మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!

ఉద్యామాలని కించ పరిస్తే ఊరుకోరటండి వీరు.

వారికి స్వేచ్హ కావాలి.

స్వతంత్రం కావాలి.

వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ప్రసార మాధ్యమాలు కావాలి.

వారిని ఆకాశానికేత్తసేటప్పుడు మాత్రమే పత్రికలు కావాలి, టీ వీలు కావాలి.

వారిని ఏ మాత్రం విమర్శిస్తున్నారన్న అనుమానం ఉన్నా,పెట్రొల్ కాని డిజెల్ కాని కిరోసిన్ పోసి, తగలబెట్టే హక్కు కూడా వారికే ఉంటుంది.

అప్పుడు మాత్రం ఆ పత్రికలు పనికి రావు.

ఆ టీ వీలు చూపే బొమ్మలు పనికిరావు.

వాటిలో పనిచేస్తున్న తమ "కులం" వాళ్ళైనా కూడా పనికిరారు.

వాళ్ళందరిని "కాటి" కి చేర్చడానికి కూడా వెనుకాడరు వీరు.

వారు, వారి ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోరటండి.
మంగళవారం 7 వ తేదిన, జూన్ 2008లో, పేజి 8లో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త ఇక్కడ చదవండి.




1 వ్యాఖ్య:

Kathi Mahesh Kumar on June 10, 2008 at 1:41 AM   said...

ప్రశ్నిస్తే, కించపరిచారు అనుకునే ఝాఢ్యం మన జాతి మొత్తంలోనే ఉంది. కృష్ణ మాదిగ దీనికి మినహాయింపు కాడు. ఇక ఇలాంటివి చేస్తేగానీ కావలసినంత మిడియా సమయం, చర్చల్లో విషయాలూ రావుగనక ఇదొక మంచి ఎత్తుగడ మాత్రమే.

Post a Comment