అరుణోదయం కావాలి!

Posted by netizen నెటిజన్ on Thursday, January 29, 2009
సరే. తుఫాను వెలిసినట్టుందిగా. ఇక  మొదలెడుదాం!
 అరుణం గారు ఒక కధ రాసారని తెలుగు బ్లాగ్ లోకంలోకి ఒక పెద్దాయన  వార్త చేరవేసారు.  అప్పటికి అరుణం లో ఆ కధ లేదు.  సరేలే, అనుకున్నారేమో, కతే అనుకున్నారు, కతయిత్రి గారు. కాని ఇంత కత అవుతుందని ఊహించి ఉండరు.  ఆ కతని తన బ్లాగులో పోస్ట్ చేసేసారు. ఇకనేవుంది.  అందరూ పోలోమని అరుణం గారు 'ఎవరికి తెలియని కధలివిలే' చదివేసేసి మాములుగా కొందరనేటట్టు బ్లాగుంది అని, మరి కొందరనేటట్టు  అభినందనలు (అంటే అభినందనలు అని కాదు కాని రమారమి అదే అర్ధం వచ్చేటట్ట్లు అని చదువేసుకోండేం) అని వగైరా వగైరాలు గా కమెంటేసారు.      

సరే, ఇక ఆ వగైరా, వగైరా లో చేరని  వారు కొంత మంది ఉంటారు కదా! అందులో ఒకరు తమకు తోచిందేదో కమెంటారు.  అరుణం గారికి అది నచ్చలేదు. బహుశ అది బ్లాగు కర్త దృష్టిలో  సంబంధం లేదని పించిందేమో?! అందుకని నాబ్లాగుకి నేనే మహ రాణిని, నాకు నీ కమెంటు నచ్చలేదు కాబట్టి సదరు కమెంటుని తీసేస్తానోచ్ అని తీసిపారేసింది.

అహా! నీ బ్లాగుకి నువ్వు మహారాణివి ఐతే, నేను నా బ్లాగ్ సామ్రాజ్యానికి అస్తమించని రవిని నేను , అంటు సదరు సూర్యుడు గారు తమ బ్లాగులో ఆ పారేసిన, ఏది, ఆ విసిరి పారేసిన కమెంట్ని, మహా ప్రసాదంగా కళ్ళకద్దుకుని తన బ్లాగులో పెట్టుకున్నాడండి.   (ఎంతైనా తనుకన్న కమెంట్ కదండి బాబు, కన్న కడుపుకి తెలుస్తుందండి, ఆ కడుపు తీపి )

సరే ఆ దారిన పోయిన దానయ్యలు వూరుకోరుగా! హెల్లొ, సన్ గారు, యేవిటీ కమెంట్, దీని కత ఏవిటి, ముందు వెనక ఫ్లాట్ గా ఉంది, జీరో సైజు లాగున, హెడ్డు, టెయిలూ లేకుండా ఉంది, ఇలా త్రిశంకు స్వర్గంలో పైన ఫాను లేకుండా, కింద స్టూల్ లేకుండా మీ కమెంటు అలా , వ్హిస్కిలో గుడ్డు లాగ తెలుతా ఉంటే, సూడ్డానికి, నిండా కష్టంగా ఉండాది, బేజారుగా ఉండాది అప్పా, అసలు స్టోరి సొల్లప్ప అనగానే సదరు  స్కై లోని సన్ గారు తన కంపోస్ట్ (కమెంట్  ప్లస్ పోస్ట్  = కంపోస్ట్ అని చదువుకోండేం? అశుద్దంతో తయారు చేసే కంపోస్టు వేరండి బాబు, అది ఇది గాదు, ఇది అది గాదు) సదరు అరుణోదయ కిరణాలకి (తన కంపోస్టులోనే లెండీ)ఒక గొళ్ళెం బిగించి కూర్చున్నారు.

కాగడ పట్టుకుని చీకట్లో చీకటి పనులు చేస్తున్న ఒక బ్లాగాంధుడి కి సదరు కధ తెగ నచ్చేసి,  కధ వెనుక చీకటి లో జరిగిన కధని తన బ్లైండ్ కళ్ళతో ౩డిలో  విజుయలైజ్ చేసేసి, నల్ల మందుతో మసక బారిన తన బ్లా(ం)క్ బుర్రతో ఒక కధ అల్లేసి, తనో గొప్ప కధకుడని పిచ్చ, పిచ్చగా ఫీల్ ఐపొయ్యి, ఈ   స్క్రీన్ ప్లే అంతా  కూడా తెగ నచ్చేసి, అస్సలు ఆ కధలోనే పెద్ద బూతుందని ఇంకా హేమిటేమిటో, హెవిటేవిటో రాసుకున్నాడు.(ట) 

దివిటి పట్టుకుని యెతికినా.
కూడలి లో. 
లె.
టూబ్ లైట్ ఏసి ఎతికినా.
లే.
అప్పుడు వెలిగింది.
కూడలిలో శరత్త్కాలానికి ప్రవేశం లేదు, అలాగే ఈ కాగడా లైట్ కి కూడా కూడలిలో అవుసరం లేదనిజెప్పి.
ఒసొస్.  ఇది ఇక్కడ కనబడదు.  జల్లెడెయ్యాల అని.  జల్లెడేసినా.  అప్పుడు కనబడింది ఆ కాగడ ఎల్తురు. 
అప్పుడు వచ్చింది.

కోపం.
చాలా కోపం వచ్చింది.
ఈ బ్లాగుల మీద.
ఈ బ్లాగ్ లోకం పెద్దల మీదాను.

కళ్ళాపి జల్లి, చక్కగా అలికిన వాకిలి అండి. ముగ్గులతో ముద్దుగా, ముచ్చటగా  ఉన్న వాకిలండి.  దాని మీద  ఒళ్ళంతా కురుపులతోను, రసి కారుతున్న ఒక పిచ్చి, గజ్జి కుక్క చండాలం చేసి చీకట్లోకి పారిపోయిదండి.   దాన్ని వెతికి పట్టుకుని, దాని జాతి, కుల గోత్రాలతో సహ  పరిచయం చేయాల్సిన అవసరం ఉందా?  పిచ్చి పట్టిన గజ్జి కుక్క ఇక్కడ ఉంది అని బ్లూ క్రాస్ వాడికో, మునిసిపాలిటి వాడికో ఒక ఫోను కొట్టి దానికి చెయ్యల్సిన ఏర్పాటు చేస్తే పొయ్యేది కదా?  

