చావు

Posted by netizen నెటిజన్ on Tuesday, September 30, 2008
ఆగకుండా ఎడం కాలిడ్చుకుంటూ "ముసల్ది మొన్న చచ్చిపోయిందంటగదా," అంటూ సాగాడు.
"ఎవరన్నారూ,అక్కాయి పోయిన నెలకి మధు పోయింది".
"ఏమిటొ, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పొయ్యే వాళ్ళు పోతుంటారు. నువ్వేమి అధైర్యపడమాకు, మేమందరమూ లేమూ".
"నేను, చిన్నాని, మొన్న ఎక్కడో విన్నాను, ఎవరికో బాగోలేదని..".
"మరి రామాపురంలో ఇల్లు ఎవరికి వ్రాసింది, అత్తయ్య?"
"పంపేసావంటగా? ఏం రోగం?"
"అదే, మొన్న విన్నాను. ఊళ్ళో లేను. సారి, వాజ్ ఇట్ పైన్‌ఫుల్?".
"హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యింది?"
"నువ్వు బాంబేకో, చెన్నైకో తీసుకెళ్ళాల్సింది. మొన్న లక్షి మొగుడ్ని అదే అస్పత్రిలో చేర్చారు. మూడో రోజుకి చచ్చూరుకున్నాడు".
"నేను రాలేన్రా, బోర్డ్ మీటింగ్ ఉంది. రాఘవన్‌కి చెప్పాను. డబ్బు తీసుకో, కార్లు రెండు పంపుతాడు. ఇంకా ఎవన్నా కావాలంటే రెడ్డికి చెప్పు. అన్ని చూస్తాడు. జాగ్రత్త. పరిమళ వస్తుందిలే."
" ముందే ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం తో జాగ్రత్తపడిఉంటే బాగుండేది."
" నా వల్ల కాదు అంటున్నాడు. వాడు మిగతవాళ్ళతో షేర్ చేసుకోవాలంట. వెయ్యికి తగ్గనంటున్నాడు."
"రామారావుకి ఫోను చెయ్యండి. ఆయనకి పరిచయాలున్నాయి."
"ఆ బంగారం అది ఎక్కడ ఉంది? అంతేలే. చాలా జాగ్రత్త మనిషికి."
"శవాన్ని ఇంట్లో పెట్టాడానికి వీల్లేదండి."
"ఇవి ఫ్లాట్లు కదా, పదిమంది, పది అబిప్రాయలతో, నమ్మకాలతో ఉంటారు. మరేం అనుకోవద్దు. ప్లీజ్, మీకు అన్ని తెలుసు."
"బెడ్ షీట్ కోసం వచ్చాం అమ్మా. బాడితో పాటూ మా బెడ్‌షీట్ కూడ వచ్చేసింది. ఉంచుకుంటే ఉంచుకొండి, ఒక ఫైవ్ హండ్రడ్స్ ఇప్పించండీ".
"కాఫీ తాగుతారా, టీ ఇవ్వమంటారా".
" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".

"Mother" (అమ్మ) మీద జిమ్మి ఆస్మండ్ పాడిన ఒక పాట ఇక్కడ వినండి.
* ఇది నూటయాభైయ్యవ టపా!


Reblog this post [with Zemanta]

21 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on September 30, 2008 at 8:50 PM   said...

మూడు యాభయైలకు గాను ముందుగా అభినందనలు,ఎవడు బతికేడు మూడు యాభయైలు అన్నది సామెతే గానీ,పాతది,ఎవరు రాసారు మూడు యాభయైల టపాలు అన్నది ఇకనుంచి మనం(తెలుగు బ్లాగరలం గుర్తుంచుకుందామా అనిపిస్తుంది)
ఇక టపా విషయానికి వస్తే చాలా దాఋణమైన సబ్జెక్టను ఇంకా డ్రై గా రాసారు.
నువ్వేమి అధైర్యపడమాకు, మేమందరమూ లేమూ-- నువ్వేమీ దిగులుపడమాకుమేమందరం ఉన్నంగా
"ఆ బంగారం అది ఎక్కడ ఉంది? అంతేలే చాలా జాగ్రత్త మనిషికి."
ఆ బంగారం,అదీ ఎక్కడుందో,అసలే మనిషికి జాగ్రత్త ఎక్కువ

" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".
అత్యంతభీభత్సవాక్యాలు.

