చీరేసుకుంటారా?

ఏవిటో మరీ చాదస్తం ఎక్కువైపోతోంది ఈ మధ్య?
ఒహటే, తెలుగు,తెలుగు,తెగులు,తెలుగు అని అరవ గోలని అరవగోల?
అలా అలోచిస్తుంటే, ఎక్కడో ఒక తెలుగు బ్లాగులో (ఆడువారు) వ్రాసిందేలెండి!
కనపడింది.
చదువుకుంటూ వెల్తుంటే, మధ్యలో గొంతులో ఏదో అడ్డం పడ్డ అనుభూతి.

+ + +

మనం తల దువ్వుకుంటాము.
బొట్టు పెట్టుకుంటాము.
కళ్ళకు కాటుక రాసుకుంటాం.
చెవులకు కమ్మలు పెట్టుకుంటాము.
ముక్కుకి పుడక తగిలించుకుంటాము.
మెడకి గొలుసు వేసుకుంటాం.
చేతులకి గాజులేసుకుంటాం.
రవిక కట్టుకుంటాము.
లంగా కట్టుకుంటాము.
చీర వేసుకుంటామా లేక కట్టుకుంటామా?
+ + +

అదండి, అనుమానం! నివృత్తి చెయ్యరూ! ఎదో ఒహటి, కట్టుకోవడమో, వేసుకోవడమో!
ఒహటే సణుగుడని, సణుగుడు.
చీర కట్టుకునో, వెసుకునో వస్తారుగా, లంగా జాకెట్టుతో అలా రోడ్డు మీదకు రారుగా ఆ కేరళ వాళ్ళ లాగ అంటారా?
ఐనా మరీ చోద్యం కాకపోతే, ఇంకా లంగా, చీర, జాకెట్టు ఎక్కడవండీ!
చక్కగా ఆ చురీదారు తగిలించుకోక?
ఓహో, కట్టుకోవడం,వేసుకోవడం ఐపోయిందా, ఇప్పుడు తగిలించుకోవడం వచ్చిందా?
ప్చ్!
ఏవిటో, మరీ చాదస్తం ఎక్కువైపోతున్నది, వయసొస్తున్నకొద్ది!



పూర్తిగా చదవండి ...

లలిత ఇక లేదు!

Posted by netizen నెటిజన్ on Wednesday, August 27, 2008
లలిత చనిపోయిందని పొద్దులో చదవగానే బాధవేసింది. తను అనారోగ్యంతో ఉన్నదని ఊహించుకోగలిగాను కాని మరణానికి అంత చేరువలొ ఉన్నదని అనుకోలేదు.

"రౌద్రి" కన్నా నేను తన ఆంగ్ల బ్లాగుకే దగ్గిరయ్యాను. అదే అఖరుసారి అని తెలియనప్పుడు, నేను తన బ్లాగ్ లో వ్యాఖ్యానించినప్పుడు, ఎంతో సాదరంగా, స్వాగతించింది లలిత. శ్ర్రీపాద వారి కొత్త అవకాయ, వెన్నపూస రుచుల గురించి ప్రస్తావించింది. తనకు తెలియకపోవచ్చు కాని తన అంగ్ల టపాలు ఏవి నేను వదలలేదు. కాని ఇప్పుడనిపిస్తున్నది, అయ్యో, అవకాశం ఉన్నప్పుడు తనని కనీసం వ్యాఖ్యల ద్వారా ఐనా పలకరించలేక పొయ్యానే అని!

"వ్యూలు - రివ్యూలు" లో కూర్పరి చలసాని ప్రసాద్, శ్రీ శ్రీ పుస్తక పరిచయాలు, సమీక్షలు ప్రచురించాడు. అందులో, శ్రీ శ్రీ, లలిత వ్రాసిన కవిత్వ సంకలనం - "నిశీధి సంగీతం" (Dark Rhapsody) కి ఒక "ప్రివ్యూ" చూపించాడు. లలిత పుస్తకాలు చేతికి అందుబాటులొ లేవు, కాని ఈ పుస్తకం ఉంది.

అందులో శ్రీ శ్రీ లలిత గేయాల గురించి అన్న కొన్ని మాటలు:

*

ప్రివ్యూ

"రౌద్రి" కలం పేరుతో రాస్తున్న ఈ రచయిత్రి ఆరుద్ర రెండవ కూతురు భాగవతుల లలిత. బహుశ ఈ యధార్ధాన్ని నేను బయటపెట్టకూడదేమో? అయినా ఇంగ్లిష్‌లో "నెత్తురు నీటికన్నా చిక్కన" అనే నానుడి వుంది. భాగవతుల వంశంలో నాది తల్లివైపు చుట్టరికం. ఈ రక్త సంబంధమే మళ్ళీ మా ఇంట్లో కవితాసౌరభం గుబాళిస్తున్నదన్న విషయాన్ని గోప్యంగా ఉంచనివ్వడంలేదు.

