కాలిన్‌ ని చంపేసారు.

Posted by netizen నెటిజన్ on Thursday, August 21, 2008
అవును.
కాలిన్‌ని చంపేసారు.
కాలిన్ బ్రతుకాలని తన వాళ్ళతో కలిసి హాయిగా ఉండాలని ఎంత కోరుకున్నానో!
కాని లాభం లేక పోయింది.

కాలిన్ ఒక తిమింగలం లాంటి చేప పిల్ల. ఆంగ్లంలో whale (వేల్) అంటారు.
ఆరు నెలల బాలుడు.
కాలిన్ కి ఒక అమ్మ ఉంది.
ఒక నాన్న కూడ ఉన్నాడు.
కాలిన్ ఇంకా తల్లి పాలమిదే బ్రతుకుతున్నవాడు.
కాని ఎందుకనో ఆ తల్లి ఈ బిడ్డని దగ్గిరకు తీసుకోలేదు.
కాలిన్ అప్పుడు సిడ్ని దగ్గిరలోని చిన్న నౌకని తన తల్లిగా భావింది పాల కోసం వెతుక్కుంటూ ఉంటే, ఆస్ట్రేలీయన్ పర్యావరణ శాఖ వారు సముద్రంలోకి మళ్ళించినా, కాలిన్ వెనక్కి తిరిగి మళ్ళి ఆ సముద్రతీరానికే చేరుకుని ఆక్కడి పడవలని, ఒదలకుండా వాటి చుట్టే తిరుగుతు ఉండటం కనపడింది. కాలిన్‌కి కొన్ని గాయాలు కూడ ఐనవి.
సముద్రంలో ఒంటరిగా ఉన్న జీవులు బ్రతకడం కష్టం. అందులో కాలిన్ లాంటి పసి పిల్లలు.
అందుకని ఆ పర్యావరణ శాఖా వారు సాధ్యమైనంతవరకు కాలిన్‌కి తగిన చికిత్స చేసి బ్రతికిద్దామనే అనుకున్నారంట.
కాని తగిన ఆహరం లేక నీరసించిపోతూ, మరణానికి చేరువలో ఉన్న కాలిన్‌ని ఇక చంపేసి వాడిని బాధల నుండి గట్టేక్కించేయ్యడమే మెరుగని బావించినట్టున్నారు.
అందుకనే కాలిన్‌ ని చంపేసారు.
తప్పదేమో, నిజమే కాని ..
ఏవిటో నిన్నటినుంచి మనసు మనసులో లేదు.
అదే మన బిడ్డ ఐతే...

తాజాకలం: కాలిన్ మగ చేప పిల్ల కాదు. చనిపోయిన తరువాత స్త్రీ జాతి ది అని తెలుసుకున్నారు. (25 Aug 08)

4 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on August 21, 2008 at 11:51 PM   said...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి,విశాఖపట్నం,
మీ ఆవేదన తో నేనూ పాలుపంచుకుంటున్నా నెటిజన్ గారు,ఒక్క కాలినే కాదండీ,ఇవ్వాళ లోకంలో ఎన్నిచావులు ఇలా జనం కాస్తున్నారో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది,ఆ సి యాన్ యాన్ వాడు ఇచ్చాడు కాబట్టి ఇది మీకూ నాకూ తెలిసింది.

సుజాత on August 22, 2008 at 7:03 PM   said...

మరి అది పాలు లేకపోతే బతకదు. తల్లే దగ్గరకు తీయనపుడు వేరే జలచరాలు దగ్గరకు తీసి స్తన్యం ఇస్తాయని ఎలా భావించగలం? మెర్సీ కిల్లింగ్ గా భావించాలి కాబోలు దీన్ని!పెద్ద శరీరంతో తిరుగుతున్న ఆ పసిపిల్లని చమేసి ఒక మంచి పని చేసారు. తిండి లేక నీరసించి ఇతర జంతువుల పాలిట బడి కృరంగా చావకుండా ఈ పని చేశారు. బాధ పడటం తప్ప ఏమీ చేయలేం!

netizen నెటిజన్ on August 24, 2008 at 5:08 AM   said...

అదే మన బిడ్డ ఐతే...అంతేనా సుజాత గారు?

సుజాత on August 25, 2008 at 6:07 PM   said...

ఎవరి బిడ్డ అయినా ఇక చేయడానికి వేరే ఏమీ లేనప్పుడు ఏమి చేస్తాం చెప్పండి? కాలిన్ అలా ఓడ సమీపంలో నీళ్లలో ఈదుతుంటే ఎంత జాలేసిందో! మా పాప కూడా ఉత్సాహంగా చూసింది. కానీ దాన్ని చంపేసారని చెప్పలేదు, ఏడుస్తుందని.

ఇంకో విషయం! ఒకవేళ అది మన బిడ్డే అయితే ప్రాణాలు ఒడ్డి అయినా దాన్ని కాపాడటానికి 'ఇంకా ' ఏమైనా చెయ్యగలమేమో చూసేవాళ్లమేమో! ఎవరి బిడ్డ అన్నమాట అటుంచి, కనీసం మనిషి అయినా కాదాయెను!మనుషులకే దిక్కులేని ప్రపంచంలో ఒక జలచరం గురించి ఇంతగా ఆలోచించేవాళ్లెవరు చెప్పండి? మనలో సగం మంది ఆ వార్తనే చూళ్లేదు మరి!

Post a Comment