హాట్స్ ఆఫ్ శ్రీధర్!

అనంతపురానికి 87వ కలెక్టర్, ఎన్. శ్రీధర్, తనని విధులనుండి తప్పించమని కోరుతూ ప్రభుత్వానికి ఒక జాబు వ్రాసాడు. కారణం పదవతరగతి పరిక్షలలో తన జిల్లాకు తను కోరుకున్న ఉత్తీర్ణత శాతం రాలేదు. రాష్ట్రంలో 18వ స్థానం అనంతపురం జిల్లాది.

అనంతపురంజిల్లాలో పదవ తరగతి విద్యార్ధులని రాష్ట్రంలో ముందు నిలబెడతాను అని ఒకవేళ అలా కాని పక్షంలో రాజీనామా చేస్తానని ఆయన దాదాపు ఐదు నెలల క్రితమే ప్రకటించారు. అందుకు గాను తన శాయశక్తులా ప్రయత్నించారు.

అది చెయ్యలేకపొయ్యను, కాబట్టి నైతికంగా తను ఇక కొనసాగడం తప్పూ అనుకున్నాడాయన.

ఎన్. శ్రీధర్ లాంటి అధికారులుంటే దేశం చాలా బాగుపడుతుంది.

కనీసం వఛ్ఛే విద్యాసంవత్సరంలో నైనా తను అనుకున్న ఫలితాలు సాధించడానికి, ఆయన అదే పదవిలో కొనసాగాలని, దానికి అనంతపురం జిల్లాలోని అధికార బృందం, అధ్యాపక వర్గం, విద్యార్ధిని విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు, సహయ సహకారాలు ఎన్. శ్రీధర్‌కి అందించాలని కోరుకుందాం.

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఫోను నెంబర్లు: 08554-274641
అవకాశం ఉన్నవారు ఫోను చేసి చెప్పండి.
District Collector, Collector's Bungalow, Hospital Road, Opp: Govt. General Hospital, Anantapur 515001

వ్రాయగాలిగినవారు జాబుల ద్వారా తెలియజేయండి!
వారి email id దొరకలేదు.
అనంతపురం బ్లాగార్లులేవరన్నా కనుక్కుని తెలియజేస్తే దాన్ని పదిమందికి తెలియజేయవచ్చు!

1 వ్యాఖ్య:

valluri on May 16, 2008 at 10:28 AM   said...

గ్రేట్! ఆలాంటివారు ఇంక అక్కడక్కడ ఉండబట్టే ఈ అరచకయుగంలో నీతి, నిజాయతి, మంచితనము బతికిబట్టకడుతున్నాయి. వారి mail ID దొరికితే తెలియజేయండి, కనీసం moral support అయినా చేద్దాం!

Post a Comment