లలిత ఇక లేదు!

Posted by netizen నెటిజన్ on Wednesday, August 27, 2008
లలిత చనిపోయిందని పొద్దులో చదవగానే బాధవేసింది. తను అనారోగ్యంతో ఉన్నదని ఊహించుకోగలిగాను కాని మరణానికి అంత చేరువలొ ఉన్నదని అనుకోలేదు.

"రౌద్రి" కన్నా నేను తన ఆంగ్ల బ్లాగుకే దగ్గిరయ్యాను. అదే అఖరుసారి అని తెలియనప్పుడు, నేను తన బ్లాగ్ లో వ్యాఖ్యానించినప్పుడు, ఎంతో సాదరంగా, స్వాగతించింది లలిత. శ్ర్రీపాద వారి కొత్త అవకాయ, వెన్నపూస రుచుల గురించి ప్రస్తావించింది. తనకు తెలియకపోవచ్చు కాని తన అంగ్ల టపాలు ఏవి నేను వదలలేదు. కాని ఇప్పుడనిపిస్తున్నది, అయ్యో, అవకాశం ఉన్నప్పుడు తనని కనీసం వ్యాఖ్యల ద్వారా ఐనా పలకరించలేక పొయ్యానే అని!

"వ్యూలు - రివ్యూలు" లో కూర్పరి చలసాని ప్రసాద్, శ్రీ శ్రీ పుస్తక పరిచయాలు, సమీక్షలు ప్రచురించాడు. అందులో, శ్రీ శ్రీ, లలిత వ్రాసిన కవిత్వ సంకలనం - "నిశీధి సంగీతం" (Dark Rhapsody) కి ఒక "ప్రివ్యూ" చూపించాడు. లలిత పుస్తకాలు చేతికి అందుబాటులొ లేవు, కాని ఈ పుస్తకం ఉంది.

అందులో శ్రీ శ్రీ లలిత గేయాల గురించి అన్న కొన్ని మాటలు:

*

ప్రివ్యూ

"రౌద్రి" కలం పేరుతో రాస్తున్న ఈ రచయిత్రి ఆరుద్ర రెండవ కూతురు భాగవతుల లలిత. బహుశ ఈ యధార్ధాన్ని నేను బయటపెట్టకూడదేమో? అయినా ఇంగ్లిష్‌లో "నెత్తురు నీటికన్నా చిక్కన" అనే నానుడి వుంది. భాగవతుల వంశంలో నాది తల్లివైపు చుట్టరికం. ఈ రక్త సంబంధమే మళ్ళీ మా ఇంట్లో కవితాసౌరభం గుబాళిస్తున్నదన్న విషయాన్ని గోప్యంగా ఉంచనివ్వడంలేదు.

And now, I shall permit myself for a moment to forget that the writer of these poems is my grand niece. Seeing before me a group of poems of unequal length as well as merit, I attempt an objective appraisal of their value as poems.

"ఏమీ కనిపించని చీకటిలో చెవులకు మాత్రమే వినిపించే సంగీతం ఇందులో ఉన్నది."

*
ఇంకా చాలా వ్రాశాడు కాని, ఆయన ఆ మొత్తం పాఠం ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు.

ఏది ఏమైనా ఒక మంచి మిత్రురాలు దూరం ఐపోయింది.
బ్లాగు ప్రపంచంలో కూడా జనన మరణాలు ఉంటవి అన్నది కఠోర సత్యం.

Labels:

5 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on August 27, 2008 at 11:54 AM   said...

మీ విషాదాన్ని నేనూ పంచుకుంటున్నాను

సుజాత వేల్పూరి on August 27, 2008 at 9:32 PM   said...

లలితా ఆరుద్ర చాలా ఏళ్ల క్రితం వనిత మాసపత్రికలో వ్యాసాలు, కవితలు రాసేవారు. (ఆ పాత కాపీలు మా ఇంట్లో ఉన్నాయేమో అమ్మనడగాలి)విషాద కరమైన వార్తే!

కామేశ్వరరావు on August 28, 2008 at 2:26 AM   said...

నేను కలకత్తాలో చదువుకుంటున్న రోజుల్లో మాకు KKM (Kalyan Kumar Mukherjee) ఓ సెమెస్టరు పాఠాలు చెప్పారు. మా క్లాసులో బాగా చదివే ఇద్దరు కుఱ్ఱాళ్ళు అతని దగ్గర విడిగా పాఠాలు చెప్పించుకొనేవారు(advanced topics). వాళ్ళోసారెప్పుడో చెప్పారు KKMవాళ్ళ భార్య తెలుగావిడే. వాళ్ళ నాన్నగారు తెలుగులో పెద్ద పేరున్న కవిట అని. అహా అని ఊరుకున్నాను. ఇదెప్పుడో పదిహేనేళ్ళ కిందటిమాట.
నేను బ్లాగులగురించి తెలుసుకున్న కొత్తల్లో (అంటే సుమారు ఏడాదిన్నర కిందట), నేను చూసిన మొట్టమొదటి బ్లాగు, నాకు గుర్తున్నంతవరకూ లలితగారిదే. చాలా ఆసక్తిగా ఆవిడ ఇంగ్లీషు, తెలుగు బ్లాగులు చదివాను. చదువుతున్నప్పుడు తెలిసింది, ఆవిడ ఆరుద్రగారి అమ్మాయేనని, ఆవిడే మా ప్రొఫెసరుగారి భార్యని! అయినా పరిచయమంటూ ఏదీ పెంచుకోలేదు. ఒక అజ్ఞాత అభిమానిగా మిగిలిపోయాను.
ఇప్పుడీ వార్త చదివి అవాక్కయ్యాను! ఆవిడకి అనారోగ్యమని తెలుసుకాని ఇంత ప్రాణాంతకమని తెలీదు.
ఆవిడ రాసే టపాలు అందంగా ఉండేవి, ఆత్మీయంగా ఉండేవి, ఆలోచనాత్మకంగానూ ఉండేవి!
One of the posts I liked most - "When women make advances" (http://lalitalarking.blogspot.com/2007/07/when-women-make-advances.html)

netizen నెటిజన్ on August 28, 2008 at 11:10 AM   said...

@కొత్తపాళీ & @ రాజేంద్ర: ఏం చెప్పమంటారు!
@సుజాత: ఆంధ్రపత్రికలో కూడా!
మీ లాప్‌టాప్ సక్రమంగా పనిచేస్తూన్నదా?
@భైరవభట్ల కామేశ్వర రావు: నిజమే!

Post a Comment