దానికి వాడి కత, వీడి కత, యెంకన్న కత, సుబ్బయ కత సెప్పాలాండి, యేను?

ఎలాగోలాగా ఈ బ్లాగ్ ప్రపంచం లోకి వొచ్చి పడ్డానండి.  చాలా మంది సెప్పారండీ, అబ్బో తట్టుకోవడం కట్టం, అందుట్లో  ఒంటరి ఆడది తట్టుకోవడం సానా కష్టం అని.  నేను తగ్గలేదండి. వెనకడుగువెయ్యలేదండి.  కాని సూత్తునే ఉన్నానండి.  ఆమధ్య లలితమ్మ గోరు వెళ్ళి పోనారండి. అంతకు ముందే ఒక రచయిత్రి గారు అమ్మ్మో, అంటూ  పారిపోయినారంట.  మొన్న పూర్ణమ్మ గారు బై చెప్పిసినారండి.  నిన్న అరుణం మ్మ గారు టా,టా సెప్పడానికి రెడి ఐపోనట్టు కనబడతాఉందండి.   

తెలుగు బ్లాగ్ లోకం లో ఒక  ఆడ కూతురు తన ఇష్టం వచ్చినట్టు రాసుకో గలిగిన రోజు ఎప్పుడు వస్తుందో?
అరుణం గారు,  మీరు ఇక్కడ దయిర్నంగా మీ కతలు రాసుకోండి!
సభ్య నామాలు, సంకేత పదాలు అఖ్ఖర్లేదండి!
అది శీలం మీదైనా, అశ్లీలం మీదైనా!
మన దేశంలో కుక్కలు రాదారి మీద తిరుగాడుతునే ఊంటాయి.
బయ పడమాకండి!     
ఇంత ఆలేసంగా ఈ టపా ఎందుకంటారా?
భవిష్యత్తులో మరి ఇలాంటి పొరబాట్లు జరగ కుండా ఉంటాయనండి!                                           
                                                                                                                                                                           * ఆడోళ్ళకితోలుమందంగాఉంటేబాగోదండి.
                      వారు సున్నితంగానే ఉండాలి అని ఒక భవదీయుడి  అభిప్రాయం,సుమండీ.

26 వ్యాఖ్యలు:

సుజాత వేల్పూరి on January 29, 2009 at 11:37 PM   said...

(అభ్యంతరకరంగా ఏమీ రాయకుండానే) ఇంతింత అభాండాలు వేసి ఆడవాళ్ళందరినీ బ్లాగులోకంలోనుంచే తరిమెయ్యాలని కంకణం కట్టుకోడానికి కారణమేమిటంటారు? ఇంత కసి దేనికి? చాసో కథల్లో ఒక చోట "తస్సా దియ్యా ఆడపిల్లలు చదివేస్తున్నార్రా" అని ఒక స్కూలు పిల్లాడు అన్నట్టు, కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు "ఆడ....ల్తోనా మంతనాలు?" అని మండిపడ్డట్టు....ఎందుకింత ఖసి? ఉక్రోషం? ఎవరి కిష్టమైనట్టు వాళ్లు రాసుకుంటే వీళ్ళకేంటి బాధ? ఎవరు వీరు? ఎదురు పడము కదాని ఎంతకైనా తెగిస్తారా?

Anonymous on January 30, 2009 at 12:42 AM   said...

నెటిజన్,
ధన్యవాదాలు అన్న మాట తక్కువ.. ఇప్పుడు మీకిక్కడ చెప్పడానికి. ఇంత అభిమానపూర్వకంగా టపా రాసి మరీ చెప్పింది మీరే. బోల్డన్ని ధాంక్యూలండీ. అనవసరమయిన గొడవ జరుగుతున్నప్పుడు... అదీ మన ఉద్దేశం అది కానప్పుడు.. ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది. చినికి చినికి గాలివానయినట్టు.. ఇంకా ఎంత జరుగుతోందో చూడండి. స్త్రీల అభ్యుదయం ఏమిటి.. కందుకూరి వీరేశలింగమో.. మహిళా సంఘాలో.. మరొకరో ఎందుకు పాటుపడాలబ్బా.. వాళ్ల సంగతి వాళ్లు చూసుకోలేరా అనుకునేదాన్ని లోకం పోకడ తెలియని చిన్నప్పుడు. ఇప్పడు తెలిసింది అందులోని స్ఫూర్తి. భయపడుతుంటే భయపెట్టే లోకాన్ని సున్నితత్వం కోల్పోకుండా ఎదుర్కోవడం కష్టం. అసాధ్యమయితే కాదు.

లక్ష్మి on January 30, 2009 at 12:51 AM   said...

"ఆడోళ్ళకితోలుమందంగాఉంటేబాగోదండి.
వారు సున్నితంగానే ఉండాలి అని ఒక భవదీయుడి అభిప్రాయం,సుమండీ"

enta baagaa cheppaarandi!!!

జ్యోతి on January 30, 2009 at 1:39 AM   said...

నెటిజన్ గారు,
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు , ఇప్పుడు గాలి నా మీదకు మళ్లింది కదండి.. ఏటి సేసేది??

Unknown on January 30, 2009 at 1:49 AM   said...

వొంటరి ఆడది గారు మీరు వ్యంగానికే ప్రాధాన్యం ఇచ్చారు గాని విషయానికి ఇవ్వలేదని అర్ధం అవుతూనే వుంది. అరుణం కధ కి న కామెంట్ యెంత మాత్రం అసభ్యం కాదన్నా విషయం న కామెంట్ చూసిన మనిషికి ఎవరి కైనా తెలుస్తుంది.ఆశుద్దాన్ని గుర్తు పట్టి తినే పంది కి తప్ప.ఆ కధ లోని కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని రెండు సినిమాలో సంఘటనలు ఉదహరించడం జరిగింది. అందులో అసభ్యత ఎక్కడుందో విజ్ఞులు మీరే చెప్పాలి.ఇంక బ్లాగ్లోకానికి వస్తే ఆడకూతురు సంగతి దేవుడెరుగు మగకోడుకే తనకి తోచింది రాసుకోలేని పరిస్తితి దాపురించింది. నారాయణ అంటే బూతు మాట అని వెలి వెయ్యిన్చేస్తున్నారు కూడలి నుంచి వాళ్ళకున్న connections వుపయోగించుకుని.గాలి పోగు చేసుకుని దెబ్బలాడు కోవడం అంటే ఇదేనేమో.