సుజాత on October 1, 2008 at 4:57 AM   said...

గుండెల్లోంచి సన్నగా భయం...కాదు టెర్రర్ బయల్దేరింది చదువుతుంటే!వాస్తవ దృశ్యాన్ని అంగీకరించడానికి మనసు మొరాయిస్తోంది.

సుజాత on October 1, 2008 at 5:02 AM   said...

నూట యాభై టపాలా? యాభై చేరడానికి ఎన్నాళ్ల బట్టీ దేకుతున్నా తీరం చేరడం లేదు. అభినందనలండి!

నిషిగంధ on October 1, 2008 at 5:42 AM   said...

చావు కంటే భయంగా ఉంది :((

నూటయాభై టపాలకు అభినందనలు

Anonymous on October 1, 2008 at 6:13 AM   said...

మంచి టెక్నిక్ నెటిజన్. హృదయవిదారకమైన విషయానికి గల ఎన్నో కోణాలూ ఎంత సాధారణమైన మాటల్లో చెప్పొచ్చో చూపించారు. 150వ టపాకీ, అది ఇంత మంచి టపా అయినందుకూ అభినందనలు.

Purnima on October 1, 2008 at 9:18 AM   said...

మీ టపా విషయమై నేను ఏమీ రాయలేకున్నాను. ఇక నూట యాభై పోస్టుకి అభినందనలు!

భైరవభట్ల కామేశ్వర రావు on October 1, 2008 at 10:17 AM   said...

నా చావుని నాకు కళ్ళారా చూపించినట్టనిపించింది!
దానికి మీపై ఆగ్రహించాలో, కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలీటం లేదు.

teresa on October 1, 2008 at 12:18 PM   said...

Nice technique to lay down 'Home truth'..
congrats on a quality job!

రాధిక on October 1, 2008 at 1:28 PM   said...

ఒక పెద్ద నిట్టూర్పు..... ఒకరి కధ పూర్తయింది.ఏదో ఒక రోజూ నా కధా ముగింపుకొస్తుంది.

Anonymous on October 2, 2008 at 6:43 AM   said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ఒక్క అల్పవిరామంతో, కొత్త అర్ధాన్ని స్ఫురింపజేసారుగా!

@సుజాత: రాసేటప్పుడు (?) వేళ్ళు వణికినవి అంటే నమ్ముతారా? కాని అదే పచ్చి నిజం.

@కొత్తపాళీ: నెనర్లు.

@నిషిగంధ: భయం ఎందుకు? అందరం అనుభవించే వారమే కదా.

@tethulika: ఈ టపా మిమ్మల్ని మెప్పించినందుకు సంతోషం. మరో టపా ఆకలి చదివారా? మీ అభిప్రాయం తెలియజేయండి - నిర్మోహమాటంగా, నిష్కర్షగా!

@Purnima: ఔను. ఒకొక్క సారి, ఏం "కమ్మెంట"లో తెలియదు, కదూ! :)
నూట యాభై టపాలు అన్నది - బ్లాగరు వాడు చెప్పింది.

@teresa; థాంకులు.

@ రాధిక: దయచేసి అలా ఆలోచించకండి.
@ @భైరవభట్ల కామేశ్వర రావు: మీకు విడిగా జవాబు.

Anonymous on October 2, 2008 at 6:54 AM   said...

@భైరవభట్ల కామేశ్వర రావు గారికి: నమస్కారములు. మీ వ్యాఖ్య మస్థిష్కంలో ఒక పెను తుఫానుని రేపింది. మిమ్మల్ని ఈ టపా ఇబ్బంది పెట్టినందుకు క్షంతవ్య్వుడ్ని. కృతజ్ఞతలొద్దు. ఆగ్రహం అంతకంటే ఒద్దు. మనస్ఫూర్తిగా క్షమించాననండి. అది చాలు.

ramya on October 2, 2008 at 8:39 AM   said...

