చావు

Posted by netizen నెటిజన్ on Tuesday, September 30, 2008
ఆగకుండా ఎడం కాలిడ్చుకుంటూ "ముసల్ది మొన్న చచ్చిపోయిందంటగదా," అంటూ సాగాడు.
"ఎవరన్నారూ,అక్కాయి పోయిన నెలకి మధు పోయింది".
"ఏమిటొ, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పొయ్యే వాళ్ళు పోతుంటారు. నువ్వేమి అధైర్యపడమాకు, మేమందరమూ లేమూ".
"నేను, చిన్నాని, మొన్న ఎక్కడో విన్నాను, ఎవరికో బాగోలేదని..".
"మరి రామాపురంలో ఇల్లు ఎవరికి వ్రాసింది, అత్తయ్య?"
"పంపేసావంటగా? ఏం రోగం?"
"అదే, మొన్న విన్నాను. ఊళ్ళో లేను. సారి, వాజ్ ఇట్ పైన్‌ఫుల్?".
"హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యింది?"
"నువ్వు బాంబేకో, చెన్నైకో తీసుకెళ్ళాల్సింది. మొన్న లక్షి మొగుడ్ని అదే అస్పత్రిలో చేర్చారు. మూడో రోజుకి చచ్చూరుకున్నాడు".
"నేను రాలేన్రా, బోర్డ్ మీటింగ్ ఉంది. రాఘవన్‌కి చెప్పాను. డబ్బు తీసుకో, కార్లు రెండు పంపుతాడు. ఇంకా ఎవన్నా కావాలంటే రెడ్డికి చెప్పు. అన్ని చూస్తాడు. జాగ్రత్త. పరిమళ వస్తుందిలే."
" ముందే ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం తో జాగ్రత్తపడిఉంటే బాగుండేది."
" నా వల్ల కాదు అంటున్నాడు. వాడు మిగతవాళ్ళతో షేర్ చేసుకోవాలంట. వెయ్యికి తగ్గనంటున్నాడు."
"రామారావుకి ఫోను చెయ్యండి. ఆయనకి పరిచయాలున్నాయి."
"ఆ బంగారం అది ఎక్కడ ఉంది? అంతేలే. చాలా జాగ్రత్త మనిషికి."
"శవాన్ని ఇంట్లో పెట్టాడానికి వీల్లేదండి."
"ఇవి ఫ్లాట్లు కదా, పదిమంది, పది అబిప్రాయలతో, నమ్మకాలతో ఉంటారు. మరేం అనుకోవద్దు. ప్లీజ్, మీకు అన్ని తెలుసు."
"బెడ్ షీట్ కోసం వచ్చాం అమ్మా. బాడితో పాటూ మా బెడ్‌షీట్ కూడ వచ్చేసింది. ఉంచుకుంటే ఉంచుకొండి, ఒక ఫైవ్ హండ్రడ్స్ ఇప్పించండీ".
"కాఫీ తాగుతారా, టీ ఇవ్వమంటారా".
" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".

"Mother" (అమ్మ) మీద జిమ్మి ఆస్మండ్ పాడిన ఒక పాట ఇక్కడ వినండి.
* ఇది నూటయాభైయ్యవ టపా!


Reblog this post [with Zemanta]



పూర్తిగా చదవండి ...

మోహన్ చంద్ శర్మ

Posted by netizen నెటిజన్ on Saturday, September 20, 2008
సెప్టంబరు 19 న, శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్‌‍చంద్ శర్మ (41) వీరమరణం చెందారు. ఎన్‌కౌంటర్‌లో శర్మకు కడుపు, తొడ, కుడిచేతి భాగాల్లో తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 
ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందానికి నేతృత్వం వహించిన శర్మ పోలీసు శాఖలో సమర్థుడైన అధికారిగా పేరుపొందారు.  ఆయన గతంలో రాష్ట్రపతి నుంచి సాహస పతకంతోపాటు ఏడు పోలీసు పతకాల్ని అందుకున్నారు. 35 మంది తీవ్రవాదులను హతమార్చడం, 80 మందిని అరెస్టు చేయడంలో శర్మ కీలకపాత్ర పోషించారు.  
2005 లో  తమిళనాడులో జరిగిన తీవ్రవాద ప్రేళ్ళుల పరిశోధనలోను శర్మ పాత్ర తక్కువదేమి కాదు.  
ఏది ఏమైనా తీవ్రవాదులను ముట్టడించడానికి బయలుదేరిన శర్మ రక్షణ కవచాన్ని ధరించకపోవడం దురదృష్టకరం.



పూర్తిగా చదవండి ...

వారం, వారం ఆంధ్రజ్యోతిలో బ్లాగ్లోకం..కాదు కాదు..బ్లాగ్‌లోకం

ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఇక నుంచి మంచి, మంచి బ్లాగులని తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యడానికి నడుం బిగించింది. తెలుగు బ్లాగులకి మాత్రమే పరిమితమవ్వడం లేదు.

హైదరాబాద్ బుక్ ట్రస్ట్   వారి బ్లాగ్ పరిచయంతో ఈ ఆదివారం అంటే నిన్న మొదలుబెట్టారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
ఇక మీ బ్లాగులని గురించి కూడా వారికి తెలియజెప్పుకోవచ్చు.
తిన్నగా వారికే వేగు పంపవచ్చు.
మీ బ్లాగు వివరాలతో వారికి పంపండి - navyajyothy@gmail.com.
*  ఈ ఆదివారం అంటే నేడు 21సెప్టెంబరు 2008 నుండి బ్లాగ్లోకం - బ్లాగ్‌ లోకం అయ్యింది.



పూర్తిగా చదవండి ...