వగలాడి అంజలి ఒక 420

మన పోలిసోళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, అందరికి చెబుతారు కదా, ఇక్కడ ఇలాంటి ఘోరం జరిగింది, దానిని మేము ఇలా పరిష్కరించాము అని. ఆ పోలిసోళ్ళు చెప్పిందే ఈ విలేకరులు వ్రాసుకుంటారు. ఆ టీ వీ వాళ్ళు చూపిస్తారు. అలాంటి ఒకానొక పత్రిక - ఈనాడు లో (అంజలి 420 కధ జూన్ 10న హైద్రాబాద్ ఎడిషన్ పేజి 5లో )విలేకరి వ్రాసింది - ఈనాడులో ఇక్కడ చదవండి.
అంజలి కధ బ్లాగరి మాటల్లో ఈ క్రింద చదవండి.
ఇది అంజలి కధ.

అంజలి ఒక 420.
అంజలి ఒక నెరజాణ.
వగలాడి.
ఒక మోసగత్తె.
ఒక టక్కులాడి.
వగలు పోతు తన అందంతో మగవాడిని ఉచ్చులోకి లాగి వాడి జేబులో డబ్బు, మెడలో బంగారపు గొలుసులు లాఘవంగా లాగేస్తుంది. వాడు తాగి విజృంభిస్తానంటే అలాగే అంటుంది తనలో తాను నవ్వుకుంటూ. తెలిదుగా ఆ అమాయకుడికి. వాడు నువ్వుకూడా తాగు అంటే కంపెని కోసం అంటూ తాగుతుంది. వాడితో తాగిస్తుంది. వాడు ఆ మత్తులో మునిగే దాక తాగిస్తుంది. తరువాత వాడివన్ని వొలుచుకుని తప్పుకుంటుంది. ఇలాంటి ఆడది దొరికితే ఏ మొగాడు చొంగ కార్చుకోకుండా ఉంటాడూ? పైగా వయసులో ఉన్న ఆడది. ఎర్రగా, పొంకంగా ఉన్న అంజలి పొందుకూడ ఎంత రంజుగా వుంటుందో ! వెమ్మట పడి తనతో రమ్మనకుండా ఉండగలడా? మనకి మన విలేకరి ఇంకోటి కూడా చెపుతున్నాడు - ఈ వగలాడి పెళ్ళి కూడా చేసుకుంది. మొగుడ్ని చంపేసింది కూడా.
ఇది అంజలి కధ - ఈనాడులో.
* * *

ఇది స్వాతి కధ

పెద్ద అడిసేపల్లి గ్రామంలోని రాములు కూతురు స్వాతి. స్వాతి కి ముగ్గురు చెళ్ళెళ్ళు. స్వాతి తల్లికి కూడా కష్టంగానే ఉండేది వీళ్ళని సాకడం. అందుకని రాములు, యాదమ్మ పిల్లలతో భాగ్యనగరం చేరుకున్నారు. సరూర్‌నగర్ ప్రాంతంలోని బస్తిలో కూలీలుగా జీవనం మొదలుబెట్టారు. ఆ దగ్గిరలోనే ఒక గుడికుడా ఉంది. స్వాతి గుడికి వెళ్ళేది.ఆ గుడిని శుభ్రం చెయ్యడం లాంటి చిన్ని చిన్ని పనులు చేస్తూ ఉండేది. స్వతహాగా కలుపుగోలు పిల్ల. అందరితోను కలిసిపోయింది.


రాములు ఒక గుత్తేదారు (కాంట్రక్టర్) దగ్గిర పనికి కుదిరాడు. అప్పుడప్పుడూ తనతో పనిలోకి తను పనిచేసే చోటుకు స్వాతిని కూడా తీసుకెల్లేవాడు. వయస్సులో ఉన్న పిల్ల. ఎర్రగా బుర్రగా ఉంది.మాములేగా! రాములు యజమాని కళ్ళు స్వాతి మీద పడ్డాయి. ఏదో ఒక మిష మీద స్వాతి కోసం బస్తి కి వచ్చేవాడు. ఫొనులు చేసి పిలిపించుకునేవాడు. బస్తిలో వాళ్ళందరు చెవులు కొరుక్కొవడం మొదలుపెట్టారు. స్వాతి శీలం మీద చర్చ మొదలయ్యింది.