Kathi Mahesh Kumar on January 30, 2009 at 1:51 AM   said...

మీ టపాతో నా అంగీకారాన్నీ దాంతోపాటూ అభినందనల్నీ తెలుపుతున్నాను.

Anonymous on January 30, 2009 at 6:10 AM   said...

నేను కూడా మహేష్ గారితో గొంతు కలుపుతూ మీకు నా అభినందనలు చెబుతున్నాను.

Anonymous on January 30, 2009 at 6:32 AM   said...

నేటిజన్ గారు శబాష్ చాలా బాగా చెప్పారు.ఇంత కుళ్ళెంటండీ బాబు ఈ రవిగారికి.ఇంక రవిగారు అతను (దూమ్మచారె ) చెప్పిన మాటలను నమ్మరులే హుందాగా సమాధానం ఇస్తారనుకున్నాను.కాగడ శర్మ అంటా వాడి బొంద వాడు రాసే పిచ్చిరాతలన్నీ చదవడం లేదని అలా గింజుకుంటున్నాడు.అయినా వాళ్ళగురించి మాట్లడుకోవడం కూడా time waste అండి బాబు .ఇలాంటి వాళ్ళ వల్లే మగాళ్ళను ప్రతిసారి తిట్టాలసివస్తుంది అనవసరం గా .. నేనే రాద్దం అనుకున్నా పోస్ట్ మళ్ళా బోడి వీళ్ళ గురించి ఒక పోస్ట్ కూడా రాయాలా అని వదిలెసా

oremuna on January 30, 2009 at 6:44 AM   said...

good one.

BTW Netizen,

I have my own doubts on you. seems I am mistaken :)You wrote very well.

Ignoring Trolls is the super best thing we can do. Ofcourse tana daakaa vastE kaanI telIdanukOMDi.


Netizen,

You are awesome writer,

there are several Trojans in your essay, is it intentional?

సూర్యుడు on January 30, 2009 at 6:47 AM   said...

అహా! నీ బ్లాగుకి నువ్వు మహారాణివి ఐతే, నేను నా బ్లాగ్ సామ్రాజ్యానికి అస్తమించని రవిని నేను , అంటు సదరు సూర్యుడు గారు తమ బ్లాగులో ఆ పారేసిన, ఏది, ఆ విసిరి పారేసిన కమెంట్ని, మహా ప్రసాదంగా కళ్ళకద్దుకుని తన బ్లాగులో పెట్టుకున్నాడండి. (ఎంతైనా తనుకన్న కమెంట్ కదండి బాబు, కన్న కడుపుకి తెలుస్తుందండి, ఆ కడుపు తీపి )

ఇక్కడ నా (మారు)పేరు ని అనవసరంగా లాగారేమో, కొద్దిగా ఆలోచించండి.

Anonymous on January 30, 2009 at 6:56 AM   said...

చూపులతో చీల్చేస్తుంటే చెంగు నిండా కప్పుకున్నాం
మాటలతో హింసిస్తుంటే మౌనం ముసుగులో దాక్కున్నాం
చేతలతో యుద్ధానికి దిగితే సహనాన్నే కవచంగా ధరించాం
ఇప్పుడు , రాతలతో రాద్ధంతం చేస్తుంటే , ఏంచేద్దాం ....ఏం చేద్దాం ?
అమ్మని, అక్కని కూడా ఆకతాయితనంతో అవహేళన చేస్తుంటే
ఏం చేద్దాం...ఏం చేద్దా?
అమ్మ మనసుతో ఆలోచిద్దాం .
వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్ధిద్దాం

జీడిపప్పు on January 30, 2009 at 7:02 AM   said...

నేను కూడా మహేష్ గారితో గొంతు కలుపుతూ మీకు నా అభినందనలు చెబుతున్నాను. (thanks chaduvari garu!)

రవిగారు, మీరు పదే పదే "మగకోడుకే తనకి తోచింది రాసుకోలేని పరిస్తితి దాపురించింది." అంటుంటే నవ్వాగడం లేదు.

ఒక్కసారి http://dhoommachara.blogspot.com/ లో నా కామెంటు చూడండి.

ధూంగారు, నేను ఈ మధ్యనే కొత్త బ్లాగులు తెరిచాను.
బ్లాగుల గురించి కాస్త అధ్యయనం చేసి, తర్వాత బ్లాగు మొదలు పెట్టినపుడు క్రిందివి అనుకున్నాను.
*బ్లాగడం వల్ల అర్థ నయా పైసా లాభం కూడా లేదు, మన తుత్తి తప్ప
* ఇంకొకరు మనల్ని తిట్టినా అర్థ నయా పైసా నష్టం లేదు, ఈ virtual world లో
* ఎవరూ నన్ను శాసించలేరు. నేనే నా బ్లాగులో వాళ్ళ కామెంట్లను శాసించగలను. నా బ్లాగుకు నేనే రాజు, నేనే ETV సుమన్ (ఇది ఎక్కడో చదివి కాపీ కొట్టాను). నన్ను, నా బ్లాగును శాసించే హక్కు, అధికారం, అవకాశం ఎవరికీ లేవు. అలా ఉన్నాయంటే నేనొక చేతకాని ఎదవ.

మీరు " ఇప్పుడు ఆ కొందరే బ్లాగ్‌ ప్రపంచాన్ని తమ కనుసైగతో శాసిస్తున్నామనుకుంటున్నారు. " అన్నారు. నన్ను శాసించే శక్తి ఎవరికీ లేదు, రాదు. మరి మీరేంటి ఇలా అంటున్నారు. కాస్త వివరంగా తెలుపగలరా?

Anil Dasari on January 30, 2009 at 7:51 AM   said...

ఏమిటి కధ? ఏమిటా గోల? ఏదో ఉందని అర్ధమౌతుంది కానీ అదేంటో తెలీటంలా. ఏదైతేనేం, ఈ నెల దాడి మహిళాడవాళ్ల మీదకి హోల్‌సేల్‌గా మళ్లిందన్నమాట. వాళ్లకి నా నైతిక మద్దతు.