And now, I shall permit myself for a moment to forget that the writer of these poems is my grand niece. Seeing before me a group of poems of unequal length as well as merit, I attempt an objective appraisal of their value as poems.

"ఏమీ కనిపించని చీకటిలో చెవులకు మాత్రమే వినిపించే సంగీతం ఇందులో ఉన్నది."

*
ఇంకా చాలా వ్రాశాడు కాని, ఆయన ఆ మొత్తం పాఠం ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు.

ఏది ఏమైనా ఒక మంచి మిత్రురాలు దూరం ఐపోయింది.
బ్లాగు ప్రపంచంలో కూడా జనన మరణాలు ఉంటవి అన్నది కఠోర సత్యం.



పూర్తిగా చదవండి ...

Labels:

"..ఇంకెవరన్నా ఉన్నారాండీ..?"

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కమ్మవారు, రెడ్లు కాక ఇంకెవరన్నా ఉన్నారాండీ, మిగిలిపోయినవారు? వారిని కూడా చేర్చేస్తే, మన భారతదేశంలొ అందరూ ముందుకు వెళ్ళవచ్చుకదా!

ఒకప్పుడు, మన రైల్వేలలో "ఇంటర్" అని ఒక తరగతి ఉండేది, మరి ఈ బ్లాగర్లలలో ఎంతమందికి అది తెలుసో? అలాగే మూడవ తరగతి కూడ ఉండేది.

అన్నీంటిని కలిపేసి, ఈ రోజున ఒక ఫస్ట్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ గా మార్చేసి, భారతదేశంలో, మూడవ తరగతి లేకుండా చేసేసే నాయకులని ఎన్నుకున్న మనం, ప్రపంచంలోనే రాజకీయంగా అత్యంత చైత్తన్యవంతమైన పౌరులం కాదా?

నేటి ఈనాడులో శ్రీదర్ మాట!
అన్‌లైనులో ఈనాడు, ఈపేపర్‌లోనే కనపడుతున్నది ఈ కార్టూన్! రిజిస్టర్ అయి లాగిన్ ఐతే చూడవచ్చు. http://epaper.eenadu.net/login.php



పూర్తిగా చదవండి ...

ఆకలి

ఆకలి.
అర్ధరాత్రి దాటింది, ఇంటికి చేరేటప్పడికి.

ఆకలి.
అవుట్ డోర్ షూటింగ్ కదా. ఆడవి లాంటి ప్రదేశం.
తినడానికి ఏమి దొరకలేదు.

ఆకలి.
తాగడానికి మట్టుకు చాలా బాటిల్స్ ఉన్నవి.
తాగినంత తాగి, కారులో కూడా తాగుతానే ఇంటికి చేరడం.
డూప్లెక్స్ ఇల్లు అది.
ఇల్లు కనపడగానే ఆకలి ఇంకా ఎక్కువయ్యింది.
అక్క చాల బాగా వండుతుంది.

ఆకలి.
అక్క వంట గుర్తుకి రాగానే ఇంకా ఎక్కువయ్యింది, ఈ అకలి.
అక్క బావగారు పై ఫ్లోర్‌లో ఉంటారు.
తలుపు తాళం డూప్లికేట్ కీ తో తెరుచుకుని, లోపలికి వెళ్ళగానే, ఎదురుగుండా ఫ్రిడ్జ్.
రా, రమ్మని పిలుస్తున్న ఫీలింగ్.
చప్పుడు కాకుండా, చేతిలో ని బీరు బాటిల్ని టేబుల్ మీద పెట్టి ఫ్రిడ్జ్ తెరిస్తే రెండు గిన్నెలు.
ఒక దానిలో అడుగున అన్నం కాస్తంత మిగిలింది.
మరొక దాంట్లో కొంచెం పెరుగు.
సింక్‌లొ చూస్తే, కనబడుతున్నదిగా పెద్ద పార్టి జరిగింది.
ఒక్కసారిగా నీరసం ఆవహించింది.

ఆకలి.
సింక్‌లో ఎవరో తినిపడేసిన పళ్ళెం తీసుకుని, అందులోకి ప్రిడ్జ్‌లో మీగిలిపోయిన అన్నం వడ్డించుకుని, ఆ మిగిలిన పెరుగు వెసుకుని నోట్లో పెట్టుకుంటే , అప్పటిదాక మషాళాలు తగిలిన నాలుకకి, ఆ చల్లటి అన్నం, పెరుగు రుచించలేదు.