శ్రీనివాస్, కృష్ణ, నగేష్, అనంద్‌కుమార్‌లు స్నేహితులు. ఆ రోజు శుక్రవారం. మార్చ్ 31. 2006. స్వాతిని వాళ్ళు కబుర్లలోకి దించారు. బలవంతంగా ఆటో ఎక్కించారు. కంచన్‌బాగ్‌కి తీసుకెళ్ళారు. అది ఇది చెప్పారు. మద్యం తాగించారు. వాళ్ళు తాగారు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు స్వాతిని చెరిచారు. దాఋణంగా, పాశవికంగా, రాక్చసంగా స్వాతి శీలాన్ని చిద్రం చేసారు. అప్పటిదాక కలివిడిగా, తలలో నాలుకగా ఉండే స్వాతి, నలుగురికి సహాయం చేసే స్వాతి, కృంగిపోయింది. ముడుచుకుపోయింది. ఈ ప్రపంచానికి దూరంగా తన ఒంటరిలోకంలోకి వెళ్ళిపోయింది. తన ప్రపంచంలో మగవాళ్ళమీద విపరీతమైన ద్వేషం పెంచుకుంది.


ఆ నలుగురు మీద ఫిర్యాదు చేస్తాను, తోడు రమ్మనమని అడిగింది. ఎవ్వరు తోడు రాలేదు. తనే ఒంటరిగా పోలిసు స్టేషన్‌కి వెళ్ళింది. వాళ్ళ మీద ఫిర్యాదు చేసింది. ఆ నలుగురు మెట్లు దిగి వచ్చారు. రాజీ అన్నారు. స్వాతి శీలానికి వెల కట్టారు. అక్షరాల అరవై వేల రూపాయలు. స్వాతికి ఇరుగు పొరుగు ప్రవర్తనలో స్పష్టమైన తేడా కనపడింది.


బస్తిలో ఒకసారి గొడవ జరిగింది. ఒక మహిళ మంగళ సూత్రం పోయింది. అందరి కళ్ళు స్వాతి మీదే.ప్రశ్నించడంలేదు అవి. స్వాతి ని రిమాండ్‌కి పంపారు. తల్లితండ్రులు దూరమయ్యారు. అదను దొరికింది. నేనున్నానుగా అంటూ రఘు దగ్గిరయ్యాడు. రసాన్ని అంతా తాగి పిప్పిని ఊసినట్టు ఉసేసాడు. ఒంటరి ఆడది. జైలుకెళ్ళినప్పుడైన ఖర్చులు. డబ్బు అప్పుతీసుకుంది. వాళ్ళందరు పీక్కు తినడం మొదలెట్టారు. త్రాగి మరిచిపోవడం మొదలుబెట్టింది. ఐస్‌క్రీంలు అమ్మే మస్తాను పెట్టిన ఐసుకి కరిగిపోయింది. మళ్ళీ మగవాడిని నమ్మింది. డబ్బులిచ్చాడు. ఒకరోజు రా పక్కలోకి అని అడిగాడు. రాను పొమ్మంది. చెయ్యిబట్టుకు లాగాడు. చీ, చెయ్యివదులు అంటు తోసింది. వాడు వెనకకి పడ్డాడు. స్వాతి మరో వైపుకి పడింది. మస్తాను తల పగిలింది. వాడికి నూకలు చెల్లాయి. స్వాతి తలకి బలమైన గాయం అయ్యింది. మతి తప్పింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ పోయింది. స్వాతి మతి స్థిరం పోయింది.