శరత్ కాలమ్ on January 30, 2009 at 9:05 AM   said...

ఇంత రాద్ధాంతం జరుగుతోందా? రెండు రోజులయ్యిది - మళ్లీ బ్లాగులు చదవడం మొదలెట్టి. గత కొద్ది రోజుల బ్లాగుల చరిత్ర తెలియదు కాబట్టి నాకు అంతా గందరగోళంగా వుంది. మీ టపాలో కొన్ని అర్ధం కాక ఇంకా కంఫ్యూజను. గజ్జి కుక్క ఎవరో, అరుణ గారి చక్కటి కథపై ఏవేవో ఊహించి ఎక్కడ రాసారో - అలాంటివి అర్ధం కాలేదు. బ్లాగ్లోకంలో వెతికి చూస్తాను.(ఒకరు అని సందేహిస్తున్నాను - వారి బ్లాగు కొంత చూసాను కానీ అరుణ గారి కథ మీద ఏమీ కనపడలేదు. మళ్ళీ ఆ బ్లాగు వివరంగా చూస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఆ బ్లాగ్ అభిమానిని నేను. మీరు చెప్పింది వారే చేసివుంటే మాత్రం ఖచ్చితంగా అది వారి పొరపాటే.)

అరుణ గారికి మరో సారి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాంటివేమీ పట్టించుకోకుండా ముందుకువెళ్ళాలని కోరుతున్నాను.

శరత్ కాలమ్ on January 30, 2009 at 9:12 AM   said...

రవి గారూ,
అరుణగారి కథ మీది మీ వ్యాఖ్యలో నాకు పొరపాటేమీ నాకు కనిపించలేదు - అలాగే వారు మీ వ్యాఖ్య ప్రచురించకపొవడం - మీరు ప్రచురించడం - ఇవన్నీ నా దృష్టిలోనయితే సరి అయినవే. ఎందుకంటే ఎవరి బ్లాగుకి వారే తాలిబాన్ అన్నది నా సామెత!

ఓ బ్రమ్మీ on January 30, 2009 at 9:33 AM   said...

* ఆడోళ్ళకితోలుమందంగాఉంటేబాగోదండి.
వారు సున్నితంగానే ఉండాలి అని ఒక భవదీయుడి అభిప్రాయం,సుమండీ
-----------------------
ఈ అభిప్రాయానికి ఈ భవదీయుడు వ్యతిరేకి. ఎవ్వరు చెప్పారండీ ఇలాగే ఉండాలని!! ఇలా సున్నితంగా ఉంటే, ఓ ఇందిరను మన రాజకీయ్యాలు మిస్ అయ్యేవి.. రాజకీయంగా ఇందిరమ్మకు మిత్రువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు. కావున వీరి ఉదాహరణ ఇక్కడ వద్దనుకుందాం. మరి ఝాన్సీ లక్ష్మీ బాయికి సున్నితంగా ఉంటే పోరాడే మనోధైర్యం ఎక్కడ నుంచి వచ్చేది. పాలిచ్చే తల్లి పిల్లవానితో యుధ రంగానికి చేరుకుని పోరాటం సాగించిందే, ఇది ఒక కధ అను కొట్టి పారేయ్య మంటారా..
ఏది ఏమైనా, ఆడవాళ్ళు అని వాళ్ళని వేరు చెయ్యకండి. భౌతికంగా మనకీ వీరికీ తేడా తప్పితే, మిగిలిన అన్ని విషయాలలో వీరు ఏమీ తీసి పోనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే మీలాంటు వారి అభప్రాయాల వల్ల మీరు ఉదహరించిన మహిళా బ్లాగర్లు వారి బ్లాగులు మూసేశారనుకోవచ్చు కదా. కాకపోతే మీ అభిప్రాయంలో తీవ్రత శాతం తక్కువ, మిగిలిన వారిలో అవశరమైన దానికన్నా ఎక్కువ అని ఈ భవదీయుడి అభిప్రాయం

అసందర్బం అనిపిస్తే, క్షమించ గలరు.

Anonymous on January 30, 2009 at 8:33 PM   said...

మీ టపాలోని వ్యంగ్యానికి నవ్వుకుంటూ, విషయంతో ఏకీభవిస్తున్నాను. ఆభినందనలు.

Ramani Rao on January 30, 2009 at 10:21 PM   said...

అభినందనలు నా తరుపునుండి కూడా

Siri on January 31, 2009 at 2:06 PM   said...

భలే రాసారండి.
అయినా ఇంత కుళ్ళేంటో అర్థం కావడంలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోక ఇలా మెయిల్ ఐడి లు హ్యాక్ చేయడం. ఎవరో ఏదో ఆంతరంగిక గుంపులో ఏదో మాట్లాడుకుంటే దాన్ని హ్యాక్ చేసి బ్లాగుల్లో రాసుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు.
ఇక్కడ ఎవరైనా సైబర్ లా గురించి తెలిసిన వాళ్ళు వుంటే వ్యక్తిగత మెయిల్ ఐడిలు, ఆంతరంగిక గుంపుల్లో చొరబడడం లాంటి వాటి గురించి సైబల్ లా లో ఎమైన వుంటే వివరించగలరా??
ఎవరైనా మన ఇంట్లో బలవంతగా జొరబడితే అప్పుడు నిజజీవితంలో తప్పంటాం కదా.మరి ఈ మెయిల్ లు కూడా మన వ్యక్తిగతం కదా వాటిలోకి మన అనుమతిలేకుండా చొరబడితే ఏమిచేయాలి? ఎవరినా తెలిసిన వాళ్ళు చెప్పగలరు?
నెటిజెన్ గారు, మీటపా కు సంబంధం లేని విషయం అనుకుంటే తొలగించండి.

netizen నెటిజన్ on February 1, 2009 at 5:28 AM   said...

