మీరేమంటారు ?

భారత రాజ్యాగంలో పౌరులందరికి కొన్ని హక్కులున్నవి. చట్టం ముందు అందరూ సమానులే. ఒకరికి ఒక న్యాయము, మరొకరికి మరొక న్యాయము ఉండదు. దళితులపై అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఒక దళితేతరుడు, ఒక దళితుడిని గాని, గిరిజనుడిని కాని బహిరంగంగా అవమానిస్తే అది శిక్చార్హమవుతుంది. అదే ఒక దళత లేదా గిరిజన వ్యక్తి దళితేతరవ్యక్తిని అవమానిస్తే అసాధారణ చట్టాలేవి ఆ వ్యక్తికి అందుబాటులో లేవు.

భారత దేశంలో ఒక పౌరుడు, అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు ఒక "దిష్టిబొమ్మ" ని పేరిడి, కొట్టి, కాల్చీ తన ఆవేదనని, ఆగ్రహాన్ని, నిరసనని తెలియజేస్తుంటాడు.

మొన్న గిరిజనస్త్రీలపై సాముహిక అత్యాచారం జరిగింది.మరి ఈ ప్రభుత్వం ఆ దోషులను ఎందుకని ఈ అత్యాచారనిరోధక చట్టం క్రింద శిక్షించడానికి ప్రయత్నించలేదు?
* * *
పత్రికలు ప్రజలను జాగృతంచెయ్యాలి. చైత్యనవంతులని చెయ్యడంవాటి విద్యుక్తధర్మాలలో ఒకటి. అందుకనే ఇందిరా గాంధి పాలనలో ఎమర్జెన్సి ని విధించి పౌరస్వేచ్చ, పత్రికా స్వేచ్చని నియంత్రిచినప్పుడు, ప్రజాభిప్రాయాన్ని మన్నించిందీ ఈ పత్రికలే! ప్రజలను చైతన్యవంతులని చేసింది ఈ పత్రికలే! ఆ నాటి "కబంధ హస్తాల" పాలన నుండి రక్షించింది ఈ పత్రికలే! కాబట్టి పత్రికా స్వేచ్హకి ఏ మాత్రం భంగం కలిగినా తీవ్రంగా ప్రతిఘటించాలి.

* * *
ఆంధ్రజ్యోతి పత్రిక "బాడుగనేతలు", మే ౨౪న వెలువడ్డప్పుడు, కొంతమంది నేతలకు బాధ కలిగింది. తమ ఆత్మగౌరవాన్ని ఆ పత్రిక అవమాన పరిచిందని భావించారు. ఒక నేతను అవమానిస్తే, ఆ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గాన్ని కూడా అవమానించినట్టే అని భావించి, కొందరు తమ నిరసనని, రాష్ట్ర రాజధాని హైదబాదులోని అంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి, కాల్చివెయ్యడానికి ప్రయత్నించారు. విధ్వంసం సృష్టించారు. ఆ క్రమంలో ఒక ఉద్యోగిని తన ప్రాణాలతో తన సహోద్యుగుల సహాయంతో తప్పించుకో గలిగింది. ఇతర ప్రాంతలలోని, ఆ నేతల అనూనయులు లేదా వారి అనుచరులు కొందరు, కొన్ని దిష్టిబొమ్మలు తయారుచేసి వాటికి, ఆంధ్రజ్యోతి - "రాధాకృష్ణ", సంపాదకుడు శ్రీనివాస్ పేర్లు తగిలించి, చెప్పులతో కొట్టి వాటిని దహించి తమ నిరసనని, ఆ నేతమీద తమకున్న అభిమానాన్ని తెలియజేసుకున్నారు.

ఏ దళితుల ఉద్యమాని తాము ప్రోత్సహించారో, అదే వర్గానికి చెందిన నాయకుడు ఒక పధకం ప్రకారం, తన సిబ్బందిమీద, తన కార్యాలయాల మీద దాడి చెయ్యడానిని గర్హిస్తూ ఆంధ్రజ్యోతి సిబ్బందిలోని కొంతమంది, ఒక "దిష్టిబొమ్మ" ని తయారుచేసి దానిని "దూషించి, అవమానించారు, కాల్చారు."

దళితులమీద అత్యాచార నిరోధక చట్టం క్రింద అది నేరం అంటూ ఆ సంపాదకుడిని, ఆంధ్రజ్యోతి ఎమ్. డి రాధాకృష్ణ , విలేకరులు వంశికృష్ణ, శ్రీనివాస్ ని గూడా అరెస్టు చెయ్యాలని, లేని పక్షంలో తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. నాటకీయంగా, రాత్రిపూట హుటాహుటిన ప్రభుత్వం సంపాదకుడు శ్రీనివాస్‌, విలేకరులు వంశీకృష్ణని,శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసింది.

చట్టం ముందు అందరు ఒక్కటి కాదు అన్నది ఇక్కడ నిరూపితమయ్యింది.

* * *
వై.ఎస్. రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు లాగానే, దళితులు ఆత్మగౌరవంతో జీవించడానికి, కులంపేరు అడ్డంకి కారాదు అంటూ, తన "మాదిగ" కులాన్ని సూచించే పదాన్ని పేరులోనే ఇముడ్చుకుని మంద కృష్ణ మాదిగ గా ఎదుగుతు, బడుగు, అణగారిన వర్గాలకు నేతృత్వం వహిస్తు ఒక సామాజిక ఉద్యమకారుడిగా మారాడు.

మరి పేరులోనే తన కులాన్ని ఇముడ్చుకున్న కృష్ణ మాదిగ, తన కులం పేరుతో తనని ఒక బహిరంగ ప్రదేశంలో దూషించి అవమానించారనడం విడ్డూరం.

* * *
ఇక ఈ సభ్య సమాజంలో దిష్టిబొమ్మలను తగలేసి నిరసనను తెలియజేసుకోలేని పరిస్థితులలో, వ్యక్తుల ప్రాణాలు తీసి, ఆస్తులను విధ్వంసంచేసి, ఒక ఆటవిక న్యాయానికి పోరుబాటను చూపిస్తూ మార్గాన్ని సుగమం చెయ్యాలా?

* * *
ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి కి మంద కృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య తదితరులకి అవినాభావ సంబంధాలున్నవన్న ఆరోపణల నేపధ్యంలో స్వచ్చమైన, మచ్చలేని మేలు జాతి వజ్రం లాంటి వ్యక్తిత్వమున్నవారు ప్రవర్తించే తీరేనా ఇది?

నిజంగానే ఈ నేతలు, ఉద్యమకారులు, అటువంటివారైతే, ఈ అగ్రకుల రాజకీయవేత్తలు తమ రాజకీయ చదరంగంలో వీరిని పావులుగా వాడుకుంటున్నారా?

ఒక వేళ అదే నిజమైతే, వీరి ఉద్యమం గతేమిటి?

ఈ రాష్ట్ర ప్రజల భవితేమిటి?

0 వ్యాఖ్యలు:

Post a Comment