బ్రతకడానికి డబ్బులు కావాలి. అందుకని ఏ టి ఎం సెంటర్ల దగ్గిర మాటు వేస్తుంది. తను అసహ్యించుకునే మగవాడికి తన సెక్సీ నవ్వుతో ఆహ్వానం పలుకుతుంది. వాడికి తన మేని చాయతో ఎర వెస్తుంది. మాటల గారడితో బోల్తా కొట్టిస్తుంది. వాడి వెనక బైకు మీద కూర్చుంటుంది. వాడికి మత్తెకిస్తుంది. వాడి జేబులో చెయ్యిపెడుతుంది. డబ్బులు లాగేస్తుంది. వాడి కార్డులో డబ్బులుకూడా లాగేస్తుంది.

ముషిరాబాదులో ఒక ఏ టి ఎం దగ్గిర ఒకడు స్వాతి నవ్వులో పడి గిరికీలు కొట్టాడు. ఆనందంతో వంకీలు తిరిగిపొయ్యాడు. రా అన్నాడు. నవ్వుకుంది. సరే పద అంది. ఇంటికి వెల్దాం అన్నాడు. తీసుకెళ్ళమంది. వాడి బుర్రలో మందు, విందూ, పొందూ ఉంది. మందుకి కూడా "సై" అంది. ఇద్దరు తాగారు. తిన్నారు. వాడు పడుకున్నాడు. స్వాతి పడుకోలేదు. తనకి కావల్సినవి తీసుకుంది. వాడిని చూసి నవ్వుకుంది. చీకట్లోకి తప్పుకుంది. వాడికి మెళకువ వచ్చింది. లబో దిబో. పోలిసులున్నారుగా. పరుగెత్తుకెళ్ళాడు.

వాళ్ళు వల విసిరారు.
లేడి వాళ్ళకి చిక్కింది.
ఎర్రగా బుర్రగా ఉంది.
పత్రికల వాళ్ళని పిల్చారు.
స్వాతిని చూపించారు.
వాళ్లు వ్రాసుకున్నారు.
టీ వీ వాళ్ళని పిలిచారు.
వాళ్ళు వచ్చారు.
స్వాతిని చూపించారు.
ఒంటరి ఆడది.
చీ, ఇది ఆడదేనా అని అన్నారు?
ఆ అన్నది ఆడ ఆంకర్‌లే!


ఇప్పుడు చెప్పండి, ఎవరి కధనం బాగుంది?

ఈనాడు దా? సాక్షిదా?



సాక్షి లోని ఈ కుర్రాడెవడో స్వంత బుద్ధిని ఉపయోగించి ఆ అమ్మాయి వెమ్మట బడి కొంత వివరాలు తెలుసుకున్నాడు.

ఆంగ్లంలో అంటారు - "a girl with a good geography has always a history" అని. అందుకే తన వార్త(?) కి "అందమే నా నేరమా?" అని శీర్షిక పెట్టాడు. అతనికి అంత ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉందని అనుకోనఖర్లేదు. ఈ టపా ముఖ్య ఉద్దేశం కూడా అది కాదు కాబట్టి దాన్ని పక్కన బెడదాము.


విషయం ఒకటే!
రెండు పత్రికలు.
ఇద్దరు విలేకరులు.
రెండు కోణాలు!
నాణేనికి రెండూ పార్శ్వాలు.
ఏది నిజం?
ఏ కధనం సబబు?
వృత్తిపరంగా ఎవరి కధనం సరైనది?
ఎవరి వార్త ని నమ్మాలి?

ఈ బ్లాగరి కధనం పక్కన బెట్టండి.

12 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on June 14, 2008 at 3:56 AM   said...

ఈనాడు దినపత్రికలో ఇలాంటి కధనమా??!!!సరసంగా వెలువడే సంసార్ల వారపత్రికను మించి,మా చిన్నతనాన అంతరించిన రాధిక,రమణి,రసికప్రియ లను గుర్తుకు తెచ్చేవిధమైన స్వైరకల్పనల,విశృంఖల వర్ణన.నావరకు ఆకధనానికి తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నా..

