సాహిత్యాభిమానులకి శుభవార్త

సాహిత్యాభిమానులకి అందులోను కుటుంబరావు సాహిత్యాన్ని అభిమానించేవారికి శుభవార్త -  కొడవటిగంటి కుటుంబరావు శత జయంతి వచ్చే సంవత్సరమే ౨౦౦౯లో.  అందుకని వారి సమగ్రమైన సాహిత్యాన్ని మళ్ళీ పునర్ముద్రిస్తున్నారు.

చలసాని ప్రసాద్, కృష్ణబాయి గారలు (విరసం) ఈ ప్రచురణలకు కూర్పరులుగా ఉంటారు.

మొత్తం సాహిత్యాన్ని అంటే, కుటుంబరావు నవలలు, కధలు, నాటికలు, లేఖలు వగైరా ౧౬ సంపుటాలుగా వెలువరిస్తున్నారు.  అన్ని కలిపి మూడువేల రూపాయలు అవుతవి.
 
కాని, పూర్వ ప్రచురణ ధర రెండువేల రూపాయలే.  అంటే, ౩౩-౩౩% తగ్గింపు అన్నమాట.   పూర్తి వివరాలకి ఇక్క డ చదవండి
                                                                      
*నేటి "సాక్షి" లో వార్త ఆధారంగా

5 వ్యాఖ్యలు:

Purnima on October 6, 2008 at 1:55 AM   said...

మొన్న విశాలాంధ్ర వారిని అడిగితే, ఇంకా చాలా సమయం పడుతుంది ఈ పుస్తకాలు వచ్చేసరికి అన్నారు.

మీరందంచిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. ధన్యవాదాలు!

Rajendra Devarapalli on October 6, 2008 at 5:05 AM   said...

మరి కొందరేమో గుంటూరు జిల్లావాడంటున్నారు,కుహనాలౌకిక వాదనీ,కాస్త మార్క్సిస్టనీ అదనీ ఇదనీ .....:)

కొత్త పాళీ on October 6, 2008 at 5:43 AM   said...

You (or Sakshi paper) stole my thunder. I was just about to announce this :(
Anyway, the important thing is to get the word out.

Anonymous on October 6, 2008 at 10:36 PM   said...

@పూర్ణిమ: నెనర్లు..:)

@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ఆంధ్ర పారిస్ అని తెలుగువాళ్ళు పిలుచుకునే తెనాలి, గుంటూరు జిల్లాలో ఉంది. కుటుంబరావు గారు ఆ ఊరి వాడే, పైగా మీ పొన్నురు పక్కనే గదా!

కుహానా లౌకికవాదా?
ఎవరన్నారు ఆ మాట?
మరి దానికి మీరేమన్నారు?
కాస్త మార్క్సిస్టా?
మరి మిగతాదంత ఏ'ఇస్టు"?
మీ ఊరి వాడేగా - చలసాని ప్రసాదు - కుటుంబరావు సాహిత్య కూర్పరి - విరసం సభ్యుడు - అయనకి చెప్పండి! మొబైల్ నెంబరివ్వమన్నారా? ఎవరి నోటి దురద వారిది.

పొద్దున "సిప్రాలి" తిరగెస్తుంటే అక్కడ కనపడ్డది - మీ ఊరి సామెత!

కొత్త పాళీ: ప్రకటనలదేముంది?
కుటుంబరావుగారి "చదువు" మీద ఒక వ్యాసం వ్రాయండి. మొన్నే సుజాత గారి బ్లాగులో పెద్ద చర్చ లేవదీసారు. లేదు, హెచ్.బీ. టి వారు సమ్మర్ హిల్ల్ ని పరిచయం చెయ్యండి. మీలాంటి వారు అటువంటివి చేస్తే బాగుంటుంది. కనీసం అలాంటివి ఉన్నవని ఐనా వీళ్ళలో కొందరికి తెలుస్తుంది.

Rajendra Devarapalli on October 8, 2008 at 6:02 AM   said...

ఎవరన్నారో ఇప్పుడు పేర్లెందుకులెండి,
సిప్రాలి లో మాఊరి సామెతా?!

Post a Comment