మోహన్ చంద్ శర్మ

Posted by netizen నెటిజన్ on Saturday, September 20, 2008
సెప్టంబరు 19 న, శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్‌‍చంద్ శర్మ (41) వీరమరణం చెందారు. ఎన్‌కౌంటర్‌లో శర్మకు కడుపు, తొడ, కుడిచేతి భాగాల్లో తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందానికి నేతృత్వం వహించిన శర్మ పోలీసు శాఖలో సమర్థుడైన అధికారిగా పేరుపొందారు.  ఆయన గతంలో రాష్ట్రపతి నుంచి సాహస పతకంతోపాటు ఏడు పోలీసు పతకాల్ని అందుకున్నారు. 35 మంది తీవ్రవాదులను హతమార్చడం, 80 మందిని అరెస్టు చేయడంలో శర్మ కీలకపాత్ర పోషించారు.  
2005 లో  తమిళనాడులో జరిగిన తీవ్రవాద ప్రేళ్ళుల పరిశోధనలోను శర్మ పాత్ర తక్కువదేమి కాదు.  
ఏది ఏమైనా తీవ్రవాదులను ముట్టడించడానికి బయలుదేరిన శర్మ రక్షణ కవచాన్ని ధరించకపోవడం దురదృష్టకరం.

3 వ్యాఖ్యలు:

సుజాత on September 21, 2008 at 6:33 AM   said...

ఇటువంటి వీరులే పోలీసుల పట్ల ఇంకా ప్రజల్లో నమ్మకాన్ని సంజీవంగా ఉంచుతున్నారు. శర్మ కు శ్రద్ధాంజలి మళ్ళీ ఘటిస్తున్నాను.

chaduvari on September 22, 2008 at 8:15 AM   said...

మోహన్‌చంద్ శర్మ ఎంతటి ఘటికుడో ఆయన ఎదుర్కొన్న, చంపిన ఉగ్రవాదుల సంఖ్యను బట్టి మనకు తెలుస్తూంది. నిస్సందేహంగా మనమో సాహసికుణ్ణి కోల్పోయాం. మనం ఆయనకు ఋణపడి పోయాం.

ఉమాశంకర్ on September 22, 2008 at 11:12 AM   said...

వారి త్యాగం వృధా కాకూడదని ఆ దేవుని ప్రార్ధిస్తూ ....నా శ్రద్ధాంజలి

Post a Comment