అక్షరం తిరగ బడింది.

అక్షరం ఎదురు తిరగలేదు.
తిరగ బడింది
.

పెన్నుని గన్ను గా పట్టుకుని దేశాన్ని ఉద్ధరిద్దా మని అనుకునే వాళ్ళు కొంతమంది ఐతే, కులాలకతీతంగా, కలాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదిద్దామనుకునే వారు మరి కొందరు. తమ చుట్టు ఉన్న సమాజంలో కుళ్ళుని చూసి, దాని శుభ్రం చెయ్యాలని, తమ చుట్టు పెరుగుతున్న కలుపు మొక్కలని ఏరి పారెయ్యాలాని దానికి ప్రసార మాధ్యమాలైన పత్రికలే తమ అక్షరానికి ఊతం ఇస్తాయని ఆ మార్గాన్ని ఎన్నుకుని మంచి పాత్రికేయులు కావాలని కొంతమంది. నేటి సమాజంలోని ఋగ్మతలకి క్షీణించిన సామాజిక విలువలే కారణం. కాబట్టి, ఉదాత్తమైన విలువలని మళ్ళీ ఈ తరానికి పరిచయంచేయ్యాలంటే మంచి సాహిత్యం కావాలి, మంచి సాహిత్యం అందరికి అందుబాటులో తీసుకెళ్ళాలంటే పత్రికలే తగిన సాధనాలు. ఆ పత్రికా విధులని సరిగ్గా నిర్వర్తించాలంటే దానికి తగిన విద్యార్హతలు నేర్వాలి.


అలాంటి విద్యని మన పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం నేర్పుతున్నది. అందుకని మన రాష్ట్ర రాజధాని ఐన భాగ్యనగరానికి చేరి అక్కడున్న ఆ తెలుగు విశ్వవిద్యాలయం లో ప్రవేశం పొంది, ఉత్తమ పాత్రికేయాన్ని అభ్యసిస్తూ, ఈనాడులోనో, అంధ్రజ్యోతిలోనొ, సాక్షి లోనో ఎదో ఒక తెలుగు పత్రికలో "వార్త" లు రాసే ఉద్యోగం సాధించలేకపోతామా, కలను సాకారం చేసుకోలేక్పోతామా అని ఈ "ఔత్సాహిక భవిష్యత్ పాత్రికేయులు" ఆ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరారు.


కాని వారికి తెలియదు, కరడు గట్టిన స్వార్ధంతో, ముక్కులు పగిలిపొయ్యే దుర్గంధంతో నిండిపోయిన ఆ పొట్టి శ్రిరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి కావల్సినది పని పాటా లేని ఉద్యోగం అనిన్ని, నెలాఖరికి జీతమున్ను, అవి రెండు పుష్కలంగా సర్కారు వారి కొలువులే మాత్రమే దొరుకుతాయి కాబట్టి దానీ చంపేయ్యకుండా, అలాగని పూర్తిగా ఆరోగ్యవంతంగా బతకకుండా ఉంటే, ఇలాంటి విద్యార్ధి దౌర్భాగ్యులు (అవును వారి దృష్టిలో, ఆ విద్యార్ధులందరూ దౌర్భాగ్యులే) వస్తూ ఉన్నన్నినాళ్ళు తమకి, తమ పదవులకి, జీతాలకి ఢోకా ఉండదని వాళ్ళు ఎవేవో కొత్త కొత్త ప్రణాలికలు వేసుకుంటు వచ్చినవాడి చెవులో - పూలు పెడుతూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.


ఇక ఆ పప్పులు ఉడకవని - తెలుగు విశ్వవిద్యాలయానికి పట్టిన తెగులుని తొలగిస్తామని విద్యార్ధులు ఏకంగా తెలుగు విశ్వవిద్యాలయం మీదే దావా వేసారు. బహుశ ప్రపంచకంలో విద్యార్ధులే విశ్వవిద్యాలయం మీద దావా వెయ్యడం ఇదే ప్రధమమైఉండాలి. మన పొట్టి శ్రి రాములు తెలుగు విశ్వవిద్యలయాన్ని అలాగున గిన్నెస్ బుక్ ఒఫ్ రికార్డ్స్‌లోకి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కించిన ఘనత కూడ తెలుగు వారిదే అవుతుంది.

దాని వివరాలు ఇక్కడ చూడండి.

హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే జాలంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం గూడులొని వివరాలన్ని కూడా ఆంగ్లంలోనే ఉన్నవి. అది మన తెగులు విశ్వవిద్యాలయం సంగతి.


నమ్మరా? వెళ్ళి చూడండి! http://www.teluguuniversity.ac.in/
0 వ్యాఖ్యలు:

Post a Comment