Bolloju Baba on June 14, 2008 at 4:57 AM   said...

ఎవరికి ఓటువెయ్యాలో మీరె నిర్ణయించేసారుగా.
బొల్లోజు బాబా

సుజాత వేల్పూరి on June 14, 2008 at 7:12 AM   said...

'ఎర్రగా పొంకంగా ఉన్న అంజలి పొందు ఇంకెంత బాగుంటుందో' ఇలాంటి వాక్యం ఒక వార్తలో విలేకరి రాస్తే, న్యూస్ ఎడిటరు కళ్ళు పోయాయా? పాపం ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో చూసి ఈ విలేకరి గాడిద బాగా tempt అయినట్టున్నాడు.

ఇక యాంకర్ల సంగతి! వాళ్ళు(కనీసం కొంతమంది) లాడ్జిల్లో పట్టుబడేవరకూ అవతలి వాళ్ళంతా పతితలు..వీళ్ళేమో పత్తిత్తులు!

Kathi Mahesh Kumar on June 14, 2008 at 8:50 AM   said...

మొత్తంగా దిగజారిన మన జర్నలిజం (సెన్సేషనలిజం) పోకడలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్న చాలామందికి తెలుగు కాస్త బాగా రాయగలరన్న అర్హత తప్ప ఇంకేవీ లేవు.

ఇలాంటివారు కథ కులుగానో,నవలా రచయితలుగానో తమ ప్రయత్నాలు సాగించుకోవాలేగానీ ‘వార్తల్ని’ కథలుగా మార్చెయ్యడం వలన వస్తున్న సమస్య ఇది.

Anil Dasari on June 14, 2008 at 9:37 AM   said...

రాజేంద్ర గారూ,

'ఈనాడు' వాళ్లు రాసింది అసభ్యంగా ఏమీ లేదు. సాక్షి లోనే మరీ బూతు కధ లాగా ఉంది, వార్త లాగా లేదది.

"ఎర్రగా, పొంకంగా ఉన్న అంజలి పొందుకూడ ఎంత రంజుగా వుంటుందో " అనేది బ్లాగరి మాట లాగుంది.

Anonymous on June 14, 2008 at 10:49 AM   said...

సాదారణంగా టబ్లాయుడ్ పేపర్లలో ఇటువంటి రాతలు రాస్తారు. బ్రాడ్ సీట్ పేపర్లలో గౌరవంగా వ్రాస్తారు. దురదృష్టమేమిటంటే మన పెద్ద సీట్ పేపర్లు టాబ్లాయుడ్ లాగా వ్రాస్తున్నాయి. వీరు పేపరు సైజు తగ్గించుకుని ఎలా వ్రాసుకున్న పర్వలేదు. ప్రజలు అర్దము చేసుకుంటరు. బ్రాడ్ సీట్ విలువ కాపాడినవారవుతారు.

Anonymous on June 14, 2008 at 7:25 PM   said...

@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి: మీరు ఈనాడు లింక్‌ లో వార్తని చదవండి. ఇక్కడ వ్రాసింది - బ్లాగరి.

@ bolloju ahmad ali baba: మీ ఓటు ఎవరికో చెప్పండి.

@:సుజాత: ఆ వాక్యం విలేకరిది కాదు. బ్లాగరిది్

@Kathi Mahesh Kumar: Argree with you on sensanalization and pandering to the masses. Beg to differ with you on language skills. ఇదే వార్తలో "సాక్షి" లో "కుంచించుకుపోయింది." అని వ్రాసారు. అక్కడ "కుంగిపోయింది" అన్న పదం వాడాలేమో! వీల్లందరికి మాల్లి తెగులు నేర్పించుకోని వ్వ్ల్లతొ మల్లి రాయించుకోవాలి. వీల్లే రేపతి తెలుగు పత్రికలలి ముక్య "సం"పాదకులు. పత్రక్క తెగులుని ఎవరు కాపాదుతోరో అమితోఇ.

