పంద్రాగస్ట్ ఏవిటండి?

స్వాతంత్ర్ర దినోత్సవం అనో లేక  స్వాతంత్ర్ర దినోత్సవము అనో అని అనవచ్చుగా?
తెలుగు ఆంగ్లీకరించబడుతున్నది అని వాపోయే ఈ తెలుగు భాషా ఛాందసవాదులు కాక మళ్ళీ టెల్గు హిందికరించబడుతున్నది అని వాపోవడానికి?
* * *
మంచిగా ఉండు.
మంచిగా చెయ్యి,
బాగా చెయ్యి అని అనవచ్చుగా?
మంచిగా ఎందుకు అనకూడదు అని అంటున్నారా?

మరి "నెనర్లు" అని ఎందుకంటున్నారు?
కృతజ్ఞతలు అనో ధన్యవాదాలనో ఎందుకనటంలేదు?

లేదు ఈ కోస్తావారు, తమ తెలుగుని ఇతరుల మీద రుద్దుతున్నారు,మా మనోభావలు దెబ్బతిన్నవి కాబట్టి, ఆ తెలుగు వాడడానికి వీల్లేదు, మా తెలుగు వాడాల్సిందే అన్న ప్రాంతియ వాదానికి తెరలేపుతున్నారా?

4 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on August 16, 2008 at 7:04 AM   said...

మీరు ఇవ్వాళ్టి ఈనాడు దినత్రిక మొదటి పేజీ చూసారా??

Kathi Mahesh Kumar on August 16, 2008 at 10:41 AM   said...

భాషయొక్క ప్రధమ ఉద్దేశం communication. అది ఏ యాసలో జరిగిన,లేక ఏ మాండలికంలో జరిగినా దానికి విలువలాపాదించిమరీ సమస్యను సృష్టించడం వృధా. హైదరాబాద్ లో ఉన్న అందరికీ "పంద్రాగస్టు" అర్థమవుతుంది, అలాగే తెలంగాణాలో అందరికీనూ. ఈ అర్థమయ్యేవాళ్ళ సంఖ్యచాలు mainstream media లో ఈ పదాన్ని ఉపయోగించడానికి.

netizen నెటిజన్ on August 16, 2008 at 6:48 PM   said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: చూడలేదు, రాజేంద్ర! చెప్పండి, ఏవిటి విషయం! అనంతోత్సాహమా!
@కత్తి మహేష్‌కుమార్: "...లో జరిగినా దానికి విలువలాపాదించిమరీ సమస్యను సృష్టించడం వృధా." ఇంకొంచెం వివరించగలరా?

సుజాత వేల్పూరి on August 18, 2008 at 2:50 AM   said...

పంద్రాగష్టు పక్కా హైదరాబాదు మాట. "మంచిగా" కూడా ఇక్కడిదే! 'మంచిగున్నావా' అని కూడా ఇక్కడే అడుగుతారు మరి!

నెనర్లు అనే మాట కేవలం తెలుగు బ్లాగర్లు మాత్రమే ఉపయోగించే మాట. దాన్ని కూడా కొంతమంది బ్లాగర్లు వ్యవహారికంగా భావించలేక వాడటం లేదు(వారిలో నేనున్నాను) హైదరాబాదులో రకరకాల యాసలు, భాషలు కలగలిసి ఎటుకాని భాష ఏర్పడింది.(ఆంధ్రాలో అన్ని జిల్లాల వాళ్ళ గమ్యమూ హైదరాబాదే కాబట్టి ఇవన్నీ తప్పవు)

Post a Comment