మంద కృష్ణ మాదిగ మందస్వామ్యం

ఆంధ్రజ్యోతి మీద మళ్ళీ దాడి జేస్తారంట!
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కానివ్వండి, ఆంధ్రజ్యోతి "బాడుగనేతలు" అని పేరిడిన నేతల సంస్థల సభ్యులు కానివ్వండి, వారు కూడ, ఈ సమాజంలో సభ్యులే కదా?
మరి వారికి, ఈ న్యాయ సభలు, చట్టాలు పనికి రావా?
అన్యాయం జరిగినప్పుడు వారు వాటిని అశ్రయించరా?
వారికి నీతి లేదా?
వారి నీతి వేరా?
వారి ధర్మాలు వేరా?
వివాదాలని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే అవకాశం లేదా?
సంయమనం పాటించరా?
ఆటవిక న్యాయంతో పాశవీక చర్యలకు పాల్పడి, తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడమే వారికి తెలుసా?
ఇదేనా వీరి న్యాయం?
ఇదేనా వీరి ధర్మం?
మరి ఈ చట్టలేందుకు, న్యాయ వ్యవస్థలెందుకు?
ఈ రక్షణ దళాలెందుకు?
నేతలు ప్రవర్తించే తీరు ఇదేనా?
ఇది ప్రజాస్య్వామనిపించుకోదు.
ఇది మంద స్వామ్యం!

ఇది నేటి ఈనాడు లోని వార్త!

3 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar on June 18, 2008 at 8:57 AM   said...

ఈనాడుని నమ్మాలా? లేక సాక్షినా? రెండిటి కథనాలకీ ఆకాశం భూమీ అంత తేడా ఉంది.

మంద కృష్ణ మాదిగ మండిపడింది వై.ఎస్. మీదకాబట్టి సాక్షివాడు వక్రీకరింస్తాడనుకున్నా అందులో తను అన్నది "మరో సారి ఆంధ్రజ్యోతి ముందు ప్రదర్శన చేస్తాం,తరువాత పరిణామాలకు మేను జవాబుదారి కాదు" అని. అది అంత అప్రజాస్వామిక వ్యాఖ్య కాదే!

కాకపోతే ఈనాడు వాడు డైరెక్టుగా బెదిరించినట్టు రాశాడెందుకబ్బా? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.

మేధ on June 18, 2008 at 8:54 PM   said...

అసలు రెండు కధనాలకీ చాలా తేడా ఉంది... సాక్షిలో అలా వ్రాయడానికి కారణం, ఆంధ్రజ్యోతి మీద ఉన్న కక్షా, లేకా ఈనాడులో అలా రాయడానికి కారణం వై.యస్(ప్రభుత్వం) మీద ఉన్న కోపమా....?!

Post a Comment