@సుజాత: అరుణం మ్మ "జాగ్రత్త" లో చెప్పినట్టు రాయాలన్న ఉత్సాహం కొంత ఐతే, ఎదురుపడముగదా అని కొంత ధైర్యం అండి!మీ రాతలు మీరు రాసేసుకోండి. ఈ విషయంలో పురుషులకొక నీతి, స్త్రీలకొక నీతి ఉండకూడదు. అర్ధరహితమైన, అసమంజసమైన, అసంగతమైన, అసంబద్ధమైన, అక్రమమైన వ్యాఖ్యలని, వ్యాఖ్యానాలని, బ్లాగులని పట్టించుకోరాదన్నదే అన్నదే ఈ టపా సారాంశం!

@ అరుణ పప్పు: మీ ధన్యవాదాలు, థాంకులు ఎందుకులెండి! మీరన్న "...భయపడుతుంటే భయపెట్టే లోకాన్ని సున్నితత్వం కోల్పోకుండా ఎదుర్కోవడం కష్టం. అసాధ్యమయితే కాదు", అని అంటూనే "జాగ్రత్త" అనేసారు కదా అంత సున్నితంగాను, దానికి మీకే అభినందనలు. సాగండి ఇక ముందుకు. ఇంకొక పదిమందికి స్ఫూర్తి నివ్వండి. ఈ టపా దృషి కి న్యాయం చేసిన వారవుతారు. అదే పదివేలు. మరొక విషయం. ఇక మీరన్నట్టు, "చినికి చినికి గాలివానయినట్టు.. ఇంకా ఎంత జరుగుతోందో చూడండి", అని అన్నారు - ఈ బ్లాగులో వ్యాఖ్యల ద్వారా మీ కధ మీద జరిగే చర్చను గమనించండి, మీకు ఇష్టమైతేనే సుమా!

@ లక్ష్మి: ఔను. కొన్ని సందర్భాలలో సున్నితమైన అంశాలను సున్నితంగా వారే పరిష్కరించగలరు. ఉదా: అరుణం లోని అదితి పాత్ర - ఆమె కధే.

@ జ్యోతి: "..... ఏటి సేసేది??" ఏటి సెయ్యద్దు. గమ్మున కూకుని సిన్మా సూడండి. :)

@ రవిగారు; అంతర్జాలంలో తెలుగు లో వ్రాసేందుకు స్థాపించిన ఇ-తెలుగు కి మీ సేవలందించి ఇతోధికం తోడ్పాడినవారులో మీరు ఉన్నారన్నది తెలుగు బ్లాగు ప్రపంచంతో సంబంధం ఉన్న వారికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వారుంటే వారికి ఈ వ్యాఖ్య చదవగానే అవగతమవుతుంది. భాగ్యనగరంలో ఉన్న మీరు హై బ్లా స కార్యక్రమాలకు హాజరవుతారన్నది కూడా అందరికి తెలిసిన విషయమే. తోటి మహిళా బ్లాగరులతో మీకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, పరిచయాలు ఉండే ఉంటాయి అన్నది నిర్వివాదాంశం. (చాయ చిత్రాలలో మీరున్నారు కదా?)

అలాంటప్పుడు మీరు లజ్జాకరంగా, హేయంగా, నిర్లజ్జగా, నిర్లక్షంగా ఒక వ్యాఖ్యని చేస్తారని / చేసారని అనుకోవడం కూడా విచారకరం. అందుకు ప్రోది చేసిన సందర్భాలు ఎంత బలమైనవైనను.
ఇక మీరు మీ వ్యాఖ్య లో లేవనెత్తిన అంశాలకు జవాబు;
>అరుణం కధ కి న కామెంట్ యెంత మాత్రం అసభ్యం కాదన్నా విషయం న కామెంట్ చూసిన మనిషికి ఎవరి కైనా తెలుస్తుంది.
అది మీ అభిప్రాయం. అందరు దానితో ఏకిభవీంచాలన్న నీయమం ఏమి లేదు కదా? శాఖాహారులుంటారు. మాంసాహారులుంటారు. ఎవరి అభిరుచి వారిది. ఎవరి అభిప్రాయం వారిది.

> ఆశుద్దాన్ని గుర్తు పట్టి తినే పంది కి తప్ప.
మీరు మలభక్షకులు గురించి ప్రస్తావిస్తున్నారు. అది అవసరమా ఇక్కడ?

> ఆ కధ లోని కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని రెండు సినిమాలో సంఘటనలు ఉదహరించడం జరిగింది. అందులో అసభ్యత ఎక్కడుందో విజ్ఞులు మీరే చెప్పాలి.
ఇక అరుణం లోని కధలోని వస్తువు గురించి - కధలోని అంశం ఒక పాత్రికేయురాలు - అదితి - కి వృత్తిపరంగా ఎదురైన ఒకానొక సందర్భం. కధకురాలు ఆ పాత్ర (అదితి) ద్వారా దానిని అవిష్కరించిన తీరుతో మీకు ఏటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. మీ వ్యాఖ్యలోని ఈ వాక్యం "ఒక sensetive టాపిక్ ని ఎంచుకుని ఎక్కడా పరిధి దాట కుండా చక్కగా చర్చించారు" మే దానికి సాక్షం. మీరన్నంత ఆ మేరకు అరుణం బ్లాగులోని మీ వ్యాఖ్యానంతో ఏకీభవించగలను. మిగతా విషయాలకొస్తే, మీకు తెలియనిదేముంది. తెలుగుమీద ప్రేమతో ఇక్కడ బ్లాగుతున్నవారందరికి బ్లాగడం ఒక వ్యాపకమే గాని వారందరికి తమవంటూ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల బాధ్యతలున్నవి కదా? మిగతా అంశాలమీద సమయమున్నప్పుడు తగిన విధంగా టపాయించడమో, వ్యాఖానించడమో జరుగుంది.

> ఇంక బ్లాగ్లోకానికి వస్తే ఆడకూతురు సంగతి దేవుడెరుగు మగకోడుకే తనకి తోచింది రాసుకోలేని పరిస్తితి దాపురించింది.
సుమారుగా 15 వందలనుండి, 2 వేలమంది దాకా తెలుగు బ్లాగరులున్నారన్నది ఒక అంచనా. (స్త్రీ పురుష నిష్పత్తుల గణాంకాలు అందుబాటులో లేవు). వారిలో మీరొకరు. అది మీ అనుభవం. మిగతావారికి కూడా అటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు వారు ఇతరులతో పంచుకున్నప్పుడే కదా తెలిసేది, ఆ ఒక్క మగకొడుకు టపాలను కాని, వ్యాఖ్యలు కాని, ప్రవర్తనను కాని ఇతరులు ఎందుకని సహించలేకపొతున్నారన్నది.

