వీళ్ళు ఆ పత్రికని బహిష్కరిస్తున్నారంట!

సైకిల్ మీద తిరిగిన రాధాకృష్ణ ఈ రోజు స్కోడాలొ, బెంజ్ కారులోను తిరుగుతున్నందుకు దుగ్దా, లేదా చలన చిత్ర రంగంలో ఒక అగ్ర తారని బడుగువర్గాల నేతగా ప్రస్తుతిస్తు వార్తలందిస్తున్నందుకు బాధ?

మరి ఇదే రాధాకృష్ణ యాజమాన్యంలోనే ఆంధ్రజ్యోతి బడుగులకోసం పోరాడుతున్న నేతలగురించి రాసినఫ్ఫుడు లేనీ ఆక్షేపణ ఈనాడెందుకు వచ్చింది?

అసలు విషయం ఏది?

* నేటి సాక్షి పత్రికలోని వార్త ఇది.


నిన్నటికి నిన్న లోక్‌సత్తా (మరాఠీ పత్రిక) సంపాదకుడు - కుమార్ కెట్కర్ మీద శివ సంగ్రాం సమితి సభ్యుల దాడి. మహరాష్ట్ర ప్రభుత్వం, ముంబై సముద్ర తీరాన కొన్ని కోట్ల ఖర్చుతో శివాజి విగ్రహాన్ని స్థాపించడంలోని ఔచిత్యాన్ని తన సంపాదికీయంతో ప్రశ్నించినందుకు ఆ మూక అతని ఇంటిమీద దాడి చేసింది. కొన్ని వేలమంది జీవానోపాధి లేక దుర్భర దారిద్రంతో బతుకు ఈడ్చుకుంటు, కొంత మంది చనిఫోతున్న నేపధ్యంలో ఆ విగ్రహన్ని గురించి ప్రశ్నించినందుకు జవాబు ఆ దాడి.

స్వార్ధ ప్రయోజనాల కోసం ఏ కొద్దిమందో ఇలాంటి "ప్రెజర్ గ్రూప్స్"గా తయారయ్యి, తమ కోరికలను సాధించుకోవడం కొరకు ప్రసారమాధ్యమాలని ఇలా "బ్లాక్‌మైల్" చెయ్యడం ముక్తకంఠంతో గర్హించాల్సిన సమస్య ఇది.లోక్‌సత్తా (మరాఠీ పత్రిక) సంపాదకుడు - కుమార్ కెట్కర్2 వ్యాఖ్యలు:

Anonymous on June 6, 2008 at 7:05 AM   said...

ఈ మొత్తం వ్యవహారమంతా చూస్తూంటే, ఇంకా పుట్టని ఆ పార్టీకి మెళ్ళో బిళ్ళ తగిలించే ప్రయత్నంలాగా అనిపిస్తోంది. (జ్యోతి రాసిన వార్తలో నిజమున్నప్పటికీ.., ఆ పని వెనక వీళ్ళు ఆరోపిస్తున్న ప్రయత్నం లేదని అనలేం.)

చిరంజీవి పార్టీ పెట్టేదాకా, ఈ అంశాన్ని సమసిపోనీయకుండా కాపాడుతారు. ముందుగా జ్యోతి బడుగుల వ్యతిరేకి అని ముద్దరేస్తే, ఆ పత్రిక నెత్తికెత్తుకుంటున్న చిరంజీవిని కూడా అదే కర్ర పెట్టి కొట్టొచ్చు, ఆ తరవాత.

Post a Comment