అంతే అంతకు మించి మరింకేం ఉండదు!

రాజేంద్రగా్రి మాటే నాదీ" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".
అత్యంతభీభత్సవాక్యాలు.

భైరవభట్ల కామేశ్వర రావు on October 2, 2008 at 8:43 AM   said...

నెటిజన్ గారు,
కదిలేదీ, కదిలించేదీ లాగానే గుచ్చేదీ, గుండెను పిండేసేదే కదండీ కవిత్వమంటే. నేను పొందిన అనుభూతిని ఉన్నదున్నట్టు చెప్పడమే నా వ్యాఖ్యలోని ఉద్దేశం.
ఆగ్రహించాలా, కృతజ్ఞతలు చెప్పుకోవాలా అని నేననడంలో నా ఉద్దేశం, మీ కవిత నన్నెంతగా కుదుపిందో చెప్పడానికే. అలాంటి మంచి కవిత రాసిన కవి పాఠకులని ఎప్పుడూ క్షమాపణలు కోరకోడదు.
కుదుపు నుంచి బయటపడ్డాక, కవితలో మీరెన్నుకున్న శిల్పాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను!

te.thulika on October 2, 2008 at 10:08 AM   said...

ఆకలి కూడా చదివేనండీ. మీరు అడిగారు కనక చెపుతున్నాను. అప్పుడు వెంటనే వ్యాఖ్య రాయకపోవడానికి కారణం ఏమీ లేదు. కానీ ఈకథ నేను రాసిన మరోకథ (అంతిమక్షణాలు) మనసులో మెదిలినందున వెంటనే రాసేను. అంతే. రెండు కథలకీ మీరు వాడిన శైలి ఒకటే. అంటే నాకు రెండూ నచ్చేయి. ఇంకా మంచి కథలు వస్తాయని ఆశిస్తూ ..
ఇది మూడోసారి నాప్రయత్నం కామెంటడానకి. ఎకౌంటు పేచీ పెడుతోంది

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on October 5, 2008 at 2:44 AM   said...

మీరు 150 టపాలు రాసినా ఇప్పటిదాకా అటో ఇటో తెలియనిచ్చారు కారు.

netizen నెటిజన్ on October 5, 2008 at 10:01 PM   said...

@te.thulika:మీ కధ అంతిమ క్షణాలు ఎక్కడ చదవవచ్చు?

Anonymous on October 6, 2008 at 3:58 AM   said...

@భైరవభట్ల కామేశ్వర రావు:మీ అభినందనలకు కృతజ్ఞతలు.

te.thulika on October 6, 2008 at 12:40 PM   said...

వెటిజన్. నా తె.తూలికలోనే. మొన్న చూసాను ఫైలు కరెప్టు అయిందని. మళ్లీ పెట్టేను. మీకు వీలయితే కాస్త చూసి చెప్పండి. హెచ్చరికః కాస్త హాస్యం మిళితమయింది. :)

Anonymous on October 8, 2008 at 10:24 AM   said...

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: "..ఎవడు బతికేడు మూడు యాభయైలు అన్న" సామెతని - 'సిప్రాలి'(రెండవ ముద్రణ* ఫిబ్రవరి ౨౦౦౮)లో నాలుగవ పేజిలో "మా వూరి సామెత" గా వేసారు. విశాఖ మీ వూరు కాబట్టి అది మీ వూరి సామెత గాను,"ఎవరు రాసారు మూడు యాభయైల టపాలు" అన్నది ఇకనుంచి ఈ బ్లాగ్ ప్రపంచికంలో మీ పేరుతో చెలామణిలోకి రావాలని అకాక్షింస్తూ, తెలుగు బ్లాగరలందరు మీ పేరుమీదుగా దానిని వ్యాప్తిలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుం..

* విరసానికి కూడా, అందులో శ్రీ శ్రీ పుస్తకం కోసం ఇలాంటి పని చెయ్యాల్సివచ్చినందుకు కొంచెం బాధ పడుతూ..

Post a Comment