> "నారాయణ అంటే బూతు మాట అని వెలి వెయ్యిన్చేస్తున్నారు కూడలి నుంచి వాళ్ళకున్న connections వుపయోగించుకుని."
తగిన సాక్షాధారాలతో నిరూపించండి. కూడలి నిర్వాహకులు తగిన రీతిలో తప్పకుండా స్పందిస్తారు అన్నది ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఇంకొక ప్రాధమిక సూత్రాన్ని మీరు గమనంలో ఉంచుకోవాలి. కూడలి లేక పోయినా బ్లాగులుంటాయి. కాని బ్లాగులే లేకపోతే కూడ లి ప్రస్తుత రూపంలో మనలేదు. అది కూడలి నిర్వాహకులకి తెలుసు అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు. పైగా మీరే ఎక్కడో అన్నట్టున్నారు, కూడలి కన్నా తొందరగా/ ముందే కూసే తెలుగు బ్లాగ్ కోళ్ళు చాలా ఉన్నవని. కూడలి నిర్వాహకులు అది తెలియని అజ్ఞానులు అని అనుకోకూడదేమో!

వొంటరి ఆడదాన్నైనా నాకు కూడలి లో గాని "ఆ పెద్దలు" తో గాని "సంపర్కాలు" ఏమి లేవండి!
(తెలుగు పదం సభ్యులు , ఈ సందర్భంలో ఈ "సంపర్కాలు" అన్నది సరైన పదమేనా, చెప్పగలరు).

>"గాలి పోగు చేసుకుని దెబ్బలాడు కోవడం అంటే ఇదేనేమో".
మరి చిన్నపిల్లల ఆట లాగుంది కదూ? :) దీనిని ఇంతటితో అపేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా?

@ కత్తి మహేష్ కుమార్; అభినందనలు దేనికి? మాటలు పడడానికి తయారైనందుకా?

@నేస్తం: :)

@ chaduvari: దేనికి?

@ నేను: రవి గారికి కుళ్ళు లేదండి. మీరు ఉదహరించిన మిగతా వారిని గురించి ప్రస్తావన అనవసరం అన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తారు. అందుకనే వారి ప్రస్తావన ఇక్కడ తీసుకురాలేదు.

@ oremuna:
> I have my own doubts on you.నెనరులు.
> seems I am mistaken :)మీరు అపోహలు గురికావడం లోను, అపార్ధాలకు లోనవ్వడంలోను అసందర్భం ఏమి లేదు. దాని లోనుంచి బయట పడ్డానని అన్నారు. సంతోషం. రాగద్వేషాలకు ఎవ్వరూ అతీతులు కారు. అతీతులైనప్పుడు వారిక్కడ ఉండరు. జీవితం పాఠాలు నేర్పుతునే ఉంటుంది. కొంత మంది కొంత కాలానికి నేర్చుకోవడం అనేక కారణాల వల్ల మానేస్తారు. గడపదాటిన స్త్ర్రీ పడుతున్న బాధలు తెలుసండి.
> You are awesome writer: నిజమా? అంత బాగుందా ఈ టపా? ఇప్పటి మీ ప్రశంశాపత్రం ఆదివారం , ఆంధ్రజ్యోతి లోని నవ్యలో బ్లాగ్ లోకం శీర్షికలో ఈ బ్లాగుని పరిచయం చెయ్యడానికి ఉపయోగపడుతుందంటారా? వారు పరిచయం చేస్తారంటారా ఇక ఇప్పుడు? లేకపొతే ఈనాడులో! సాక్షి ? వార్త ఐనా ఫరవాలేదు, సర్దుకోవచ్చు. :)

> there are several Trojans in your essay, is it intentional?
ఏ ట్రొజన్ల గురించి మీరు అంటున్నది?

@ సూర్యుడు: కొద్దిగా ఏం ఖర్మ ఎక్కువగానే.. చించాం, అది మిమ్మల్ని ఉద్దేశించికాదని మీకు తెలుసు ఐనా ..;) సరే.. సూర్యుడు బదులు కిరణుడు లేదా దివాకరుడు లేదా దినకరుడు లేదు ఎండదొర తదితర నామాంతరాలాతో చదువుకోండి. రేపు వీళ్ళందరూ వరుస కట్టి ఇక్కడ నిలబడితే ఏం చెయ్యాలో? అసలే మన బ్లాగర్లు , ఈ మధ్య విరివిగా సాహితీవేత్తల పేర్లే కలం పేర్లుగా వాడుతున్నారు, ఆత్రేయ అని, రామకృష్ణ్ అని, వికటకవి అని, సిరిసిరి అని..శాస్త్రి అని, మరింకే పేర్లేమి దొరకనట్టు..:)

@ లలిత: లలితమ్మ వచ్చారా..ఎన్ని రోజులయ్యిందో మిమ్మల్ని చూసి ఈ బ్లాగులో. చాలా సంతోషం. మష్తిష్కంలోలోపలి పొరలలో ఎక్కడో అనుమానం..ఈ బ్లాగులోని వ్యాఖ్యల మూలంగా మీరు దూరం గా వెళ్ళిపొయ్యారేమోనని..అవును మీరన్నట్టే వారికి మరి సంపూర్ణమైన మానసిక ఆరోగ్యం కలిగి సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

@ జీడిపప్పు; స్వాగతం, సుస్వాగతం. ఇదే ననుకుంటాను మొదటిసారి, మీరు ఈ బ్లాగులోకి అరుదెంచటం!

@అబ్రకదబ్ర: ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ్, గోకర్ణ, టక్కు టమార , కట్టు, కనికట్టు లాంటి మేటి మాయాజాలాల్నె రిగిన మాంత్రీకులు మీరు. మీకు తెలియకుండా ఉండదు. శోధించండి. కూడలికి జై! జల్లెడకు జై! గూగులమ్మకి జై!

@ శరత్ 'కాలం' : మీరనుకుంటున్నవారే, ఆ టపా రాసుంటే, నిస్సందేహంగా ఆ తప్పు వారిదే అనటం లో ఏ మాత్రం అనుమానం లేదు. కాని దయచేసి పిచ్చి పట్టిన ఆ గజ్జి కుక్క గురించి వివరాలు అడగవద్దు. అ వివరాలు మీకు ఈ బ్లాగులో లభ్యం కావు.

