వారం, వారం ఆంధ్రజ్యోతిలో బ్లాగ్లోకం..కాదు కాదు..బ్లాగ్‌లోకం

ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఇక నుంచి మంచి, మంచి బ్లాగులని తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యడానికి నడుం బిగించింది. తెలుగు బ్లాగులకి మాత్రమే పరిమితమవ్వడం లేదు.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్   వారి బ్లాగ్ పరిచయంతో ఈ ఆదివారం అంటే నిన్న మొదలుబెట్టారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
ఇక మీ బ్లాగులని గురించి కూడా వారికి తెలియజెప్పుకోవచ్చు.
తిన్నగా వారికే వేగు పంపవచ్చు.
మీ బ్లాగు వివరాలతో వారికి పంపండి - navyajyothy@gmail.com.
*  ఈ ఆదివారం అంటే నేడు 21సెప్టెంబరు 2008 నుండి బ్లాగ్లోకం - బ్లాగ్‌ లోకం అయ్యింది.

17 వ్యాఖ్యలు:

Anonymous on September 8, 2008 at 4:46 AM   said...

మొత్తానికి ఒక పత్రిక గుర్తించింది, మంచి కబురు! ఇలాంటిది వేరే ఏ పత్రికైనా ఇప్పటికే రాస్తోందా నెటిజెన్ గారూ?

Anonymous on September 8, 2008 at 6:30 AM   said...

@ చదువరి: సాక్షి కి కూడా ఆ ఆలోచన ఉన్నట్టుంది!

Nikhil on September 8, 2008 at 8:03 PM   said...

బ్లాగులకు ...ఉందిలే మంచీ కాలం ముందు ముందూనా అనిపిస్తోంది.
నిన్న మొన్న రెక్క విప్పిన హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగు అప్పుడే జాక్ పాట్ కొట్టేసింది.
సమాచారం అందించిన మీకూ, శాస్త్రీయ ఆలోచనలను పంచే హెచ్‌బిటి కీ అభినందనలు.

netizen నెటిజన్ on September 9, 2008 at 2:16 AM   said...

@కత్తి మహేష్ కుమార్: ఇంకొ పది మందికి తెలిస్తే, ఇంకొన్ని మంచి టపాలు వెలువడే అవకాశం, ఇంకొంత తెలుగు వ్యాప్తి, ఏమంటారు?

Kathi Mahesh Kumar on September 9, 2008 at 3:32 AM   said...

@ నెటిజన్: తప్పకుండా అంతకంటేనా !

netizen నెటిజన్ on September 9, 2008 at 5:16 AM   said...

@బొల్లోజు బాబా:ఏం బాగుంది? ఏది బాగుంది? :)

Bolloju Baba on September 9, 2008 at 8:54 AM   said...

the concept of reviewing the blogs in the main stream print media is welcome and a fine gesture from that side.

this is bagumdi netijen gaaru.

bolloju baba

కొత్త పాళీ on September 9, 2008 at 10:36 AM   said...

సంతోషించాల్సిన వార్త. నాకు తెలిసినంతలో కంప్యూటర్ మరియు వెబ్ వ్యవహారల గురించి క్రమం తప్పకుండా ఫీచర్లు నడుపుతున్న పత్రిక ఆంధ్రజ్యోతి ఒకటే.
బైదవే నెటిజన్ గారు, కటువుగా అనిపిస్తే మన్నించండి, ఈ రంగులు ఘోరంగా ఉన్నాయి!

netizen నెటిజన్ on September 9, 2008 at 10:45 AM   said...

@కొత్తపాళీ: మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నెనర్లు!
ఆ పైనెక్కడో ఒక "పోల్" విడ్ఝె‌ట్ ని చూసారా?
రంగుల గురించి కూడా అక్కడ ఉంది.
రంగులు మార్చాలి. మార్చాలి అంటే రంగు పడుద్ది మరి.
:)
కొంచెం ఆలస్యం అవుతుంది. కాస్తా ఓపిక పట్టండి మాస్టారు!

Post a Comment