టేబుల్ మీద ఉన్న బాటిల్ని, అందుకుని ఆ బీరుని అందులోకి వంపుకుని, అన్నం, పెరుగు, బీరు కలుపుకుని తిని
అక్కడే అలా నిద్రావస్థలోకి జారుకున్...



పూర్తిగా చదవండి ...

కాలిన్‌ ని చంపేసారు.

Posted by netizen నెటిజన్ on Thursday, August 21, 2008
అవును.
కాలిన్‌ని చంపేసారు.
కాలిన్ బ్రతుకాలని తన వాళ్ళతో కలిసి హాయిగా ఉండాలని ఎంత కోరుకున్నానో!
కాని లాభం లేక పోయింది.

కాలిన్ ఒక తిమింగలం లాంటి చేప పిల్ల. ఆంగ్లంలో whale (వేల్) అంటారు.
ఆరు నెలల బాలుడు.
కాలిన్ కి ఒక అమ్మ ఉంది.
ఒక నాన్న కూడ ఉన్నాడు.
కాలిన్ ఇంకా తల్లి పాలమిదే బ్రతుకుతున్నవాడు.
కాని ఎందుకనో ఆ తల్లి ఈ బిడ్డని దగ్గిరకు తీసుకోలేదు.
కాలిన్ అప్పుడు సిడ్ని దగ్గిరలోని చిన్న నౌకని తన తల్లిగా భావింది పాల కోసం వెతుక్కుంటూ ఉంటే, ఆస్ట్రేలీయన్ పర్యావరణ శాఖ వారు సముద్రంలోకి మళ్ళించినా, కాలిన్ వెనక్కి తిరిగి మళ్ళి ఆ సముద్రతీరానికే చేరుకుని ఆక్కడి పడవలని, ఒదలకుండా వాటి చుట్టే తిరుగుతు ఉండటం కనపడింది. కాలిన్‌కి కొన్ని గాయాలు కూడ ఐనవి.
సముద్రంలో ఒంటరిగా ఉన్న జీవులు బ్రతకడం కష్టం. అందులో కాలిన్ లాంటి పసి పిల్లలు.
అందుకని ఆ పర్యావరణ శాఖా వారు సాధ్యమైనంతవరకు కాలిన్‌కి తగిన చికిత్స చేసి బ్రతికిద్దామనే అనుకున్నారంట.
కాని తగిన ఆహరం లేక నీరసించిపోతూ, మరణానికి చేరువలో ఉన్న కాలిన్‌ని ఇక చంపేసి వాడిని బాధల నుండి గట్టేక్కించేయ్యడమే మెరుగని బావించినట్టున్నారు.
అందుకనే కాలిన్‌ ని చంపేసారు.
తప్పదేమో, నిజమే కాని ..
ఏవిటో నిన్నటినుంచి మనసు మనసులో లేదు.
అదే మన బిడ్డ ఐతే...

తాజాకలం: కాలిన్ మగ చేప పిల్ల కాదు. చనిపోయిన తరువాత స్త్రీ జాతి ది అని తెలుసుకున్నారు. (25 Aug 08)



పూర్తిగా చదవండి ...

పంద్రాగస్ట్ ఏవిటండి?

స్వాతంత్ర్ర దినోత్సవం అనో లేక  స్వాతంత్ర్ర దినోత్సవము అనో అని అనవచ్చుగా?
తెలుగు ఆంగ్లీకరించబడుతున్నది అని వాపోయే ఈ తెలుగు భాషా ఛాందసవాదులు కాక మళ్ళీ టెల్గు హిందికరించబడుతున్నది అని వాపోవడానికి?
* * *
మంచిగా ఉండు.
మంచిగా చెయ్యి,
బాగా చెయ్యి అని అనవచ్చుగా?
మంచిగా ఎందుకు అనకూడదు అని అంటున్నారా?

మరి "నెనర్లు" అని ఎందుకంటున్నారు?
కృతజ్ఞతలు అనో ధన్యవాదాలనో ఎందుకనటంలేదు?

లేదు ఈ కోస్తావారు, తమ తెలుగుని ఇతరుల మీద రుద్దుతున్నారు,మా మనోభావలు దెబ్బతిన్నవి కాబట్టి, ఆ తెలుగు వాడడానికి వీల్లేదు, మా తెలుగు వాడాల్సిందే అన్న ప్రాంతియ వాదానికి తెరలేపుతున్నారా?



పూర్తిగా చదవండి ...