అబ్రకదబ్ర: మీరన్నది నిజమే ఆ వాక్యం బ్లాగరిది.
సాక్షి లోని వార్త మళ్ళీ ఒక సారి చదవండి.
@ shiva-speak: టాబ్లాయిడ్ లో ఒక విధంగా, బ్రాడ్‌షీట్ కి మరొక విధంగా, కాగితం అదా చేద్దాం అని రాయరండి.

Anil Dasari on June 14, 2008 at 9:05 PM   said...

నెటిజన్,
నాదే పొరపాటు. సాక్షి వార్తని వివరంగా చదవకుండా పొరబడ్డాను.

Anonymous on June 14, 2008 at 9:46 PM   said...

@Kathi Mahesh Kumar: sorry that should read - "sensationalization"

Kathi Mahesh Kumar on June 14, 2008 at 11:14 PM   said...

@నెటిజన్ , ఏదో ‘జర్నలిజం’కు దగ్గరగా ఉంటుందని "సెన్సేషనలిజం" అన్నా...అది గ్రమాటికల్ గా తప్పని తెలుసు.కానీ ఆపదం కూడా ఉపయోగుంచొచ్చేమో!

Bolloju Baba on June 15, 2008 at 9:53 AM   said...

రెండూ మీరన్నట్లు భిన్న కోణాలు. ఈనాడు వ్రాసిన వార్తా విలేఖరి బహుసా ఇలాంటి నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో వ్రాసాడనిపిస్తుంది. ఆ విషయంలో చాలా క్లియర్ గానే వార్తను వ్రాసుకు పోయాడు.

ప్రతీ నేరానికి పెద్దవో, చిన్నవో సహేతుకమైన కారణాలు ఉంటానె ఉంటాయి. చూసే కళ్లను బట్టి ఉంటుంది. కానీ నేరం నేరమే కదా.
సాక్షి కధనంలో మానవీయకోణం ఎక్కువగాఉంది. ఇలాంటి దృక్కోణం వార్తలకంటే కూడా (మరీముఖ్యంగా నేరాలకు సంభందిచినవి) కధలకు,నవలలకు, స్పెషల్ అయిటంస్ కు మాత్రం పరిమితమైతే బాగుంటుందని నా ఉద్దేశ్యం.

వార్తాపరంగా చూసినట్లయితే నా వోటును ఈనాడుకు వేస్తాను. ఇలా వ్రాయటమే సమాజానికి మేలుచేస్తుందని నా అభిప్రాయం. ఎలా అంటే ప్రజలు అప్రమత్తమవుతారు, ఇలాంటినేరాలు కూడా జరగవచ్చు అని తెలుసుకుంటారు, etc.

విశ్లేషణతో కూడిన కధనం ఏదని అడిగితే సాక్షఅనే అంటాను. ఇలా వ్రాయటం వలన, చదువరికి భలేగా ఉందనిపించినా, సమాజానికి పెద్దగా ఉపయోగపడదు సరికదా, తప్పులుచేసేవారందరికీ, ఒకవాదనను అందించనట్లవుతుంది.

disclaimer: ఆయా పత్రికలపై నా వ్యాఖ్య ఈ వార్తకు మాత్రమే పరిమితము.

బొల్లోజు బాబా

krishna on June 16, 2008 at 5:56 AM   said...

విలువలు పడిపొతున్నయనడానికి ఇదొక ఉదాహరణ.
అసలు ఆ కాంట్రాక్టరుకు వ్యక్తిగత విలువ వుండి వుంటే ఇదొక వార్తే అయ్యుండేది కాదు .అట్లాంటి విలువల్లఏని వ్యక్తులే కదా పత్రికల్లో కూడా వుండేది.
అందరూ అందరే.

Post a Comment