అప్పుడు, ఇప్పుడు, రేపు

Posted by netizen నెటిజన్ on Sunday, December 21, 2008
ఇంకో రెండు రోజుల్లో ముంబాయి దాడి మొదలై నెల పూర్తి అవుతుంది.

కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు  ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్  వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.


ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరి‌ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్‌కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.

కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.

కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.

కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.

కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?


కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?

లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?


నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?

నిద్రొస్తొందా?

పడుకో.
జోలపాట పాడ మంటా వా?

నీకు సిగ్గుందా?

5 వ్యాఖ్యలు:

నేస్తం on December 22, 2008 at 3:40 AM   said...

ఇలా మరీ direct గా రాసేస్తే ఎలా చెప్పండి :) సమాధానం లేని ప్రశ్నలు అనుకోవాలో మనకి సిగ్గులేదనుకోవాలో :)

స్నేహ on December 22, 2008 at 6:16 AM   said...

బాగా చెప్పారండి.అందరి సంగతేమో గాని నేను మర్చిపోలేదు. నా బాధ్యత నాకు గుర్తువస్తూనే వుంది. మార్పు కోసం నా వంతు ప్రయత్నం చేస్తూనే వున్నాను.మార్పు రాజకీయనాయకుల మీద రాళ్ళేసుకుంటేనో, బ్లాగుల్లో టపాలు రాసుకుంటేనో రాదు. మనకు సమస్య గా కనిపించిన ప్రతిదానికి పరిష్కారం మన చేతుల్లొనే వుంటుంది. దాని కోసం మన ప్రయత్నం మనం చేస్తూ వుండాలి.

snehamolakatalla.wordpress.com

Anonymous on December 22, 2008 at 7:56 AM   said...

భలే రాస్తారండీ మీరు,ఇందులో చాలా వాటికి రిఫెరెన్సులు నాకు తెలీవు కానీ చదవడానికి అవి అభ్యంతరకరంగా లేవు. చకచకా సాగిపోయింది.

Anonymous on March 24, 2009 at 12:46 AM   said...

@నేస్తం; ప్రశ్నలకి సమాధానం ఉందండి. మనకి సిగ్గు ఉంది, ఒక సారి పొరబాటు చేసాము. మళ్ళీ ఆ పొరబాటు చెయ్యము - అని చేసి చూపించాలండి.

@శివ: అలా నవ్వుకుంటూ వెళ్ళీపోతే మురుక్కాలవలో పడిపోతామండి. ఇదే నండి సమయం - మన తఢాఖా చూపించాలి.

@స్నేహ: మీ పరిమితులలో - మీ చుట్టూన్నవారిని చైతన్యవంతులని చెయ్యండి. అదే పదివేలు.

@tethulika: ఇందులో రెఫరెన్సులు ఏం ఉంటాయండి? అప్పుడు చదివినవి, విన్నవి, కన్నవి. అప్పట్లో ఉవ్వెత్తున్న ఆవేశం ఎగదోసుకు వచ్చింది కదా! తరువాత మళ్ళీ మాములే. దున్నపోతు మీద వర్షం పడ్డట్టూ. అలా కాకుడదని మళ్ళీ ఇన్నాళ్ళకి అందరికి గుర్తు చేద్దామని. మనకి ఉండనే ఉంది గా ఒక గొప్ప పేరు "ఆంధ్రులు ఆరంభశూరులు" అని. నిద్ర లేస్తారని ఒక ఆశ. లేచి మంచి వారిని ఎన్నుకుంటారని ఒక కోరిక. "అరంభింబరు నీచ మానవుల్.." మన వాళ్ళు ముగించాలని.

మొన్న ప్రజాశక్తిలో చదివేదాక మీరు తెలుగు సాహిత్యాన్ని ఇంగ్లిష్ లోకి అనువదిస్తున్నారని తెలియదు.

పతంజలి గారి కధలు కొన్ని ఆయనే ఇంగ్లిష్ లోకి అనువదించుకున్నవి " Impish Chronicles and Doggish Dabbler" అవకాశం ఉంటే చదవండి.

మొన్న కె.రామలక్ష్మి గారి తో ముఖాముఖి -
ఇక్కడ చూసాను
"నా రాత" బాగున్నందుకు మీకు నెనరులు.:)

Post a Comment