ఎందుకని ?

నేడు ఉగాది.
బ్లాగులు ఉగాది పచ్చడి అని, పూజల గురించి టపాలు, శుభాకంక్షలతోను నిండి పోయినవి.  మరి నిజమే కదా?
తెలుగువారి పండగ కదా?
ప్రసారమాధ్యమాల సంగతి ఇక సరే, సరి.
ఒక్క విషయం మాత్రం అర్ధం కావటం లేదు.
మన తెలుగు టీ.వి లలోని తెలుగు మగవాడు మాత్రం - కనీసం ఈ పండగరోజున ఎందుకని మన తెలుగు సంప్రదాయాన్ని సూచించే వస్త్రధారణ ని గర్వించడంలేదు.
ఆశ్చర్యకరంగా ఉత్తర భారతీయ "ఆంకరమ్మ" లూ కూడ చీరకట్టు లో కనపడుతున్నారు.  మన తెలుగు టి.వి ఆంకర్ లు మాత్రం ఉత్తర భారత వస్త్రధారణ మీద మోజు చూపుతున్నారు.
చిరంజీవి కనపడ్డాడు - భుజాన కండువాతో.
నేడు జరిగిన ప్రమాదం నుండి, జూనియర్ ఎన్.టి.ఆర్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తూ,
వారందరికి, మీ అందరికి ఉగాది శుభాకాంక్షలతో..

3 వ్యాఖ్యలు:

అరుణ పప్పు on March 27, 2009 at 2:44 AM   said...

ఎందుకంటే, ఇప్పుడున్న వాతావరణంలో మహిళలను మాత్రమే సంస్కృతికి ప్రతిరూపాలుగా చూస్తున్నాం. మగవాళ్లందుకు మినహాయింపు. పెళ్లిళ్లకు కూడా ఆడవాళ్లు హడావుడిగా పట్టుచీరలూ నగలూ చుట్టబెట్టుకు వెళతారు తప్పితే మగవాళ్లు పంచె కట్టుకు వెళతున్నారా? ఆఖరుకి పెళ్లి పెద్దలు కూడా ప్యాంటూ షర్టుల్లోనో, సూట్లలోనో కనిపిస్తారు.అదీ తేడా. ఈమధ్య గమనిస్తున్నదేమంటే మగవాళ్లు ఉత్తరాది తరహా షేర్వానీలు వేసుకు తిరుగుతున్నారు సంప్రదాయ సందర్భాల్లో. వాళ్లకు సౌందర్య, సంప్రదాయ సాంస్కృతిక దృష్టి పెద్దగా ఉండదేమో మరి.

మధుర వాణి on March 27, 2009 at 3:11 AM   said...

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

Krishna on April 8, 2009 at 5:57 AM   said...

నమస్కారం !
నా కొత్త తెలుగు బ్లాగు లో ఒక కొత్త టపా రాసాను - "బూటు గొప్పా ? పెన్ను గొప్పా ? "
మీ అభిప్రాయాలు తెలుపగలరు!

Post a Comment