ఫరవా ఉంది

Posted by netizen నెటిజన్ on Thursday, January 22, 2009
నిన్న రాత్రి జీ తెలుగు(?) లో, క్రేన్ వక్క పొడి వారు సమర్పించే, ఔత్సాహిక (?) బాల గాయకులను పరిచయం చేసే "లిటిల్ చాంప్స్" అనే కార్యక్రమం ని (రాత్రి ౯ నుంచి ౧౦ దాకా) చూడడం తటస్థించింది. పదాతి దళంలో ఉద్యోగ చేసి, తరువాతి కాలంలో, తెలుగు చలన చిత్ర రంగంలో గేయ రచయితగా స్థిరపడిన -"భువనచంద్ర" ఆ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత. ఆయనతో పాటుగా, కీ.శే. సాలురి రాజేశ్వర రావు గారి మూడవ కుమారుడు , (బాబు మొదటి వాడు, వాసు(దేవ) రావు రెండవ వాడు) సంగీత దర్శకుడు (చిన్న కోటి అనేవాడు ఆఖరివాడు(పెద్ద)) కోటి మరొక న్యాయ నిర్ణేత. ఇంకొ మహిళ మూడవ న్యాయ నిర్ణేత గా పాల్గొన్నారు.
ముందే చెప్పుకున్నట్టు ఇది బాల గాయకులను పరిచయం చేసి, వారిలో అగ్రగాములను ఎంచుకునే కార్యక్రమం. నిన్న చూసిన ఆ కార్యక్రమంలో బాలికలు ౧౨ సంవత్సారాలలోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాప వయసు ౬ సంవత్సరాలు. పాల్గొన్న ఆ ఒక్క బాలుడి వయస్సు ౧౨ సంవత్సరాలు.
ఇక మన న్యాయ నిర్ణేతలు వాడిన తెంగ్లిష్ ఫ్రేజ్ లు మచ్చుకు కొన్ని:
" కొంచెం ప్రాక్టీజ్ చేస్తే బాగుంటుంది".
" ఒ.కే. గుడ్. గాడ్ బ్లెస్ యు".
" బానే ఉంది. కాని తినేస్తున్నావు. అందుకనే ఫీల్ పోతోంది'.
" యూ ఇన్వాల్డ్ యువార్సె ల్ఫ్ ఇం ది సాంగ్. బాగుంది. కీప్ ఇట్ అప్".
"నీది హస్కి వాయిస్. మెలొడి సాంగ్ ఎంచుకున్నావ్".
"సూపర్".
"కాన్ఫిడెంస్ పుట్టలు పుట్టలుగా ఉంది".
"ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు?"
"నీ సిన్సియారిటి బాగుంది".
"అవుట్ స్టాండిగ్. సింప్లి సూపర్బ్. సూపర్".
"వండర్ఫుల్".
"సింగింగ్, ఫీల్ సుపర్బ్".
"ఎక్సెల్లెంట్".
"..హిందుస్తాని మ్యూసిక్..కర్నాటిక్ మ్యూసిక్.."
'..రెండరింగ్..".
"అప్ప్రిసియేషన్..".
"ఒరిజినల్ వర్జన్..".
"..కంపొజిషన్..".
"ఆడియంస్ రవుండ్ ఆఫ్ అప్లాజ్..".
"..వందర్ఫుల్ వాఇస్.."
"గాడ్ బ్లెస్ యూ".
న్యాయ నిర్ణేతలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ,ఆ ౬ నుంచి ౧౨ ఏళ్ల పిల్లలకు,వారి తల్లి తండ్రులకు ప్రోత్సాహమిస్తూ,వారికి తమేదో గొప్ప సేవ జేస్తున్నామని భ్రమిస్తూ,కార్యక్రమాన్ని తిలకిస్తున్న అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని వెర్రి వెంగళప్పలను జేస్తు వాడిన ఆంగ్ల పదజాలం ఇది.
ఇక ఆ పిల్లలు, "థాంక్యూ" లు, క్యూ లు కట్టినవి.
ఇంతకి హస్కీ వాయిస్ తో, జార్జియస్ గా ఆ పిల్లలు పాడినవి, తమ విరహన్ని "ఫీల్" తో నింపి పాడిన పాటలు. సదరు కార్యక్రమంలో "సైడ్ కిక్" "మంకి" వాడు ఒకడు, ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడి తో వాడి "గెళ్ ఫ్రెండ్" గురించి ముచ్చటీంచాడు. 
ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడు పాడిన పాటలో ఒక "లీరిక్" -
"కాటుక కళ్ళతో కాటు వేసావు నన్ను ఎప్పుడో".
నాకిప్పుడు, నా కూతురి కళ్ళకి కాటుక పెట్టి, జడలో పూలతో పాఠశాలకి పంపాలని ఉన్నది.
పంపాలా వద్దా అన్నది తెలియడం లేదు.
" ఫరవాలేదు, ఆ కుర్రాడికి "కాండం" లు కూడా జేబులో పెట్టి పంపుతాం", అంటున్నారా?
మీకు ఫరవ లేదు. సరే, కాని నాకు ఫరవ ఉందే!

3 వ్యాఖ్యలు:

oremuna on January 23, 2009 at 12:17 AM   said...

:)

మీరు చెప్పినవన్నీ ఆంగ్ల పదాలా ?

Mahesh Khanna on March 2, 2009 at 10:58 PM   said...

ఇంగ్లీష్ పదాలు అటు ఉండనివ్వండి .. అది బ్రిటిష్ వాడి శాపమో మన ఖర్మనో ... అసలు ఎలా తయారయ్యింది అంటే .. ఇంకా ఆ సినిమా పాటలే అసలు సిసలు సాహిత్యం అన్నట్టు పిల్లలకు నూరి పోస్తున్నారు .. ఇంతకూ ముందు పోటి లో ఒక చిన్న పిల్లకు ఫైనల్ కు రిహార్సల్ ఇచ్చేటప్పుడు ఎందుకున్న పాట ఏంటో తెలుసా? లక్సు పాపా లక్సు పాపా లంచికొస్తావా? ..... దేవా ఎటు పోతోంది ఈ దేశం? పాపం ఆ పసి కూన సరిగా పడకపోతే ... అల కాదమ్మా ... బాగా ఫీల్ అవ్వాలి .. పాపా కాదు ..పాపహ్ .. ఆహ్ అనేది ఫీల్ అయి పడాలి అంట .. వాడి శార్ధం పిండాకూడు ... ఆ పిల్లెంటి ఆ వయేసేంటి ఆ పాటలేంటి ... ఐనా వల్లనని ఏమి లాభం .. వాళ్ళ తల్లి తండ్రులకు ఉండాలి జ్ఞానం ..

చూసే వాళ్ళు ఉన్నంత వరకు ఇలా తీస్తూనే ఉంటారు .. !!

రావు వేమూరి on March 3, 2009 at 7:02 AM   said...

ఒక్క తెలుగు వాళ్ళే ఇలా మాట్లాడతారా? భారతీయులందరూ ఇదే "వరసా?" గణాంకాలు తెలుసున్నవాళ్ళెవరైనా ఈ విషయం మీద రస్మి ప్రసరింపజేయగలరు!

Post a Comment