@ చక్రవర్తి: మీ అభిప్రాయం, మీది. ఎవరి అభిప్రాయం వారిది. ఇక్కడ వచ్చిన చిక్కే అది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు మన్నించకపోవడం. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లనడం.
చక్రవర్తి గారు తోలు ఎక్కడ మందంగా ఉండాలో, ఉండ కూడదో మా స్త్రీ మూర్తులకి బాగానే తెలుసండి. దేవాలయాల్లోను, బస్సుల్లోను మగవాడిని కాలరు పట్టుకుని ఎడం కాలి చెప్పుతీసికొట్టిన వాళ్ళను మీరు చూసి ఉండక పోయినా , వారి గురించి చదివే ఉంటారు. కనీసం వినైనా ఉంటారు. పూలన్ దేవిని మరిచి పోయారు మీరు. మీకింకా వివరంగా ఇక్కడ వ్యాఖ్యల ద్వార జవాబివ్వడానికి సభ్యత అడ్డం వస్తున్నది. కారణం ఈ బ్లాగుని మీ మిత్రురాళ్ళు కూడా చదువుతున్నారు కాబట్టి.
>"అలాగే మీలాంటు వారి అభప్రాయాల వల్ల మీరు ఉదహరించిన మహిళా బ్లాగర్లు వారి బ్లాగులు మూసేశారనుకోవచ్చు కదా. " అవును సుమండి. అసలదే కారణమై నుండ నోపా? వారిని అడిగి చెబుదురు, మీకు పుణ్య ముంటుంది. ఐనా మీరెత్తిన అంశం అసందర్భం కాదు.

@ బాబు: అభినందనలా దేనికండి?

@ రమణి గారు; అభినందనలా ? భలేవారే!

Unknown on February 1, 2009 at 7:04 AM   said...

నెటిజెన్ గారు మీ విలువైన సమయాన్ని ఎంతొ వెచ్చించి ఇంత కష్ట పడి రాసారు.మీరు రాసిన ''అలాంటప్పుడు మీరు లజ్జాకరంగా, హేయంగా, నిర్లజ్జగా, నిర్లక్షంగా ఒక వ్యాఖ్యని చేస్తారని / చేసారని అనుకోవడం కూడా విచారకరం'' అసలు ఏమి వ్యాక్య చేశాను?ఎక్కడ రాసానో?చెపితే అటువంటి so called లజ్జా కరమైన వ్యాఖ్యల్ని తొలగించు కుని భవిష్యత్తు లో నా మీద మీ వంటి విజ్ఞుల టపాలు రాకుండా జాగర్త పడతా.నాకు లేని ఉద్దేశాన్ని ఆపాదించుకుని ఇతర బ్లాగ్ మిత్రురాళ్ళ కి నా మీద అపోహల్ని కలగా చెయ్యడం యెంత వరకు సమంజసం?నాకు అరుణ గారికి నా కామెంట్స్ విషయం లో ఎటువంటి అపోహలు లేవని ఘంటా పదం గా చెపుతున్నా.మిరనవసరం గా ఆవేశ పడ్డారు. అలాగే అశుద్ధ ప్రస్తావన నా కామెంట్ విషయం లో ముందుగా తెచ్చింది మీరే కనుక మల బక్షకుల ప్రస్తావన తేవలసి వచ్చింది.ఇక కూడలి నుంచి వెలివేసే విషయాని కొస్తే ,ఒక బ్లాగ్ మిత్రురాలి ద్వార నా కొచ్చిన సందేశం ఏంటంటే ఫలానా ఆవిడ మీద నా బ్లాగ్ లో వచ్చిన కామెంట్స్ తిసేయ్యక పొతే నా బ్లాగ్ ని కూడలి నుంచే కాక బ్లాగర్ నుంచి కూడా ఒక 25 మంది స్త్రీమూర్తుల సంతకాలు తీసుకుని తొలగిస్తారని దాని సారంశము. మీరు నొప్పుకున్న వొప్పుకోక పోఇన ఇక్కడ కొంత మంది కి pampering అలవాటై పోయి విమర్శల్ని ఏమాత్రం సహించే సహనం పోయి బెదర కొట్టే స్థాయి కి ఎదిగి పోయారు.నా తరఫు నుంచి ఇంక ఈ వివాదానికి తెర పెడుతున్నా, నా మానన నేను తోచింది రాసుకుంటూ పోతూ ఉంటా. మీరు మాత్రం కొంచెం నిస్పక్ష పాతం గా ,స్వపరాగా సంపర్కాల వత్తిడి కి (gender biased కాకుండా అని కవి భావం) లోను కాకుండా సమీక్షించి మీ అమూల్యమైన టపాలను రాయవలసినది గా నా విన్నపం.

Bolloju Baba on February 5, 2009 at 1:12 AM   said...

ఆలశ్యంగా చూసాను
మంచి పోస్టు. సమయోచితమైన డిస్కషను జరిగింది.
పోస్టులోని అంశాలకు నా మద్దతు తెలుపుతున్నాను. నెటిజను గారికి అభినందనలు, ధన్యవాదములు.

బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar on February 5, 2009 at 3:33 AM   said...

అన్యాయాన్ని ఎదురొడ్డి నిలుచునే శక్తి లేకపోయినా, కనీసం ఖండించైనా మన కర్తవ్యం నెరవేర్చాలని నమ్ముతాను. మీరు ఖండించడంతో పాటూ కాలూ దువ్వారు. అంతకంటే అభినందనీయం ఉంటుందంటారా!

Malakpet Rowdy on February 5, 2009 at 5:01 AM   said...

I'm a rookie here and may not know about the issue completely - so pardon me if I am getting the things wrong. From whatever I heard and read over the last 2-3 days, I think this issue has been blown out of proportion (mainly by the middle-men and women involved). A simple issue between two individuals has been made an international issue and a male vs female issue.

I did read those blogs that hurled offensive comments against the bloggers and and the authors DID NOT SPARE even the men. Mahesh Kumar was insulted, Baba was abused and Sridhar was mocked at too. But I am surprised at the deliberate attempts to project this as a Male Vs Female issue.

