution...of as some people say ...that women is my keep....This shows the hallowness of this feminist writer who seems to simply support this because she happens to be part of PRAJA RAJYAM and the brother of the founder of that party is prominently known for a live in relation ship....volga is nothing but a petty politician...who shows hieght of female chauvnism.

Unknown on April 19, 2009 at 7:11 PM   said...

Indian culture is a natural way,mixing with human values and ethics.Due to inceasing trend of selfishness and greediness in human beings, it appears as a waste.If we eradicate these evils, our culture will deliver fruits.Without doing this adopting new systems will produce side effects .For this examine the todays possision of forgien cultures.

Post a Comment