అంత కండ కావరమా మీకు?

రాజకీయానుభవం బొత్తిగా లేని చిరంజీవి పార్టిలో నేను చేరను అని అన్నందుకు, కొన్ని వందల మైళ్ళు వెంటాడి, వేటాడి, పంజగుట్టలో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ అనే సిని నటుడి మీద దాడి చేసారు.

"బాడుగనేతలు" అన్న కధనం ప్రచురించినందుకు అటుమొన్న జుబిలీ హిల్ల్‌స్ లోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సభ్యులో దాని కార్యకర్తలో, లేదు సానుభూతిపరులో దాడి చేసి పెట్రొల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించారు. రిసెప్షనిస్ట్ కాంచన మీద పెట్రోల్ పోసారు.
దిల్‌సుక్‌నగర్లోని వారి ప్రాంతీయ కార్యాలయంలో పని అమ్మాయి మీద పడి గాయ పరిచారు.

ముషీరాబాదులో డబ్బులు పంపిణీ చేస్తు ఓటర్లని ప్రలోభ పెడుతున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్సు పార్టి అమాత్యులు - గౌరవనీయులు ముకేష్ గౌడ్ వియ్యంకుడి ఇంట్లో ఆ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నించిన రాజ్య సభ సభ్యుడు మధు ని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ముకెష్ గౌడ్ నెట్టి కొట్టాడు.


ముకెష్ గౌడ్ ని వెనకేసుకువస్తు ఉ "సాక్షి" పత్రిక సంపాదికీయం.


ఇక సామాన్యుడి గతి ఏమిటి?

చిరంజీవి, మంద కృష్ణ మాదిగా, జూపూడి ప్రభాకరావ్, కృష్ణయ్యాలారా, ముకెష్ గవుడు గార్లు మీకందరికి ఇంత అసహనమా?

చట్టానికి, సాంఘిక ప్రవర్తనావళికి మీరు అతీతులా?

లేదు మీది కండ కావరమా?

అహంకారమా?

మీరు అసామాన్యులా?

Labels:

2 వ్యాఖ్యలు:

Sairam on May 30, 2008 at 9:13 PM   said...

Current day politicians and politics are nothing but a reflection of the society you and I live in where people would do anything to be successful and earn money. To reach their goal, majority do not care if their actions and choices are ethically correct. I guess human behaviour in general is reward seeking sort of oriented. If there comes a day when there is a reward for good behaviour, society will certainly change.

Regarding naming Chiranjeevi in the same breadth of other proven culprits does not sound a well informed or politically imaprtial statement given that Chiranjeevi has apologized personally, even though those are somebody's actions. Let us give people their deserved opportunities to either fail or succeed.

Anonymous on May 30, 2008 at 10:06 PM   said...

@Sairam: It is not the question of Chiranjeevi or someone else apologizing. It is the question of one's ability to appreciate that one does have a difference of opinion and respect it.

Post a Comment