And about the "Freedom to write whatever we want" - Aint the misuse of this freedom the root cause of this problem? While one side is allegedly abusive, the other other side allegedly consists of bullies.

The other thing - I know, you being the expert bloggers, would have realized it better than me - I wouldnt have read Kagada Sharma's blog had this not been such a big issue. When I clicked on it, it should be "Adult Content" warning and I closed the window assuming that to be a Porn Site. But then, after going through the series of comments, I knew there was something else in his blog and went thru the whole that - This issue contributed to one additional hit to his blog from my side :))

I have been on the Internet for the last 15 years (Yes, even before Internet Explorer was born) and have been a regular on many chatrooms since 95 and the issue of abusive chatters (who underwent a metamorphosis as bloggers) has had no solution. Be it men or women, the best way is to ignore those folks, I repeat GENDER HAS NOTHING TO DO WITH IT. Even if you guys succeed in blocking somebody's IP address (Which is extremely tough, keeping in mind the fact that if one posts an abusive message hiding behind a proxy, all the users behind that proxy get blocked) the person can either mask his IP, find some anonymous proxy or use some Airport or a coffeeshop server to open a new account and post the messages. How many people can you guys go after?

And coming to the man in the centerstage, Ravigaru (Who never fails to amaze me with his ability to get into a controversy when there exists none) - looks like people dont have too many issues with whatever he writes but only with the comments pertaining to them. I am not sure whether a blogger can be ridiculed for the comments his blog receives. If he has his freedom to keep whatever he wants then he is legally entitled to do it, just as somebody else had the right to delete a comment posted.

About resolving the issues amicably, (Please pardon me if I am overstepping the line again but cant resist posting it) - somebody suggested that Ravigaru should have talked to Jyoti to resolve the template issue. I second that thought and feel that an effort should have been made to resolve that issue peacefully. But applying the same logic, wouldnt it have been better had Aruna requested Ravigaru to remove the comment he posted on her blog, instead of removing it herself? I am not saying she doesnt have any right to do it - but as somebody was talking about "Amicable resolution" in the second case, I thought it could have been applied in the first case as well.

If I remove my own comment, nobody cares, but if someone else removes my comment, then people will definitely wonder what filth I might have written. May be Ravigaru felt too sensitive about it and that resulting in the copy-paste. (I dont know for sure - thats why I said "May be")

and finally, Ravigaru: Why don't you delete those filthy comments posted on your blog and settle the issue once and for all? GOTI TO POYEDAANIKI GODDALI DAAKA ENDUKU SAAR?

netizen నెటిజన్ on February 5, 2009 at 7:45 PM   said...

@ రవిగారు:>"...అసలు ఏమి వ్యాక్య చేశాను?ఎక్కడ రాసానో?చెపితే అటువంటి so called లజ్జా కరమైన వ్యాఖ్యల్ని తొలగించు కుని భవిష్యత్తు లో నా మీద మీ వంటి విజ్ఞుల టపాలు రాకుండా జాగర్త పడతా.నాకు లేని ఉద్దేశాన్ని ఆపాదించుకుని ఇతర బ్లాగ్ మిత్రురాళ్ళ కి నా మీద అపోహల్ని కలగా చెయ్యడం యెంత వరకు సమంజసం?"
మీరు అలాంటి వ్యాఖ్యలు చేసారని అనలేదు. అలా చేసారని కొంతమంది మీ వ్యాఖ్యకి అలాంటివి అపాదించారన్నది విచారకరం అన్నది భావన.
ఇతరులు మీ మీద ఇతర బ్లాగ్ మిత్రురాళ్ళకి అపోహలని కలగజేసి ఉంటే వారు అలా చెయ్యడం మాత్రం చాలా అసమంజసం.
తెలుగు బ్లాగ్ లోకం లో "పంపెరింగ్" అలవాటైపోయిందన్న తీవ్ర మైన విమర్శ తెలుగు బ్లాగ్ లోకం వెలుపల కూడా ప్రచారం లో ఉంది.
మీకు అరుణం బ్లాగ్ కర్తకి ఎటువంటి అభిప్రాయబేధాలు లేనప్పుడు ఇక సమస్యే లేదు కదా?
మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు. వారిని గురించి మీరు పట్టించుకోవద్దు.

మీ అభిప్రాయాన్ని మీ బ్లాగు ద్వారా తెలియజేసుకోవడానికి ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మీ నుంచి చక్కని టపాలు, వ్యాఖ్యలు ఎదురు చూస్తుంటుందీ బ్లాగ్ లోకం!

తాజా కలం:
గతం లో ఈ బ్లాగులో ఇతరుల గురించి వచ్చిన (ఈ టపాకి సంబంధం లేదు వాటితో)వ్యాఖ్యల విషయంలో మీతో రెండు అనుభవాలు పంచుకుంటాను.

౧ - అశ్లీల పదజాలం తో వచ్చిన వ్యాఖ్యలను చెత్తబుట్టలోకి నెట్టేస్తాను. అలాంటి వ్యాఖలని ప్రచురించడం వల్ల పంపిన వారిని, వారి చర్యలని ప్రోత్సహించినట్టవుతుందని నా నమ్మకం. మనం ఆపేస్తే విసుగెత్తి వారే మానేస్తారు. ఒక బ్లాగరుగా అది తోటి బ్లాగర్ల పట్ల నా బాధ్యత అని విశ్వసిస్తాను. అందుకనే మీకు ఈ బ్లాగులో అలాంటి వ్యాఖ్యలు కనపడవు.
"మోడరేషన్ " (moderation) ఉన్నదందుకే!

౨ - నొచ్చుకున్న మరొక బ్లాగరు మనో నిగ్రహం కోల్పొయి, తనను తానే కించపరుచుకుంటూ మరొక వ్యాఖ్య ద్వారా తన ఆవేదన ని తెలియజేసినప్పుడు, దానిని ప్రచురించకుండా, సున్నితంగా ఆ వ్యాఖ్యాతకి తన కర్తవ్యాన్ని గుర్తు చేసాను. అది కూడా బాగానే పని చేసింది. ఆ బ్లాగర్ నేడు చాల సంయమనం పాటిస్తూ టపాలను వెలువరిస్తున్నారు. తనకు వచ్చే వ్యాఖ్యల విషయంలోను అంతే.

Post a Comment